[మాదక ద్రవ్యాల కంటే మద్యమే హానికరమని తేల్చిన శాస్త్ర పరిశోధనలు - వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! ‘హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాల కంటే, మద్యమే హానికరమని’ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి మరీ తేల్చారట! మరయితే, ప్రభుత్వం మద్య దుకాణాలు ఎత్తేస్తుందా, లేక హెరాయిన్, కొకైన్ వంటి మాదకద్రవ్యాల దుకాణాలు కూడా తెరుస్తుందా?
సుబ్బారావు:
ఇంకేం మరదలా! ఎటూ శాస్త్రజ్ఞులు ‘మద్యం కంటే హెరాయిన్, కొకైన్ వంటి మాదకద్రవ్యాలే తక్కువ ప్రమాదం’ అంటున్నారు. ప్రభుత్వానికి ఆదాయం కావాలి కాబట్టి, ‘మాదకద్రవ్యాల కంటే ప్రమాదకరమైన మద్యాన్నే అధికారికంగా అమ్మగా లేనిది, మాదక ద్రవ్యాలనెందుకు వదిలిపెట్టటం?’ అని... దానికో పోర్ట్ పోలియోని, మంత్రిని, పాలనా విభాగాన్ని నిర్వహించవచ్చు! గొలుసు మద్య దుకాణాల్లా, గొలుసు హెరాయిన్ దుకాణాలు, కొకైన్ దుకాణాలూ... వేలం పాటలు నిర్వహించి మరీ మంజూరు చేయవచ్చు.
అప్పుడు రాష్ట ఖజానాకి, మంత్రుల ఖతాలకీ మరిన్ని నిధులొస్తాయి. ఇక కొత్తమంత్రిత్వశాఖకి, మంత్రిపదవికి ఆశావహులు క్యూకట్టవచ్చు.
సుబ్బలష్షిమి:
అంతేలే బావా! వందిచ్చాక ఒకటికి వంకలెందుకన్నట్లు, మద్యం పంచాక మాదకద్రవ్యాలకి అడ్డేమిటి?
Thursday, November 4, 2010
Subscribe to:
Post Comments (Atom)
:)) Good one..
ReplyDelete:))
ReplyDeleteనిజమే! రాజీవ్ గంజాయి పథకం కింద బెల్ట్ షాపులొస్తే బాగుంటుంది.
ReplyDeleteWeekend Politician గారు, Indian Minerva గారు : నెనర్లండి!
ReplyDeletesnkr గారు: ప్రజల్లో అలసత్వం ఉన్నంత వరకు ఈలాంటి పథకాలు వస్తూనే ఉంటాయండి! :)