[1. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి 9 ఏళ్ళు. దాదాపు సంవత్సర కాలపు గవర్నర్ పాలన తర్వాత, ఈ రోజు శిబూ సోరెన్ ముఖ్యమంత్రిగా 7 వ ప్రభుత్వం ఏర్పడబోతోంది.
2. చిన్నరాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యం - రాజకీయ నేతలు, భాజపా వంటి పార్టీలు. - వార్తల నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా ఈ రాజకీయ నాయకులూ, పార్టీలూ ఓ ప్రక్క చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యం అంటున్నారు. మరో ప్రక్క చూస్తే, చిన్న రాష్ట్రాలు మావోయిస్టుల వంటి తీవ్రవాదుల అడ్డాలుగా మారిపోయాయి. సుస్థిరప్రభుత్వాలు కరువవుతున్నాయి. జార్ఖండ్ రాష్ట్రంలో, అది ఏర్పడిన 9 ఏళ్ళల్లో ఏడు ప్రభుత్వాలు ఏర్పడ్డాయట తెలుసా?
సుబ్బారావు:
అదే విచిత్రం మరదలా! విడివిడిగా ఉన్న పుల్లల్ని విరవడం తేలిక, కట్టగడితే గట్టిగా ఉంటాయన్న నిజం, చిన్న పిల్లలకి కూడా తెలుసు గానీ, మన రాజకీయ పార్టీలకీ, నేతలకీ మాత్రం తెలియదు.
సుబ్బలష్షిమి:
అంతేలే బావా! నిద్రపోయే వాణ్ణి లేపగలం గానీ, "నేను నిద్రపోతున్నానూ" అంటూ గావుకేకలు వేసే వాణ్ణి ఎలా లేపగలం?
Subscribe to:
Post Comments (Atom)
టపాకాయ గారూ !
ReplyDeleteమీరన్నట్లు నిద్ర నటించే రాజకీయ నాయకుల్ని లేపవలసిన అవసరం లేదు, ప్రజలు మేల్కొంటే చాలు. ముఖ్యంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు - ఏం నష్ట పోతున్నారో తెలుసుకోవచ్చు.
ఆగ్రామసింహాలు నిద్రలేచినా చావే లెయ్యకపోయినా చావే
ReplyDeleteSRRao గారు,
ReplyDeleteఅవునండి. మీరన్నది నిజం! జనంలో చైతన్యం రావాలి. ఇంకా ఎన్ని దెబ్బలు తింటే వస్తుందో?
~~~~
సుబ్రమణ్య చైతన్య గారు,
నిజమే ఈ గ్రామసింహాలు నిద్రలేచినా, లెయ్యకపోయినా ఒకటే అజెండా ప్రజలని దోచుకోవటమే!:)
@సుబ్బలష్టిమి...బాగా చెప్పావు !!
ReplyDeleteటపాకాయ గారు...మిత్రులన్నట్లు అవి(రా.కీ.నా లు) గ్రామ సింహాలు ఐతే వాటిని లేపితే కొంచెం ఉపయోగమన్నా వుండేదేమో... కానీ అవి పిచ్చివి ... లేపితే మరీ ప్రమాదం....