Showing posts with label రెడ్ టేపిజం. Show all posts
Showing posts with label రెడ్ టేపిజం. Show all posts

Wednesday, March 2, 2011

అందుకే బంగారం ధర ఇంతగా మండి పోతున్నది!?

[నాల్కో సీఎండీ శ్రీవాస్తవ, అరెస్టు, సస్పెన్షన్ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ప్రభుత్వ రంగ జాతీయ అల్యూమినియం కంపెనీ (నాల్కో) సీఎండీ శ్రీవాస్తవ, పది కిలోల బంగారం, 29 లక్షల రూపాయల నగదు…. లంచంగా పుచ్చుకుంటూ పట్టుబడ్డాడట. అతడితో పాటు మరో అధికారి కూడా పట్టుబడ్డాడు. చిత్రమేమిటంటే – ఈ ఇద్దరు అధికారులకి కూడా, వారి భార్యలే లాబీయిస్టులుగా పనిచేసారట, తెలుసా బావా!

సుబ్బారావు:
నీరా రాడియాల పాటి తామూ చేయలేమా అనుకొని ఉంటారు మరదలా, ఛాందినీ శ్రీవాస్తవలు! మనం చాలా చోట్ల ప్రభుత్వ అధికారుల అటెండర్లు “ఆఫీసర్ గారి ఇంటికెళ్ళి, అమ్మగారిని కలవండి. మీ పని అయిపోతుంది” అని కార్యార్ధులకి సలహాలివ్వటం చూస్తూనే ఉంటాం కదా!

సుబ్బలష్షిమి:
గమ్మత్తేమిటంటే – తన భర్త తప్పేం లేదనీ, ఆయన అమాయకుడనీ..... పాపం చాందినీ కోర్టుహాల్లో కన్నీళ్ళు పెట్టుకుందట. అతడూ తను అమాయకుణ్ణి అన్నాడట, తెలుసా!

సుబ్బారావు:
తాటి చెట్టు మీద పట్టుబడిన ప్రతివాడూ, దూడగడ్డి కోసమే ఎక్కానంటాడు మరదలా! వినేవాడుంటే చేతిలోని కల్లుముంతని కూడా, దూడగడ్డిగా బుకాయించనూ గలరు.

సుబ్బలష్షిమి:
అయినా ఎకాఎకీ కోట్లలో లంచం తీసుకున్నారంటే..... ఎన్ని కోట్ల అక్రమాలకు పాల్పడి ఉండాలి బావా!? అధికారుల లెవెల్ 10 కిలోల బంగారాలైతే, మంత్రులూ, ఎంపీలూ ఎంఎల్ ఏ ల లెవెల్ ఎంతుండాలి? ఇక అధిష్టానాల లెవెల్ కి ఎంత బంగారం ఉండాలి?

సుబ్బారావు:
బహుశః అందుకే బంగారం ధర ఇంతగా మండి పోతున్నది మరదలా!

Monday, December 6, 2010

పలుకుబడి లేనివాళ్ళు దొరికితే దొంగలు, ఉన్నవాళ్ళు దొరికినా కూడా దొరలే!

[షేర్ల మాయాజాలం. నాలుగు కంపెనీల ప్రమోటర్లతో డాంగీ గ్రూప్ కుమ్మక్కు. కృత్రిమంగా షేర్ల ధరలు పెంపు. ఐటీ దాడులతో బట్టబయలు – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ వార్త చూడు.

>>> సాక్షిలో మాత్రమే వచ్చిన వార్తాంశం:[04/12]
షేర్ల మాయాజాలం!
కృత్రిమంగా ధరలను పెంచే చర్యలకు దిగారంటూ వెల్‌స్పన్ కార్పొరేషన్, ఆకృతీ సిటీ, మురళీ ఇండస్ట్రీస్, బ్రష్‌మాన్ ఇండియా కంపెనీ ప్రమోటర్లపై సెబీ నిషేధాన్ని విధించడంతో ఆయా కంపెనీల షేర్లన్నీ కుప్పకూలాయి. వీరంతా ఫండమెంటల్స్‌ కు మించిన స్థాయిలో షేర్ ధరను కృత్రిమంగా పెంచారన్నది అభియోగం.
[పూర్తి వార్తాంశం దిగువ చూడండి.]
~~~~~~

తమ షేర్ల ధరలు తామే పెంచుకునేందుకు సొంతంగా 10 డమ్మీ కంపెనీలు ఏర్పాటు చేసుకుందట మురళీ ఇండస్ట్రీస్! ఇంకా ఇతర కంపెనీలు డాంగీ గ్రూప్ తో ఒప్పందం కుదుర్చుకుని, ఆ ప్రకారం తమ షేర్ల ధరలను కృత్రిమంగా పెంచుకున్నారట.

సుబ్బారావు:
అది షేర్ మార్కెట్ లో మామూలే మరదలా! దొరికితే మురళీ ఇండస్ట్రీస్ లాగా దొంగలు! దొరకక పోతే అంబానీలు, కంపానీలు, టాటాలు, బజాజ్ లు! ఒకవేళ ఈ అంబానీలు, టాటాలు దొరికినా… ప్రభుత్వం చట్టాలు మార్చి అయినా వారిని దొరలనే చేసేస్తుంది.

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! రాజకీయ, ఆర్ధిక పలుకుబడి లేనివాళ్ళు దొరికితే దొంగలు, ఆవి ఉన్నవాళ్ళు దొరికినా కూడా దొరలే!

~~~~~~~
>>> సాక్షిలో మాత్రమే వచ్చిన వార్తాంశం:[04/12]
షేర్ల మాయాజాలం!
కృత్రిమంగా ధరలను పెంచే చర్యలకు దిగారంటూ వెల్‌స్పన్ కార్పొరేషన్, ఆకృతీ సిటీ, మురళీ ఇండస్ట్రీస్, బ్రష్‌మాన్ ఇండియా కంపెనీ ప్రమోటర్లపై సెబీ నిషేధాన్ని విధించడంతో ఆయా కంపెనీల షేర్లన్నీ కుప్పకూలాయి. వీరంతా ఫండమెంటల్స్‌ కు మించిన స్థాయిలో షేర్ ధరను కృత్రిమంగా పెంచారన్నది అభియోగం. తద్వారా ఆయా కంపెనీలు, ప్రమోటర్లను స్టాక్ ఎక్స్ఛేంజీ కార్యకలాపాల నుంచి సెబీ నిషేధించింది. నిధుల సమీకరణ ప్రయత్నాలు సఫలమయ్యేందుకు సంజయ్ డాంగీ ప్రమోట్ చేసిన డాంగీ గ్రూప్ ఈ విషయంలో ఆయా కంపెనీల ప్రమోటర్లకు సహకరించినట్లు సెబీ ధృవీకరించింది. తొలుత మురళీ ఇండస్ట్రీస్ కార్యాలయంపై ఆదాయపన్ను అధికారులు దాడి చేయడంతో ప్రమోటర్ల వ్యూహాలు బయటపడ్డాయి. స్టాక్ కార్యకలాపాల నుంచి డాంగీని సైతం సెబీ నిషేధించింది.


ఏం జరిగిందంటే?
సెబీ పరిశోధన వివరాలిలా ఉన్నాయి. 2007 ఫిబ్రవరిలో మురళీ ఇండస్ట్రీస్ ఎఫ్‌సీసీబీల ద్వారా నిధుల సమీకరణకు దిగింది. అయితే అంతకుముందుగానే షేర్ ధరను భారీగా పెంచేందుకు డాంగీతో ఒప్పందం కుదుర్చుకుంది. వెరసి ప్రమోటర్లతో కుమ్మక్కైన డాంగీ... షేర్ ధరను కృత్రిమ పద్ధతిలో పెంచుతూ పోయింది. ఇందుకు అక్టోబర్ 2006 జూన్ 2007 కాలంలో మురళీ సొంతంగా ఏర్పాటు చేసిన 10 డమ్మీ సంస్థలు సహకరించాయి. తద్వారా అధిక ధరల వద్ద షేర్లను జారీ చేయడం ద్వారా ప్రమోటర్లు భారీగా నిధులను సమీకరించగలిగారు.

తద్వారా ప్రమోటర్లు కంపెనీ స్థాయికి మించిన ధరలో షేర్లను జారీ చేయడం ద్వారా లాభపడ్డారు. దీంతో సెబీ డాంగీపై మరింత లోతుగా పరిశోధన చేసింది. ఫలితంగా పలు కంపెనీలు ఎఫ్‌సీసీబీ, ఏడీఆర్, జీడీఆర్, క్విబ్, క్విప్ తదితర మార్గాలలో నిధులను సమీకరించేందుకు డాంగీతో చేతులు కలిపినట్లు తేలింది. వీటిలో వెల్‌స్పన్ కార్పొరేషన్, ఆకృతీ సిటీ, బ్రష్‌మాన్ ఉన్నాయి. అంటే ఆయా కంపెనీలు నిధుల సమీకరణకు ముందుగానే మార్కెట్లలో కృత్రిమంగా షేర్ల ధరల పెంపునకు పాల్పడినట్లు సెబీ నిర్ధారణకు వచ్చింది. దీంతో వాటిని నిషేధించింది.

సవాల్ చేస్తాం...
సెబీ నిషేధానికి గురైన కంపెనీలు నష్ట నివారణ చర్యలు చేపట్టనున్నాయి. సెబీ ఆదేశాలను సవాలు చేసేందుకు న్యాయ సలహాలను తీసుకోనున్నట్లు ఆకృతీ సిటీ, వెల్‌స్పన్ కార్పొరేషన్ శుక్రవారం విడివిడిగా తెలియజేశాయి. సెబీ ఆదేశాలను పరిశీలించాక తగు నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు పేర్కొన్నాయి. ఈ రెండు కంపెనీలూ నిబంధనలకు అనుగుణంగానే నడుచుకున్నట్లు పేర్కొనడం గమనించదగ్గ అంశం.

Pasted from http://uni.medhas.org/unicode.php5?file=http%3A%2F%2Fsakshi.com%2Fmain%2F..%2Fmain%2F..%2FMain%2F..%2Fmain%2F..%2Fmain%2FSportsDetailsNormal.aspx%3Fcatid=58722%26Categoryid=7%26subcatid=36
~~~~~~

Thursday, October 28, 2010

‘సానుకూల దృక్పధం’ అంటే ఇదన్న మాట!

[సివిల్స్...తీరు మారిన ప్రిలిమ్స్ -సాక్షి విద్య శీర్షిక నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేసి వెళ్ళిన స్మితా సబర్వల్ అనే ఐఎఎస్ అధికారిణి, సివిల్స్ విధానం మీద తన అభిప్రాయం చెబుతూ, సివిల్స్ కు తయారయ్యే అభ్యర్ధులకి సూచనలిస్తోంది. ఈవిడ 2001లో సివిల్స్ ఆలిండియా స్థాయిలో 4వ ర్యాంకు సాధించిందిట. ఈవిడ భర్త ఐపీఎస్ అధికారి. ఓసారి కర్నూలు జిల్లా సంచికలో ఈవిడ ఇంటర్యూ చదివాం, గుర్తుందా!

సుబ్బారావు:
గుర్తుంది, అయితే ఏమిటి?

సుబ్బలష్షిమి:
ఈవిడ సానుకూల దృక్పధం(positive thinking) ఎంతటిదో తెలుసా బావా? గతేడాది కర్నూలు వరదల్లో కొంపా గోడూ సర్వం కోల్పోయిన బాధితులకు పంపిన వాటిల్లో 50బస్తాల బియ్యాన్ని పరీక్షిస్తే... అందులో 47 బస్తాల దాకా.... 50కిలోలకు బదులు 45-46 కేజీలే ఉన్నాయి. రెడ్ హాండెడ్ గా పట్టుబడిన ఈ సంఘటన, అప్పటి అవినీతికి ఓ మచ్చుతునకన్న మాట!

అదే విషయం నిలదీస్తూ, ఈ జాయింట్ కలెక్టర్ ని అప్పట్లో విలేఖర్లు నిలదీస్తే... ఈవిడ ‘అది వ్యతిరేక ఆలోచన(Negitive thinking) విధానమంటూ’..."మీరు తరుగుపడిన ఆ 47బస్తాలనే చూస్తున్నారు, సరైన కొలత ఉన్న 3బస్తాలనెందుకు చూడరు? ఇలా తప్పుబడుతూ పోతే, ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయలేరు" అంది. అప్పట్లో కర్నూలు జిల్లా సంచికలో వచ్చిన వార్త అది!

వరద బాధితుల కడుపు నింపేందుకు పంపిన తక్షణ ‘సాయం’లోనే... అంత ‘మాయం’ చేయగల సదరు ప్రభుత్వ ఉద్యోగుల చేతివాటం... ఇక శాశ్వత సాయంలో ఎలా ఉంటుందో... ఇప్పటికీ బాగుపడని కర్నూలు వరదబాధితుల బ్రతుకు చిత్రమే చెబుతుంది కదా!?

అంతలా తమ పనితీరు సమర్ధించుకున్న ఈ సివిల్స్ మాజీ టాపర్, ఇప్పుడు కాబోయే సివిల్స్ టాపర్లకు సలహాలిస్తోంది. అసలు ఈవిడకు సివిల్స్ లో 4వ ర్యాంకు ఎలా వచ్చింది బావా?

సుబ్బారావు:
బహుశః ఈ ‘సానుకూల దృక్పధం’తోనే సంపాదించి ఉంటుంది మరదలా!

Thursday, October 7, 2010

పాచిపని పాటి ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే!


[దారి దున్నేసారు - వార్త నేపధ్యంలో, ఈనాడు 02, అక్టోబరు 2010]

సుబ్బలష్షిమి:
బావా! మురుగు నీటి కోసంగానీ, త్రాగునీటి కోసం గానీ... ఆ ఏర్పాట్లోవో ముందు చేశాకే రోడ్డు వేయవచ్చుకదా, ఈ అధికారులు!? లక్షలు ఖర్చుపెట్టి పక్కాగా సిమెంట్‌ రోడ్డో, తారు రోడ్డో వేసాక, తీరిగ్గా అప్పుడొచ్చి తవ్వి పారేస్తారు. అదేమని అడిగితే... `ఆ కాంట్రాక్టు ఒకరిది, ఈ కాంట్రాక్టు మరొకరిది' అనో `రోడ్డు తర్వాత నీటి పైపుల ఏర్పాటుకు నిధులు మంజూరయ్యాయనో' చెబుతారు.

వెరసి... ప్రజాధనం నీళ్ళలా ఖర్చవుతుంది, ఊరు బురదగుంటలా తయారౌతుంది. కాంట్రాక్టర్లు వేరైనా, నిధులు ముందు వెనుకలుగా మంజూరు చేసినా, ప్రభుత్వం దగ్గర సమన్వయం లేనప్పుడే కదా ఇలా జరిగేది? ఆపాటి బుర్ర కూడా లేకుండా పనులెందుకు చేస్తారు బావా?

సుబ్బారావు:
అదిబుర్ర లేకపోవటం కాదు మరదలా, తమ పని పట్ల నిజాయితీ, నిబద్దతా లేకపోవటం! లేదా, కమీషన్ల కోసం ఇలా దుంపనాశనం చేయటం! లేకపోతే... పాచిపని చేసేటప్పుడు కూడా... ముందు వాకిలి ఊడ్చి కళ్ళాపి జల్లి ఆ తర్వాత ముగ్గు వేస్తారు. అంతేగానీ, ముందు ముగ్గు వేసి, ఆ తర్వాత ఊడ్చి నీళ్ళు చల్లరు గదా! ఆ పాటి ఇంగింత జ్ఞానం కూడా లేదంటే ఇంకేమంటాం చెప్పు!

Thursday, September 23, 2010

ఇంటి కన్న జైలు పదిలం! అది విలాసాల నిలయం!

[జైలు జీవితం ఇక ‘సుఖ’వంతం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఇక నుండీ జైల్లో ఖైదీలకు నెలకు 8 సార్లు ఫోన్ సౌకర్యం కలిగిస్తారట. నెలకు మూడురోజులు పాటు కుటుంబ జీవితం గడపనిస్తారట. ఎటూ వారాంతంలో మాంసాహారం ఇస్తారు. టీవీ, పత్రికలు, ఇతర సౌకర్యాలు ఉంటాయి. ఖైదీలలో మానసిక పరివర్తన సంగతేమో గానీ, మొత్తానికి బయట కంటే జైల్లోనే జీవితం సుఖవంతంగా ఉండబోతుందేమో బావా!

సుబ్బారావు:
మరి!? చట్టాలున్నది నేరగాళ్ళ శ్రేయస్సు కోసమే కదా మరదలా! అందునా ఈ మధ్య రాజకీయ నాయకులు కూడా జైలు కెళ్ళి, రోగమో రొప్పొ వచ్చిందని ఆసుపత్రికి ఉరికే దాకా, బెయిల్ వచ్చే దాకా, ఖైదీలుగా ఉండాల్సి వస్తోంది కదా! ముందు జాగ్రత్త చర్యలుగా సౌకర్యాలు మెరుగు పరుచుకుంటున్నట్లున్నారు.

సుబ్బలష్షిమి:
అంతే కాదు బావా! జైల్లో ఖైదీలు మాట్లాడే ఫోన్‌కు నిమిషానికి 10/- రూపాయలు వసూలు చేస్తారట! ఎంతో పెద్ద శిక్ష కదూ!

సుబ్బారావు:
అది కాదు మరదలా! మొన్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ‘పోలీసులు క్రికెట్ట్ బెట్టింగ్ ఆపలేకపోతున్నారు. కాబట్టి, ప్రభుత్వమే అధికారికంగా అనుమతిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ డబ్బుతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించవచ్చని’ సలహా కూడా ఇచ్చాడు. అదే మాదిరిగా... ప్రభుత్వం ఎలాగూ జైళ్ళల్లో ఫోన్లను ఆపలేకపోతున్నది కదా! కాబట్టి ప్రభుత్వమే, ప్రజాసంక్షేమ నిధులు కోసం, ఫోన్ కాల్ ఛార్జిలు నిమిషానికి 10/- రూపాయలు వసూలు చేస్తున్నారు కాబోలు! మొత్తానికి పెద్ద శిక్షే!

Monday, August 30, 2010

దేశం నిండా ఎన్ని ఉష్ట పక్షులో!

[పరీక్షలో చూచి రాతకు పాల్పడుతూ పట్టుబడిన అయిదుగురు న్యాయమూర్తుల సస్పెన్షన్ - ఈనాడు, 26 ఆగస్టు, 2010.
ఆంధ్రజ్యోతి కెమెరాకు, పరీక్షలు చూచి రాస్తూ పట్టుబడిన న్యాయమూర్తులు - ఆంధ్రజ్యోతి,
సామాన్యుడి దుస్థితిని చూస్తూ న్యాయస్థానాలు కళ్ళు మూసుకోవు - సుప్రీం కోర్టు - 26, ఆగస్టు, 2010 ఈనాడు వార్త నేపధ్యంలో. ]

సుబ్బలష్షిమి:
బావా! కాకతీయ విశ్వవిద్యాలయంలో ‘మాస్టర్ ఆఫ్ లా’ దూరవిద్య పరీక్షల్లో, న్యాయమూర్తులు కాపీలు కొడుతూ, ఆంధ్రజ్యోతి కెమెరా కి చిక్కారట. వాళ్ళని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిసార్ ఆహ్మద్ కక్రూ సస్పెండ్ చేశాడు. మరో వైపు సుప్రీం కోర్టు, సామాన్యుడి దుస్థితి చూసి న్యాయస్థానాలు కళ్ళు మూసుకోవు - అంటోంది. మరి దినకరన్ విషయంలో ఎందుకు కళ్ళు తెరవలేదట?

అసలు న్యాయమూర్తులే... ఎవరి స్థాయిలో వాళ్ళు ఇంతగా పక్కదార్లు పట్టేవాళ్ళయినప్పుడు, కళ్ళు మూసుకోవటం గాక ఇంకేం ఉంటుంది బావా? చిన్నకోర్టుల్లోని ఇలాంటి న్యాయమూర్తులే కదా, డిపార్ట్ మెంట్ పరీక్షలు వ్రాసీ, పదోన్నతలు పొందీ, పై కోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులౌతుంటారు?

సుబ్బారావు:
ఉష్ణ పక్షి ఎడారిలో పరిగెడుతూ, ఇసుకలో తలదూర్చి... తనకెవ్వరూ కనబడక పోతుండగా, తానెవ్వరికీ కనబడటం లేదనుకుంటుందట. ఆ జాబితాలో ఇప్పటికి... కొందరు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, మీడియా ప్రతినిధులూ ఉన్నారు. ఇప్పుడు న్యాయమూర్తులూ అందులోనే ఉన్నారని నిరూపించుకున్నారు. అంతే మరదలా!

సుబ్బలష్షిమి:
అయితే దేశంలో చాలానే ఉష్ణ పక్షులున్నట్లున్నాయి బావా!
~~~~~~~~~~~

Monday, August 23, 2010

అతడు టాటా, ఇతడు వేటా, తేడాలేదూ!?

