Tuesday, December 21, 2010

సోనియా, సావిత్రి కంటే మహానటి లాగుంది!

[అవినీతిని సహించం – కాంగ్రెస్ ప్లీనరిలో పార్టీకి సోనియా దిశా నిర్దేశం – ఈనాడు (20 డిసెంబరు, 2010) వార్త.

ధరలను దించాల్సిందే – యూపీఏ ప్రభుత్వానికి కాంగ్రెస్ సూచన – సాక్షి (21 డిసెంబరు, 2010) వార్తల నేపధ్యంలో! ]

సుబ్బలష్షిమి:
బావా! కాంగ్రెస్ ప్లీనరీలో అవినీతిని సహించమంటూ సోనియా పార్టీకి దిశానిర్దేశం చేసిందట తెలుసా?

సుబ్బారావు:
అందుకే కదా మరదలా, పార్టీ నియమావళి మార్చేసి మరీ, అధ్యక్షురాలి పదవీ కాలాన్ని మూడు నుండి అయిదేళ్ళకు పెంచేస్తూ ఏకగ్రీవంగా నిర్ణయించారు!

సుబ్బలష్షిమి:
పైగా ధరలను దించాల్సిందేనంటూ యూపీఏ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సూచించిందట బావా! నాకు అర్ధంగాక అడుగుతానూ, యూపీఏ లో ప్రధాన పార్టీ కాంగ్రెస్సే కదా! కేంద్రంలో అధికారంలో ఉన్న మంత్రుల్లో అత్యధికులు కాంగ్రెస్ వాళ్ళే కదా! ప్రధాన మంత్రీ కాంగ్రెస్సే కదా! మరి యూపీఏ కి సూచించిన కాంగ్రెస్ అంటే అర్ధం ఏమిటి? తమకి తామే సూచించుకున్నారా? ఇదేం రెడ్ టేపిజమ్?

సుబ్బారావు:
అసలుకే… సోనియా, మన్మోహన్ గట్రా ప్రస్తుత కాంగ్రెస్ బృందం, రెడ్ టేపిజానికి మహారాజ పోషకులు మరదలా! ఆపైన ఇలాంటి లిటిగేషన్ మాటలతో, చేతలతో దాన్ని మరింత కొత్త పుంతలు తొక్కిస్తుంటారు. అంతే!

సుబ్బలష్షిమి:
అంతే కాదు బావా! నిత్యావసరాల ధరలు తగ్గించేందుకూ, నల్ల బజారును అరికట్టేందుకు రాష్ట్రాలు సహకరించటం లేదని నిందిస్తున్నారు కూడా!

సుబ్బారావు:
ఏ రాష్ట్రమో ఎందుకు మరదలా! ఆంధ్రప్రదేశ్ లోనే నల్లబజారులో సరుకులను దాచిన గిడ్డంగులను ఎర్రపార్టీ నేత చికెన్ నారాయణ ఎన్నో సార్లు తాళాలు బద్దలు కొట్టి మరీ చూపించాడు. అధికారులు కూడా ఎన్నోసార్లు దాడులు చేసి పట్టుకున్నారు. ఆ తరువాత కేసులు ఎటుపోయాయో ఎవరికీ తెలియదు. యథాప్రకారం నల్లబజారు నడుస్తూనే ఉంది. ఇంకేం చెబుతాడు ఈ ప్రధాని?

సుబ్బలష్షిమి:
మరి, పార్టీలకతీతంగా రాజకీయులు ఎన్నికల్లో నిలబడాలంటే టిక్కెట్లు కొనుక్కోవాలి. గెలవాలంటే ఓట్లతో సహా చాలా కొనుక్కోవాలి. డబ్బు బాగా ఖర్చు పెట్టాలి. గెలిచాక మంత్రిపదవులు కొనుక్కోవాలి. కీలక శాఖలు కావాలంటే మరింత ఖర్చు తప్పదు. మంత్రులయ్యాక దోచిన దాంట్లో పైకి వాటాలు పంపించాలి. అలాంటప్పుడు నిత్యావసరాలు దగ్గర నుండి అన్నిట్లోనూ నల్లబజార్లతో సహా అన్ని రకాల దోపిడిలూ చేస్తారు కదా!

అవేవీ ఆపకుండా, తమ వాటాలూ మానకుండా, మాటలకి మాత్రం ‘నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి, నల్లబజారు నియంత్రణకి రాష్ట్రాలు సహకరించటం లేదు’ అనటం, ‘అవినీతిని సహించం’ అనటం, కేవలం నటన బావా!

సుబ్బారావు:
చూడబోతే సోనియా, సావిత్రి కంటే మహానటి లాగుంది మరదలా!

3 comments:

  1. ఇంకొక 5 సంసరాలు పొలిటికల్ పవర్ తన చెతులలొ వుంటే, భారత దేశాన్ని ఒక కిరస్తానీ దేశం గా మార్చెస్తుంది.

    రొమనుల నుండి భారతీయులు చాలా నెర్చుకొవాలి. కాన్-స్టాన్టిన్ - 1, తనకు అధికారము వచ్చిన 20 సంసరాలలొ రొమన్ రాజ్యాన్ని కిరస్తానీ మయం చెచాడు.

    She is following the same tactics. Convert Politicians, Bureaucrats, Military persons and upper Caste people in high positions.

    ReplyDelete
  2. అజ్ఞాత గారు: మీరన్నది నిజమే సుమా!

    astrojoyd గారు: నెనర్లండి!

    ReplyDelete