Friday, December 24, 2010

పేరు తలుచుకోవాటానికే భయమయిన చోట నివాళులు కూడానా!

[డిసెంబరు 23న మాజీ ప్రధాని చరణ్ సింగ్ జయంతి,
మాజీ ప్రధాని పీవీజీ వర్ధంతి – వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! చరణ్ సింగ్… కొన్ని నెలలు ప్రధానిగా పనిచేసాడు. ఒక్కరోజు కూడా ప్రధానిగా పార్లమెంటుకు హాజరు కాని వాడిగా పేరు గాంచాడు. తొలుత కాంగ్రెస్ లో ఉండి, పిదప పార్టీలు మారినవాడు. అలాంటి వాడికి కూడా పార్లమెంట్ సెంట్రల్ హాలులో వర్ణచిత్రం ఉంటుంది. జయంతి వర్ధంతులకి ప్రస్తుత ప్రధానులు స్పీకర్లు నివాళులు అర్పిస్తారు.

మాజీ ప్రధాని పీవీజీ… జీవిత కాలం పాటు కాంగ్రెస్ కండువాని మార్చలేదు. కష్టకాలంలో ప్రధాని అయి దేశాన్ని, ప్రభుత్వాన్నీ పూర్తికాలం నడిపించాడు. ఆయనకి చిత్రపటాలూ ఉండవు, పుష్పాంజలులూ ఉండవేం బావా!?

సుబ్బారావు:
భలే చెప్పావులే మరదలా! పీవీజీ పేరు తలుచుకోవాలంటేనే యూపీఏ ఛైర్ పర్సన్ కీ, ప్రధానమంత్రికీ, కేంద్రమంత్రుల్లో మరికొందరికీ భయమూ, విద్వేషమూ! ఇక వర్ణపటానికి ఎదురుగా నిలబడి నివాళులర్పించగలగటం కూడానా!

2 comments:

  1. కాని మన్మోహన్ సింగ్ ఆయనని ఎప్పుడూ మరిచిపోడు.
    ఎ పి భవన్ లో పి వి సంస్మరణ సభలకి హాజరవుతాడు.

    ReplyDelete
  2. bonagiri గారు: నెనర్లు!

    ReplyDelete