[‘వేటా’ హరికృష్ణ ప్రసాద్ అరెస్ట్ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈవీఎం లను టాంపర్ చేయటం సాధ్యమేనని నిరూపించిన హైదరాబాద్ వేటా సంస్థలో ఐటీ నిపుణుడు వేమూరి హరికృష్ణ ప్రసాద్ ను, మహారాష్ట్ర పోలీసులు, ఈవీఎం ని దొంగతనం చేశాడన్న నేరం మోపి, అచ్చం దొంగని అరెస్టుచేసినట్లుగా... శనివారం తెల్లవారు ఝామున అరెస్టు చేసి తీసికెళ్ళారట.

సుబ్బారావు:
అంతే కాదు మరదలా! ఏప్రిల్ 28 న అతడు ఓ తెలుగు ఛానెల్ లో డెమో చూపించాడట. అప్పటి వరకూ కూడా, తమ ఈవీఎం చోరికి గురయ్యిందని తెలుసుకోలేక పోయిన ప్రభుత్వం, టీవీలో ఈవీఎం నెం. ని గుర్తుపట్టి, చోరీ అయిన వస్తువు ‘వేటా’ హరికృష్ణ ప్రసాద్ దగ్గర దొరికింది కాబట్టి, అతణ్ణే దొంగని పట్టుకెళ్ళింది. అదీ సంగతి!

సుబ్బలష్షిమి:
ఎంత చక్కని రెడ్ టేపిజం బావా!? అతడు నిరూపించిన ఈవీఎం టాంపరింగ్ తమ పరిధిలోనిది కాదు. పోయిన యంత్రం అతడి చేతికొచ్చింది కాబట్టి అతడే దొంగనడం తమ పరిధిలోది కాబట్టి అరెస్ట్ చేశారు. అతడే దాన్ని దొంగిలిస్తే, పబ్లిక్ గా టీవీలో ప్రోగ్రాం ఇస్తాడా?

సుబ్బారావు:
మరో తమాషా చూడు మరదలా! వాళ్ళ పరిభాషలో... ఈవీఎం లతో సహా ‘వేటా’ రెడ్ హాండెడ్ దొరికినట్లే, కంట్రోలు రూం+ఆయుధాల నిల్వతో సహా ‘టాటా’ (తాజ్ హోటల్) కూడా రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు కదా? మరి దాదాపు రెండేళ్ళవుతున్నా... టాటాకు సంబంధించిన తాజ్ ఇంటర్నేషనల్ లో పాక్ తీవ్రవాదులు కంట్రోలు రూం ఎలా ఏర్పరుచు కున్నారో కూడా పట్టించుకోలేదేం మహారాష్ట్ర పోలీసులు?

సుబ్బలష్షిమి:
మరి అతడు టాటా, ఇతడు సామాన్య ‘వేటా’... తేడా లేదూ! టాటా చేసింది పాక్ కీ సహకారం, తద్వారా యూపీఏ కి ఉపకారం! ఇప్పుడు వేటా చేసింది యూపీఏ కి అపకారం! తనకి ఇబ్బంది కలిగిస్తే సోనియా ఊరుకుంటుందా? సతాయించదూ మరి!

Tuesday, July 27, 2010

ఎన్ని చెట్లు కొట్టేస్తే ఇన్ని కాగితాలు తయారవ్వాలి?

[పదో తరగతి విద్యార్దులకు 24 పేజీల జవాబు పత్రం వచ్చే ఏడాది నుండి ఇవ్వనున్నారు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! పదో తరగతి పబ్లిక్ పరీక్షలు వ్రాసే విద్యార్దులకు, 24 పేజీలతో కూడిన ఆన్సర్ బుక్ లెట్ ను, వచ్చే ఏడాది నుండి ఇస్తారట. పారదర్శకత పెంపుకూ, ఇన్విజిలేటర్ పై పని భారాన్ని తగ్గింపుకూ ఇది ఉపయోగపడుతుందట. ఇది ప్రయోగాత్మకంగా ఇంటర్ పరీక్షల్లో విజయవంతమైందట. వచ్చే ఏడాది అన్ని సబ్జెక్టులకీ అమలు చేస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి బలరామయ్య చెప్పాడు.

బహుశః ఏ రాజకీయ కుటుంబానికో గుత్తకివ్వలని అనుకుంటున్నారేమో బావా! విడిగా పేపర్లిచ్చే దాని కన్నా, 24 పేజీల కట్ట అంటే - బల్క్ గా ఉంటుంది, లాభమూ ఎక్కువ వస్తుంది కదా!

సుబ్బారావు:
పారదర్శకత పెరిగేదే ముంది మరదలా! కార్పోరేట్ స్కూళ్ళ పైసలకి అవకతవకలన్నీ పారదర్శకంగానే అందుబాటులో ఉన్నాయయ్యె! ఇక ఇన్విజిలేటర్లు పని భారమా? అంతకంటే ప్రైవేటు రంగంలో ఒళ్ళు విరగ్గొట్టించుకుని చాకిరీ చేసేవాళ్ళున్నారు. అదీగాక... ఒక విద్యార్ది 24 పేజీలు వ్రాస్తాడు. ఒకోకడు రెండు పేజీలు కూడా వ్రాయడు. ఎంత స్టేషనరీ దండగో తెలుసా? ఎన్ని చెట్లు కొట్టేస్తే ఇన్ని కాగితాలు తయారవ్వాలి?

సుబ్బలష్షిమి:
అన్నిరకాలుగా.... మన దేశ ఆర్దిక, ప్రాకృతిక, వస్తు వనరుల్ని దుంప నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్నట్లున్నారు బావా! శతృవుని నాశనం చేసే ముందు, వారి ఉత్సాహ ఐశ్వర్య మంత్రాంగాలని నాశనం చెయ్యాలన్నాడు భారతంలో కణికుడు! అదే అమలు చేస్తున్నారు ప్రస్తుత పాలకులు!

Saturday, July 24, 2010

డబ్బులున్న అయేషా తన్వీర్ లు - డబ్బుల్లేని అయేషా మీరాలు !

[పార్క్ ఉడ్ స్కూల్ పాలక వర్గం నుండి అయూబ్ ని తొలగించాం - స్కూల్ అకడమిక్ హెడ్ అయేషా తన్వీర్... ప్రకటన నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! పార్క్ ఉడ్ స్కూల్ ను ప్రారంభించిందే అయూబ్. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ అతడి చెల్లెలే! అలాంటిది ఆ పాఠశాల అకడమిక్ హెడ్ అయేషా తన్వీర్, ఇప్పుడు తీరిగ్గా, పాఠశాల పాలక మండలి నుండి అతణ్ణి తొలగించామనీ, పాఠశాలలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా 350 మంది విద్యార్దుల విద్యాసంవత్సరానికి నష్టం కలిగించరాదనీ ప్రభుత్వాన్ని కోరుతోంది.

ఈమెకు తెలియదా బావా, అన్న, అమ్మాయిల హాస్టల్ పైనే పెంట్ హౌస్ కట్టించుకు ఉంటున్నాడనీ, పిల్లల మానప్రాణాలతో ఆడుకుని జీవితాలకే నష్టం కలిగించాడనీ?

సుబ్బారావు:
ఇవతల ఆ పిల్లల జీవితాలు, దృక్పధాలు అన్ని నాశనం అయితే ఏం లేదు గానీ, తొక్కలోది విద్యా సంవత్సరం నష్ట పోరాదట! ఆ స్కూలు కాకపోతే మరో స్కూలులో చదువుకుంటారు. అసలా అసభ్యపు స్కూల్లో ఏం విద్య నేర్పిస్తారట? పైగా ఒక్క సంఘటన అట. మెల్లిగా బాధితుల చిట్టా బయటికొస్తుంటే, ఏం చెబుతోంది కీచక సోదరి?

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెడుతుందంటారు పెద్దలు. ప్రభుత్వపు అలుసుంటే, అవ్వని దేమిటి డబ్బులున్న అయేషా తన్వీర్ లకి? అదే డబ్బుల్లేని అయేషా మీరాలైతే... దారుణంగా రేప్ హత్య చెయ్యబడినా, ఏళ్ళూ పూళ్ళూ గడిచినా, ఏ న్యాయమూ జరగదు!

Monday, June 14, 2010

‘ఆ! నాలుగు రోజులు ఏడ్చి వాళ్ళే నోర్ముసుకుంటార్లే!’

[శాంతి భద్రతల పరిరక్షణ కోసం, అండర్సన్ ను అర్జున్ సింగే పంపారు - ప్రణబ్ ముఖర్జీ వెల్లడి నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! భోపాల్ దుర్ఘటన జరిగిన నాలుగు రోజులకే, ఇండియాకి వచ్చిన యూనియన్ కార్బైడ్ నాటి సీఈవో అండర్సన్ ను, భద్రంగా వెనక్కి పంపించడం గురించి.... 1984, డిసెంబరు 8వ తేదీన అర్జున్ సింగ్ ప్రకటన, నాటి ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ లో వచ్చిందట. అందులో అర్జున్ సింగ్ "భోపాల్ లో శాంతిభద్రతల సమస్య తీవ్రంగా ఉంది. ప్రజలు ఉద్రేకంలో ఉన్నారు. అందుకే అండర్సన్ ను దేశం నుండి పంపించేయాలనే ఆలోచన చేశాం" అని పేర్కొన్నాడట.

నాకు తెలియక అడుగుతాను బావా! ఆప్తుల ప్రాణాలు కోల్పోయి, కడుపుమండిన ప్రజలు ఉద్రేకంలో ఉండక ఎలా ఉంటారు? అండర్సన్ ను దేశం నుండి పంపించేస్తే ప్రజలు శాంతిస్తారా, తీహార్ జైలు కి పంపిస్తే శాంతిస్తారా? ‘ఆ! నాలుగు రోజులు ఏడ్చి వాళ్ళే నోర్ముసుకుంటార్లే’ అనుకొని అండర్సన్ ని అమెరికా పంపేసారన్న మాట. ఎంత చులకన బావా భారతీయులంటే?

సుబ్బారావు:
ఆ విషయంలో మెరుపుల మరకలు మరిన్ని ఉన్నాయి మరదలా! మరో విషయం చూడు! నిన్నటి దాకా.... "అర్జున్ సింగే మౌనం వీడాలి" అన్నారు అందరూ. అతడేమో తీరిగ్గా "సమయం వచ్చినప్పుడు నోరు విప్పుతా!" అన్నాడు. నాలుగు రోజులు గడిచాక ఇప్పుడు, ప్రణబ్ ముఖర్జీ, అర్జున్ సింగ్ ని వెనకేసుకు వస్తున్నాడు. ఆపైన మన్మోహన్ సింగ్ మరో కమిటీని వేసి, "నివేదిక ఇవ్వండి" అన్నాడు. మరో నాలుగు రోజుల గడిస్తే అన్నీ హుహ్ కాకి!

సుబ్బలష్షిమి:
నిజమే బావా! ఆనాటి శిశుపాలుడి తప్పుల్ని, వంద వరకూ లెక్కిస్తూ ఉపేక్షించాడు శ్రీకృష్ణ భగవానుడు. ఈనాటి సామూహిక శిశుపాలుళ్ళ తప్పుల్ని, ఎన్నిటిని లెక్కపెట్టాలో సామాన్యులు?

Thursday, May 27, 2010

ముక్కంటి మూడో కన్ను తెరిచే వరకూ ఇంతే!

[ఎఐడీఎంకే అధినేత్రి జయలలితకి సాష్టాంగ ప్రణామం చేస్తున్న తమిళ రాజకీయులు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ తమిళ రాజకీయ నాయకులు చూడూ! ఏఐడీఎంకే అధినాయకురాలు జయలలితకు, అక్షరాలా సాష్టాంగ ప్రణామం చేస్తున్నారు. ఇంకా పొర్లు దండాలు కూడా పెడతారేమో! ఆవిడ కూడా స్థంబంలా నిలబడి దణ్ణాలు పెట్టించుకుంటోంది. దేవుడికి కూడా ఇంతగా దణ్ణాలు పెట్టరేమో కదా వీళ్ళు!?

సుబ్బారావు:
నిజమే మరదలా! పదవులు ఇస్తే చాలు! ఆ సీట్లలో కూర్చొని అక్రమార్జనలు చేస్కోనిస్తే చాలు! ‘దేవుడా గీవుడా! పదవులూ, పక్కదారి ఆదాయాలూ ఇచ్చే అధిష్టాన అధినేత్రులే అన్నీ!’ అనుకుంటున్నారు కాబట్టే.... ఇంతగా భజనలు చేస్తున్నారు. లేకపోతే చూడు! రోజూ కోట్లాది రూపాయల ఆదాయం, హిందూ దేవాలయాల నుండి దేవాదాయ ధర్మాదాయ శాఖ సంపాదిస్తోంది. అందులో అందినంత సొమ్ము, మంత్రుల దగ్గరి నుండి అటెండరు దాకా అందరూ దండుకుంటున్నారు. ఈ రోజు, శ్రీకాళహస్తిలో, శతాబ్దాల క్రితం శ్రీకృష్ణదేవ రాయలు కట్టించిన గాలిగోపురం కుప్పకూలి పోయింది. పదేళ్ళ క్రితమే బీటలిచ్చినా, ఏ పార్టీ ప్రభుత్వానికి పట్టలేదు మరి!

