[షేర్ల మాయాజాలం. నాలుగు కంపెనీల ప్రమోటర్లతో డాంగీ గ్రూప్ కుమ్మక్కు. కృత్రిమంగా షేర్ల ధరలు పెంపు. ఐటీ దాడులతో బట్టబయలు – వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! ఈ వార్త చూడు.
>>> సాక్షిలో మాత్రమే వచ్చిన వార్తాంశం:[04/12]
షేర్ల మాయాజాలం!
కృత్రిమంగా ధరలను పెంచే చర్యలకు దిగారంటూ వెల్‌స్పన్ కార్పొరేషన్, ఆకృతీ సిటీ, మురళీ ఇండస్ట్రీస్, బ్రష్‌మాన్ ఇండియా కంపెనీ ప్రమోటర్లపై సెబీ నిషేధాన్ని విధించడంతో ఆయా కంపెనీల షేర్లన్నీ కుప్పకూలాయి. వీరంతా ఫండమెంటల్స్ కు మించిన స్థాయిలో షేర్ ధరను కృత్రిమంగా పెంచారన్నది అభియోగం.
[పూర్తి వార్తాంశం దిగువ చూడండి.]
~~~~~~
తమ షేర్ల ధరలు తామే పెంచుకునేందుకు సొంతంగా 10 డమ్మీ కంపెనీలు ఏర్పాటు చేసుకుందట మురళీ ఇండస్ట్రీస్! ఇంకా ఇతర కంపెనీలు డాంగీ గ్రూప్ తో ఒప్పందం కుదుర్చుకుని, ఆ ప్రకారం తమ షేర్ల ధరలను కృత్రిమంగా పెంచుకున్నారట.
సుబ్బారావు:
అది షేర్ మార్కెట్ లో మామూలే మరదలా! దొరికితే మురళీ ఇండస్ట్రీస్ లాగా దొంగలు! దొరకక పోతే అంబానీలు, కంపానీలు, టాటాలు, బజాజ్ లు! ఒకవేళ ఈ అంబానీలు, టాటాలు దొరికినా… ప్రభుత్వం చట్టాలు మార్చి అయినా వారిని దొరలనే చేసేస్తుంది.
సుబ్బలష్షిమి:
అంతేలే బావా! రాజకీయ, ఆర్ధిక పలుకుబడి లేనివాళ్ళు దొరికితే దొంగలు, ఆవి ఉన్నవాళ్ళు దొరికినా కూడా దొరలే!
~~~~~~~
>>> సాక్షిలో మాత్రమే వచ్చిన వార్తాంశం:[04/12]
షేర్ల మాయాజాలం!
కృత్రిమంగా ధరలను పెంచే చర్యలకు దిగారంటూ వెల్‌స్పన్ కార్పొరేషన్, ఆకృతీ సిటీ, మురళీ ఇండస్ట్రీస్, బ్రష్‌మాన్ ఇండియా కంపెనీ ప్రమోటర్లపై సెబీ నిషేధాన్ని విధించడంతో ఆయా కంపెనీల షేర్లన్నీ కుప్పకూలాయి. వీరంతా ఫండమెంటల్స్ కు మించిన స్థాయిలో షేర్ ధరను కృత్రిమంగా పెంచారన్నది అభియోగం. తద్వారా ఆయా కంపెనీలు, ప్రమోటర్లను స్టాక్ ఎక్స్ఛేంజీ కార్యకలాపాల నుంచి సెబీ నిషేధించింది. నిధుల సమీకరణ ప్రయత్నాలు సఫలమయ్యేందుకు సంజయ్ డాంగీ ప్రమోట్ చేసిన డాంగీ గ్రూప్ ఈ విషయంలో ఆయా కంపెనీల ప్రమోటర్లకు సహకరించినట్లు సెబీ ధృవీకరించింది. తొలుత మురళీ ఇండస్ట్రీస్ కార్యాలయంపై ఆదాయపన్ను అధికారులు దాడి చేయడంతో ప్రమోటర్ల వ్యూహాలు బయటపడ్డాయి. స్టాక్ కార్యకలాపాల నుంచి డాంగీని సైతం సెబీ నిషేధించింది.
ఏం జరిగిందంటే?
సెబీ పరిశోధన వివరాలిలా ఉన్నాయి. 2007 ఫిబ్రవరిలో మురళీ ఇండస్ట్రీస్ ఎఫ్‌సీసీబీల ద్వారా నిధుల సమీకరణకు దిగింది. అయితే అంతకుముందుగానే షేర్ ధరను భారీగా పెంచేందుకు డాంగీతో ఒప్పందం కుదుర్చుకుంది. వెరసి ప్రమోటర్లతో కుమ్మక్కైన డాంగీ... షేర్ ధరను కృత్రిమ పద్ధతిలో పెంచుతూ పోయింది. ఇందుకు అక్టోబర్ 2006 జూన్ 2007 కాలంలో మురళీ సొంతంగా ఏర్పాటు చేసిన 10 డమ్మీ సంస్థలు సహకరించాయి. తద్వారా అధిక ధరల వద్ద షేర్లను జారీ చేయడం ద్వారా ప్రమోటర్లు భారీగా నిధులను సమీకరించగలిగారు.
తద్వారా ప్రమోటర్లు కంపెనీ స్థాయికి మించిన ధరలో షేర్లను జారీ చేయడం ద్వారా లాభపడ్డారు. దీంతో సెబీ డాంగీపై మరింత లోతుగా పరిశోధన చేసింది. ఫలితంగా పలు కంపెనీలు ఎఫ్‌సీసీబీ, ఏడీఆర్, జీడీఆర్, క్విబ్, క్విప్ తదితర మార్గాలలో నిధులను సమీకరించేందుకు డాంగీతో చేతులు కలిపినట్లు తేలింది. వీటిలో వెల్‌స్పన్ కార్పొరేషన్, ఆకృతీ సిటీ, బ్రష్‌మాన్ ఉన్నాయి. అంటే ఆయా కంపెనీలు నిధుల సమీకరణకు ముందుగానే మార్కెట్లలో కృత్రిమంగా షేర్ల ధరల పెంపునకు పాల్పడినట్లు సెబీ నిర్ధారణకు వచ్చింది. దీంతో వాటిని నిషేధించింది.
సవాల్ చేస్తాం...
సెబీ నిషేధానికి గురైన కంపెనీలు నష్ట నివారణ చర్యలు చేపట్టనున్నాయి. సెబీ ఆదేశాలను సవాలు చేసేందుకు న్యాయ సలహాలను తీసుకోనున్నట్లు ఆకృతీ సిటీ, వెల్‌స్పన్ కార్పొరేషన్ శుక్రవారం విడివిడిగా తెలియజేశాయి. సెబీ ఆదేశాలను పరిశీలించాక తగు నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు పేర్కొన్నాయి. ఈ రెండు కంపెనీలూ నిబంధనలకు అనుగుణంగానే నడుచుకున్నట్లు పేర్కొనడం గమనించదగ్గ అంశం.
Pasted from http://uni.medhas.org/unicode.php5?file=http%3A%2F%2Fsakshi.com%2Fmain%2F..%2Fmain%2F..%2FMain%2F..%2Fmain%2F..%2Fmain%2FSportsDetailsNormal.aspx%3Fcatid=58722%26Categoryid=7%26subcatid=36
~~~~~~
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment