Friday, February 6, 2009

32. బావ కాస్తా వియ్యంకుడయ్యేసరికి వెన్నుపోటు కూడా వెన్నుదన్నుగా మారిందా?

ఎన్.టి.ఆర్. తె.దే.పా. ని నాదెండ్ల భాస్కర రావు చేసింది వెన్నుపోటు గానీ చంద్రబాబు చేసింది వెన్నుపోటు కాదు, వెన్నుదన్ను – బాలకృష్ణ, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బాలకృష్ణకి చంద్రబాబు వియ్యంకుడయ్యేసరికి వెన్నుపోటు కాస్తా వెన్నుదన్నుగా మారిపోయిందా బావా?

సుబ్బారావు:
అంటే వెన్నుపోటుకీ, వెన్నుదన్నుకీ తేడా లేదు కాబోలు మరదలా!

సుబ్బలష్షిమి:
‘వర్గం మారితే వైషమ్యం మారుతుంది’ అన్న కారల్ మార్క్స్ కొటేషన్ విన్నాను గానీ బంధుత్వం మారితే నిర్వచనాలు మారతాయని ఎప్పుడూ వినలేదు బావా!

సుబ్బారావు:
అయితే ఇప్పుడు విను మరదలా!

*************

1 comment:

  1. ’బంధుత్వం మారితే నిర్వచనాలు మారటం’. బాగా వ్రాశారు. నిన్న ఐ న్యూస్ చానెల్లో ఎన్టీఆర్ గారిని బాబు వెన్నుపోటు పొడిచిన తరువాత అన్నగారు ఇచ్చిన ఇంటర్వ్యూ చూడటం జరిగింది. ఆయన బాబు పేరు కూడ ఉచ్చరించటానికి ఇష్టపడలేదు. అన్న ఆక్రోశం చూసి చాలా బాధ కలిగింది. బాబు ఎప్పటికైనా తన వెన్నుపోటును ఆమోదించి అన్నకు సారీ చెబుతారా?

    ReplyDelete