సుబ్బలష్షిమి:
శ్రీకాళహస్తీశ్వరుణ్ణి ముక్కంటి అంటారు బావా! ఆ ముక్కంటి మూడో కన్ను తెరిచే వరకూ, ఈ రాజకీయ నాయకులకి ‘ఒళ్ళూ పై’ తెలియదనుకుంటా!

Wednesday, May 26, 2010

మీడియా నిఘంటువులో లజ్జా బిడియాలనే పదాలుండవు!

[టెన్నిస్ క్రీడాకారిణి రుచికా పై, హర్యానా పోలీసు మాజీ డీజీపీ రాధోడ్ లైంగిక వేధింపు, ఆత్మహత్యకు పురికొల్పటం కేసులో కోర్టు తీర్పు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! రుచికా అనే ఈ అమ్మాయి కేసు చదివావా! 20 ఏళ్ళ క్రితం 14 ఏళ్ళ అమ్మాయిని పోలీసు ఉన్నతాధికారి లైంగికంగా వేధించాడు. కేసు పెట్టినందుకు ఆమె కుటుంబాన్ని, ఆమె స్నేహితురాలి కుటుంబాన్ని వేధించాడు. కేసు తెమలడానికి 20 ఏళ్ళుపట్టింది. 17 ఏళ్ళ క్రితమే అన్యాయానికి గురైన రుచికా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. మహిషానికి మారుటి తమ్ముడు లాంటి రాధోడ్ కి మాత్రం, ప్రభుత్వం నుండి పదోన్నతి వచ్చింది. విశిష్ట సేవలకు[?] గుర్తింపుగా పసిడి పతకాలూ వచ్చాయి. నానా వెతలూ, వేధింపులూ పడి, రుచిక స్నేహితురాలు ఆరాధనా గుప్తా కోర్టులో పోరాడితే, అతగాడికి ఆరునెలలు జైలు శిక్ష పడింది. చివరికి దాన్ని 1 1/2 సంవత్సరాలుగా మార్చారు.

ఈ వార్త గురించి ఈనాడు పత్రిక ‘ఓ మగువ తెగువ’ అని వ్రాస్తూ.... ‘అటు మీడియా ఇటు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆరాధనా గుప్తా పోరాడిందని’ వ్రాసింది తెలుసా?

సుబ్బారావు:
మీడియా సహకరిస్తే అసలా కేసు 20 ఏళ్ళు సాగేదా? పద్నాలుగేళ్ళ పసిపిల్ల అవమానానికీ, కుటుంబ వేధింపులకీ గురయ్యి ఆత్మహత్య చేసుకునేదా? కేసుపెట్టి పోరాడిన ఆరాధనా గుప్తా, కుటుంబంతో సహా వేధింపులకి గురయ్యేదా? ఆ రాధోడ్ కి పదోన్నతులూ, పతకాలూ వచ్చేవా? ఇంతా చేసి ఆ దుష్టుడికి పడింది తొక్కలోది ఆరునెలలు శిక్ష! ఇంకా కొనసాగిస్తే చివరికది ఒకటిన్నర సంవత్సరాలైంది. ఈపాటి దానికి ‘మీడియా సహకరించింది’ అని వ్రాసుకోవటానికి పత్రికా విలువలు అడ్డం రాకపోయినా, కనీసం లజ్జా బిడియాలన్నా అనిపించలేదు కాబోలు!

సుబ్బలష్షిమి:
లజ్జా బిడియాలా? మీడియాకి అసలా పదాలు నిఘంటువులోనే ఉండవు బావా!

Monday, May 10, 2010

వరాల మూటల్లాంటి ఫీజుల చెల్లింపు పధకాలు

[ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో, గత ఏడాది యాజమాన్య కోటాలో 55% సీట్లు, ఎవరూ చేరకుండా మిగిలి పోయాయి. ప్రభుత్వం చెల్లించే ట్యూషన్ ఫీజుల పధకం పుణ్యామాని ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీలు బ్రతికేస్తున్నాయి. ప్రక్షాళనకు తరుణం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! గత నాలుగేళ్ళలో ఏర్పాటైన నాలుగు వందలకు పైగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు, ప్రభుత్వమే ట్యూషన్ ఫీజులను చెల్లించే పధకం వరంగా మారిందట. ఏ నాణ్యతా ప్రమాణాలను చూసి ప్రభుత్వం ఈ కళాశాలలను పోషిస్తుందనేది చర్చనీయాంశంగా మారిందని పత్రిక వ్రాసింది. చూశావా?

సుబ్బారావు:
ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో 90%, రాజకీయ నాయకుల యాజమాన్యంలోనివే మరదలా! ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి మొదలు ఎమ్మెల్యేల దాకా, అందరికీ విద్యావ్యాపారాలున్నాయి.

సుబ్బలష్షిమి:
అదా సంగతి! గుట్టు చప్పుడు కాకుండానే ప్రజా ప్రతినిధుల జీతభత్యాలని పెంచుకున్నట్లే, వరాల మూటల్లాంటి ఫీజుల చెల్లింపు పధకాలు తెచ్చుకున్నారన్న మాట! ఇక ఇందులో చర్చంచడానికేముంది, దోపిడి తప్ప!?

Wednesday, May 5, 2010

మృతుల అనుమతి తీసుకునే చంపాడా?

[నిందితుడి అనుమతి లేకుండా నార్కో పరీక్షలు నిర్వహించటం రాజ్యాంగ విరుద్దం - సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తో కూడిన డివిజన్ బెంచ్, ముంబై ముట్టడి విలన్ కసబ్ కేసు విషయమై, నిందితుడి అనుమతి లేకుండా నార్కో పరీక్షలు జరపటం రాజ్యాంగ విరుద్దమని తీర్పు చెప్పిందట. మరి సదరు నిందితుడు, భారత దేశం అనుమతి తీసుకుని వచ్చాడా, మృతుల అనుమతి తీసుకునే చంపాడా బావా?

సుబ్బారావు:
అవన్నీ అడగ కూడదు మరదలా! అసలు రాజ్యాంగం, మానవహక్కుల సంఘాలూ ఉన్నదే నిందితులనీ, నేరగాళ్ళనీ కాపాడేందుకు! ఆ కర్తవ్యాన్నే శక్తి వంచన లేకుండా కోర్టులూ నిర్వహిస్తున్నాయి. అలాంటప్పుడు తీర్పులు ఇలా ఉండక, ఇంకెలా ఉంటాయి చెప్పు!

Saturday, April 24, 2010

పాలెగాళ్ళు బ్రిటీష్ వాళ్ళకి కప్పం కట్టినట్లు, పైకి వాటాలు పంపటానికి ఎంసీఐ లు !

[భారతీయ వైద్యమండలి(ఎంసీఐ) అధ్యక్షుడు కేతన్ దేశాయ్, మౌలిక సదుపాయాలు లేని కాలేజీకి అనుమతి ఇవ్వటానికి 2 కోట్లు లంచం తీసుకుంటూ సీబీఐ కీ పట్టుబడ్డ - వార్త నేపధ్యంలో ]

సుబ్బలష్షిమి:
బావా!ఎంసీఐ అధ్యక్షుడు కేతన్ దేశాయ్ 2 కోట్లు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడట తెలుసా?

