[కాంగ్రెస్ లో ప్రరాపా విలీన ప్రక్రియకి 45 రోజులు పడుతుంది. ఆ తర్వాత భారీగా విలీన సభ నిర్వహిస్తామని, చిరంజీవి చేసిన ప్రకటన నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! మఖలో పుట్టి, పుబ్బలో మరణించిన ప్రజారాజ్యం పార్టీ… కాంగ్రెస్ లో విలీనమయ్యింది కదా! ‘ఇక నుండీ చిరంజీవి కాంగ్రెస్ కుటుంబ సభ్యుడంటూ’ వీరప్ప మొయిలీ ప్రకటించేసాడు కూడా! కాంగ్రెస్ అధినేత్రితో భేటీ అయిన గంట వ్యవధిలో, పార్టీని గుంటలో పెట్టి గంట వాయించేసాడు గదా చిరంజీవి!?
మరి ఇప్పుడదేదో ‘సుదీర్ఘ ప్రక్రియ’ అన్నట్లు నానా రచ్చ చేస్తూ… విలీన ప్రక్రియకి 45 రోజులు, తర్వాత విలీన సభ భారీగా నిర్వహిస్తాం, గట్రా ప్రకటనలిస్తున్నాడేమిటి?
సుబ్బారావు:
పార్టీ చచ్చిపోయింది గదా మరదలా! ఏదో రచ్చ చేస్తూ వార్తల్లో ఉండకపోతే, తమ మనుగడ చచ్చిపోతుందని హైరానా పడుతున్నాడు.
లేకపోతే అదేమైనా అమెరికా వైట్ హౌస్ లో అధికార మార్పిడా, రెండు నెలలు పట్టడానికి?
సుబ్బలష్షిమి:
అదే గదా మరి! అదేదో మహానది, సాగర సంగమం అన్నట్లు? తెగ గోల చేస్తున్నారు.
సుబ్బారావు:
భలే చెప్పావు మరదలా! ప్రరాపాల్లాంటి పార్టీలు మహానదులు కాదు, మూసీనదులు. కాంగ్రెస్ అవినీతి కాలుష్య కాసారం మరి! వాటిని తక్కువ చేసి మాట్లాడకు!
పుబ్బలో పుట్టి మఖలో మరణించాక కూడా గోల దేనికి? -madam makhalo putti..pubba lo ani undaali...
ReplyDeleteనిజమేనండి! సామెతని పొరపాటుగా వాడాను. మా దృష్టికి తెచ్చినందుకు కృతజ్ఞతలు! ఇప్పుడు సవరించాను గమనించగలరు. నెనర్లు! :)
ReplyDeleteపాపం చిరంజీవి ఏమి చేసినా తప్పే. చచ్చిపోయాక కూడా పీక్కుతింటున్నారు.
ReplyDelete