[టూటీ…. ’గని’పాఠీలు. ఓ.ఎం.సీ. గనుల అక్రమాలపై ఈనాడు వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
నవంబరు 21 వ తేదీ ఈనాడు ’పత్రిక’ చూశావా బావా? మొత్తం తొలిపేజీలో రెండు వ్యాపార ప్రకటనలు, పతాకవార్త టూటీ….. ’గని’పాఠీలు తాలూకూ పెద్దపెద్ద అక్షరాల ప్రధాన శీర్షిక, చిన్నపెద్ద అక్షరాల ఉపశీర్షికలూ, ఫోటోలూ పోనూ, అసలు వార్త, కేవలం సింగిల్ కాలం 10 సెంటీమీటర్లే తెలుసా?
సుబ్బారావు:
పదకొండో పేజీలో కొనసాగింపు ఉంది లే మరదలా! అయితే అదీ దాదాపు ఇలాగే ఉందిలే! అయినా ఎవరి అవసరాలు వాళ్ళవి మరదలా! తమకి కావలసినప్పుడు, అప్పటికి కావలసిన వాళ్ళని దేవుళ్ళనటానికీ, వద్దనుకున్నప్పుడు వాళ్ళనే దెయ్యాలనటానికే ఇవాళా రేపు, ఏ పత్రికైనా పేజీలకు పేజీలు అదనంగా కేటాయిస్తోంది. మనమే అమాయకంగా మన డబ్బులు పెట్టి, వాళ్ళ గోకుళ్ళనో, గొడవల్నో చదువుతున్నాం. అంతే!
వార్తా పత్రికలు ఎంత దిగజారిపోయాయండీ... పేపర్ వస్తూనే మొదటి పేజీ చదవడం మానేశానండీ ఈ మధ్య. ఎందుకంటే పేపర్ నిండా బురదే మరి. సీనియర్ కార్టూనిస్టు శ్రీధర్ కార్టూన్ తో సహా.
ReplyDelete