సుబ్బారావు:
మరి? మూడేళ్ళ క్రితం కూడా లలిత్ మోడి లాంటి వాళ్ళకి వ్యాపారంలో కలిసిరాలేదు. తరువాత ఐపీఎల్ తో ఎడాపెడా డబ్బులు సంపాదించి సొంత విమానాలు, లగ్జరీ బోట్లు, ఖరీదైన కార్లు కొన్నారు. ఇలాంటివన్నీ చూసినప్పుడు, డబ్బుసంపాదన పరుగులో తాము వెనకపడినట్లు అనిపించదూ? అందుకే తాము కూడా నాలుగు చేతుల సంపాదించాలని వీలైనంత ఎక్కువ లంచాలు పడుతుంటారు. పైవాళ్ళతో సహా ఎవరి వాటాలు వాళ్ళకి పంపగా, అందులో తమకి మిగిలేది కొంతే కదా!

సుబ్బలష్షిమి:
బావా! ఇతడి గురించి అప్పుడే అయిపోలేదు. 2001 లో అవినీతి ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టడంతో, అప్పట్లో ఒకసారి ఎంసీఐ అధ్యక్ష పదవి నుంచి ఈ కేతన్ దేశాయ్ తప్పుకున్నాడు. తర్వాత మళ్ళీ ఆ పదవిని చేజిక్కించుకున్నాడు. ఎంత ఖర్చుపెట్టి ఉంటాడో?

ఈ విషయం మీద ఆరోగ్యశాఖ మంత్రి గులాం నబీ అజాద్ మాత్రం.... ఎంసీఐ అధ్యక్షుడి నియామకం, తొలగింపులో ప్రభుత్వ పాత్రమీ ఉండదని, ప్రభుత్వంలో గానీ, ఆరోగ్యశాఖలో గానీ ఎంసీఐ భాగం కాదని వివరించారు. అదో ఎన్నికైన ప్రత్యేక వ్యవస్థని, భారత్ లో అలాంటివి వందల సంఖ్యలో ఉన్నాయని చెప్పాడు. మరి వాళ్ళకి జీతాలు ఎవరిస్తారు బావా? అసలు ఎన్నికైన ప్రత్యేక వ్యవస్థ అంటే ఏమిటి బావా!

సుబ్బారావు:
అంటే అది ఒకప్పటి పాలెగాళ్ళ వ్యవస్థ అన్నమాట. పాలెగాళ్ళు బ్రిటీష్ వాళ్ళకి కప్పం కట్టినట్లు, పైకి వాటాలు పంపటానికి మాత్రమే ఉంటుంది. వాటి మీద చర్యలు తీసుకోవటానికి మాత్రం, ప్రభుత్వం అవి తమ పరిధిలో ఉండవని చెబుతుంది. అలా చెప్పటానికి చక్కగా చట్టాలు చేసుకొని ఉంటారు మరదలా!అంతే!

సుబ్బలష్షిమి:
ఓరి నాయనో! ఇంత పచ్చి దోపిడీనా? ఇదేం ప్రజాస్వామ్యం బావా!

Thursday, April 15, 2010

ఇలాంటి చట్టాలు విత్తనాలకే గాక అన్నిటికీ వర్తింపచేస్తే.... అదే ఎమర్జన్సీ!

[>>> 'జీఎం (జెనిటికల్లీ మాడిఫైడ్) ఉత్పత్తులు భద్రం కావంటూ శాస్త్రీయ ఆధారాలు లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తే' జైలుకు పంపిస్తారు.
శాస్త్రీయమైన ఆధారాలు, సాక్ష్యాలు చూపకుండా జీఎం ఉత్పత్తులు సురక్షితం కాదంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తే ఆర్నెల్ల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష, రూ.2 లక్షల వరకు జరిమానా విధించేందుకు అవకాశం కల్పిస్తూ ఓ నిబంధన (చాప్టర్ 13 సెక్షన్ 63) పొందుపరిచింది.
ఇందుకు అనుగుణంగా భారత బయో టెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ బిల్లు (బీఆర్ఏఐ) - 2009 రూపొందించింది. - ఆంధ్రజ్యోతి వార్త నేపధ్యంలో]


సుబ్బలష్షిమి:
బావా! జెనిటికల్లీ మాడిపైడ్ విత్తనాల గురించి, ఎవరైనా సరే, ఆధారాలు లేకుండా మాట్లాడితే ప్రభుత్వం వాళ్ళపైన కేసులు పెట్టి జైలులో పెడుతుందట, తెలుసా?

సుబ్బారావు:
ఆ విత్తనాలని ప్రభుత్వం బలవంతంగానైనా సరే రైతుల నెత్తిన రుద్దాలనుకుంటుంది మరదలా! దాని మీద ఇంకే వ్యతిరేకతా రాకుండా చూడటానికి ఇలాంటి చట్టాలు తెస్తోంది. దీన్నే మరొకరు చేసి ఉంటే నియంతృత్వం అని విపరీత ప్రచారం చేసి ఉండేది మీడియా!

సుబ్బలష్షిమి:
ఏ విషయం మీదైనా ఆధారాలు లేకుండా మాట్లాడితే జైలులో పెట్టేటట్లయితే, ముందుగా మీడియా వాళ్ళనే జైలులో పెట్టాలి బావా! మొన్న ఎగ్జెయిల్డ్ వ్యవహారంలో టీవీ -5 వాళ్ళని జైలులొ పెట్టినట్లు! ఏ విషయమైనా... ఆధారాలతోనో, అవి లేకుండానో మీడియా వ్రాస్తేనే కదా ఎవరికైనా తెలిసేది!?

సుబ్బారావు:
ఇలాంటి చట్టాలు విత్తనాలకే గాక అన్నిటికీ వర్తింపచేస్తే.... అదే ఎమర్జన్సీ!

Monday, April 12, 2010

దోచుకుతినటమే ప్రజాస్వామ్యం అంటున్న దొంగల రాజ్యంలో ఉండేవి దొంగ లెక్కలే!

[రాష్ట్రంలో పారిశ్రామిక విధానంలో ఉపాధికల్పన లక్ష్యాలు సాధించలేక, సేవారంగంలోని ఆసుపత్రులు, సినిమా హాళ్ళు, పాఠశాలలు, కళాశాలలు, పెట్రోలు బంకులు, గ్యాస్ ఏజన్సీలు, ఫంక్షన్ హాళ్ళు లాంటి సేవారంగంలోని ఉద్యోగాలను నూతన పారిశ్రామిక విధానంలో చూపించి ఉపాధి లక్ష్యాలు సాధించామని చెప్పాలనుకుంటున రాష్ట్ర ప్రభుత్వం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! పరిశ్రమలు స్థాపించి ఉద్యొగాలు ఇప్పించి, ఉపాధి చూపించాల్సిన ప్రభుత్వం.... సేవారంగాన్ని కూడా పరిశ్రమలుగా చూపించి దొంగ లెక్కలు చెప్పాలనుకుంటుందేం బావా?

