సుబ్బలష్షిమి:
బావా! మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటే, క్రికెట్ మ్యాచ్ ల్లో గెలుపోటములు గాకుండా, ఇంకా ఏమేం జరగొచ్చు?
సుబ్బారావు:
కేసీఆర్ లూ, చంద్రబాబులూ వంటి వారు ఆమరణ నిరహార దీక్షలు చేయొచ్చు. అంతగా అయితే ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కేస్తారన్న ధీమా ఉంటుంది గదా!
నవాబ్ షరీఫ్ లు లాహోర్ నుండి లాంగ్ మార్చ్ లు నిర్వహించొచ్చు. ఒక్క ఆత్మహుతి దాడీ, బాంబుదాడీ జరగదన్న ధీమా ఉంటుంది కదా!
వీపీ సింగ్ లు ఖలిస్తాన్ ఉద్యమం రగులుతున్న రోజుల్లో కూడా పంజాబ్ లో పర్యటనలు చేయొచ్చు. ఒక్క తూటా కూడా పేలదన్న ధీమా ఉంటుంది కదా!
అవినీతి ఆరోపణలెదుర్కుంటున్న ముఖ్యమంత్రులూ, ప్రధానమంత్రులూ, ఫలానా వారి అధ్యక్షతన గల ఫలానా కమిటీ ముందు హాజరవుతానన వచ్చు. ఇరుకున పడబోమన్న ధీమా ఉంటుంది గదా!
ప్రభుత్వ ఉద్యోగాల ఇంటర్యూలలో ఎక్కువ మార్కులు సంపాదించి ఉద్యోగాలను అందిపుచ్చుకోవచ్చు. ఏపీపీఎస్సి ఛైర్మన్ వెంకట రామిరెడ్డి నిర్వాకం అదే కదా!
ఇప్పటికివి, బయటకొస్తే ఇలాంటివి మరెన్నో!
సుబ్బలష్షిమి:
ఇవే కాదు బావా! పిల్లల చదువులతో నిమిత్తం లేకుండా స్కూళ్ళు, కాలేజీలు ర్యాంకుల అవకతవకలతో ఇమేజ్ పెంచుకోవచ్చు కూడా!
సుబ్బారావు:
నిజమే మరదలా!
Subscribe to:
Post Comments (Atom)
అంతే కాదు ఇంక చాలా ఉన్నాయి. మనకు నచ్చని వాళ్ళను పరీక్షలలో ఫెయిల్ చెయ్యొచ్చు. దానికి రకరకాల కారణాలు చూపొచ్చు. రిజిస్టర్డ్ నెంబరు తప్పువేసాడని లేకపోతే క్వశ్చన్ బుక్‌లెట్ సీరీస్ తప్పు వేసాడని లేనిపోని వంకలుపెట్టి పేపరు దిద్దకుండా ఆపొచ్చు. ఇలాంటి ఫిక్సింగులు చాలా ఉంటాయి.
ReplyDelete