సుబ్బారావు:
దోచుకుతినటమే ప్రజాస్వామ్యం అంటున్న దొంగల రాజ్యంలో దొంగ లెక్కలు గాక, నిజాలుంటాయా మరదలా! అభివృద్ది రేట్లు, తలసరి ఆదాయపు లెక్కలు, ద్రవ్యోల్పణ రేట్లు అన్నీ ఈ బాపతువే!

Saturday, April 10, 2010

‘కోర్టుల్ని, జడ్జీల్ని నమ్మటం అంటే గొర్రె కసాయి వాణ్ణి నమ్మినట్లే!’

[సిక్కిం హైకోర్టుకు దినకరన్ బదిలీ. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. ఈ నెల 1న ఆయనను సెలవుపై వెళ్లాల్సిందిగా సుప్రీంకోర్టు కొలీజియం ఆదేశించింది. ఇందుకు దిన కరన్ నిరాకరించాడు కూడా! దాంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీం కొలీజియం దినకరన్ ను సిక్కిం హైకోర్టుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు సిక్కిం హైకోర్టు రాష్ట్ర బార్ అసోసియేషన్ వ్యతిరేకించింది. - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! నాకు తెలియక అడుగుతాను. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్జి దినకరన్ ని బదిలీ చేస్తే, అతడు వెళ్ళనని మొరాయించాడు. ఈ సుప్రీం కోర్టుకొలీజియం ఏమీ చేయలేక ఇంకో బదిలీ చేసి ఊరుకుంది. ఈ కోర్టులు, జడ్జీలు ఇక సామాన్య ప్రజానీకానికి ఏపాటి న్యాయం చేస్తారంటావు?

సుబ్బారావు:
అవినీతి బయటపడినా సెలవుపై వెళ్ళటానికి మొరాయించాడంటే సదరు జడ్జి ఎంత ముదురో చూడు! ఇలాంటి ‘కోర్టుల్ని, జడ్జీల్ని నమ్మటం అంటే గొర్రె కసాయి వాణ్ణి నమ్మినట్లే!’

Thursday, April 8, 2010

ఆర్ధిక వేత్త మాటలకు అర్ధాలే వేరులే!

[అందోళనలతో ధరలు దిగిరావని ప్రధాని పిలుపు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ప్రధాని మన్మోహన్ సింగ్ "అందోళనలతో ధరలు దిగిరావని, ధరల పెరుగుదలపై ధ్వజమెత్తకుండా.... తమ అపార అనుభవాన్ని, జ్ఞానాన్ని, అవగాహనను రంగరించి, ఓ సానుకూల పరిష్కారానికి పార్టీలన్నీ తోడ్పడాలని" అని కోరుతున్నాడు.

మొన్న కాండ్లా రేవు నుండి గల్ఫ్ కి బియ్యం దొంగతనంగా[?] రవాణా జరిగింది. క్రితం సంవత్సరం కృష్ణపట్నం రేవు నుండి బియ్యం దొంగ రవాణా జరిగింది. సిపిఐ చికెన్ నారాయణ దొంగనిల్వలని ఎన్నో బయటపెడితే , ప్రభుత్వం అతడిపై కేసులు పెట్టింది. ఇన్ని రకాలుగా ప్రజలకీ, ప్రతిపక్షాలకీ, పత్రికలకీ తెలుస్తున్న విషయాలు ప్రభుత్వానికి తెలియటం లేదా? ఇవన్నీ అరికడితే చాలు కదా! ఇంకా పరిష్కారానికి పార్టీలు ఏరకంగా తోడ్పడాలి బావా?

సుబ్బారావు:
నువ్వు నిజంగా అమాయకురాలివే మరదలా! ప్రధాని ఏ మన్నాడో ఒకసారి సరిగ్గా గుర్తు తెచ్చుకో!
>>>"అందోళనలతో ధరలు దిగిరావని, ధరల పెరుగుదలపై ధ్వజమెత్తకుండా.... తమ అపార అనుభవాన్ని జ్ఞానాన్ని, అవగాహనను రంగరించి ఓ సానుకూల పరిష్కారానికి పార్టీలన్నీ తోడ్పడాలి."

అంటే ’చేసిన గొడవలు చాలు. వచ్చి మీ వాటాలు మీరు పట్టుకు పోండి’ అని అర్ధం మరదలా!

మందేసి మరీ చిందులు చూడండి !

[జైపూర్ లో ఐపీయల్ మ్యాచ్ లో ఛీర్ గర్ల్స్ కీ, మద్యం సేవించడానికీ అనుమతినిచ్చిన అధికారులు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! జైపూర్ లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ లో, ఛీర్ గర్ల్స్ ని అదికారులు ముందు అనుమతించలేదట. తర్వాత వత్తిడి వచ్చి ఛీర్ గర్ల్స్ తో పాటు స్టేడియంలో మద్యం కూడా తాగొచ్చని అనుమతులిచ్చేసారట తెలుసా?

సుబ్బారావు:
వత్తిడి అంటే ఏముంటుంది మరదలా! రాజస్తాన్ లోనూ, కేంద్రంలోనూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఛీర్ గర్ల్స్ కి అనుమతి నిరాకరణ తర్వాత, ఐపీఎల్ నిర్వాహకులు, అధికారుల దగ్గరి నుండి రాజకీయ అధినేత్రుల దాకా, కాసుల మూటల పంపకాలు పూర్తి చేసి ఉంటారు. దాంతో ఛీర్ గర్ల్స్ కేం ఖర్మ, మద్యానికీ అనుమతి వచ్చేసి ఉంటుంది. మొత్తానికీ మందేసి మరీ చిందులు చూడొచ్చన్న మాట!

సుబ్బలష్షిమి:
బావా! ఒకప్పుడు మద్యం పుచ్చుకున్నవాళ్ళు, పెద్దల కంటపడకుండా, తక్కుతూ తారుతూ వచ్చి గమ్మున ఇంట్లో దూరేవాళ్ళు. తర్వాత రోజుల్లో ప్రభుత్వమే అబ్కారీ విధానం చేపట్టింది. అయినా మరీ ఇంతగా బరితెగించటమా! ఏమైనా విదేశీ మహిళ ప్రభుత్వ ఛైర్మన్ గా ఉండి... మొత్తం విదేశీయతనీ ఈ గడ్డ మీదికి దించేస్తోంది బావా!

సుబ్బారావు:
అంతేనా, ఈ విదేశీ మహిళ ఆహార భద్రత చట్టం తేవాలని పట్టుబడుతుందట తెలుసా మరదలా!

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! ఉన్న డబ్బులు మద్యం వ్యసనానికి ఖర్చుపెట్టాలి కదా? ఇంట్లో వాళ్ళకి కనీస ఆహార భద్రత ఏర్పాటు చేస్తే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు "ఈ విదేశీ దేవత వలనే మనం కనీస ఆహారం తింటున్నామని" గొప్పలు చెప్పుకోవచ్చు! దీన్నే అంటారేమో ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో లాక్కోవటం అని!