Wednesday, November 24, 2010

అతడు అమాయకుడను కుంటే మనం అమాయకులమే!

[2జి స్పెక్ట్రమ్ నేపధ్యంలో 1.76 లక్షల కోట్ల అవినీతి జరిగిందని అంచనాలు బయటికొస్తుంటే, ‘అందులో ప్రధానమంత్రికి ఏ పాపం తెలియదని’ కొందరూ, ‘మీడియా ప్రధాని పేరు అనవసరంగా లాగిందని’ సుప్రీంకోర్టూ వెనకేసుకొస్తున్న నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఓ ప్రక్క 2జి స్పెక్ట్రమ్ వ్యవహారంలో లక్షా డెబ్భై ఆరు వేల కోట్ల రూపాయల మేర అవినీతి జరిగినట్లు ఆరోపణలొస్తుంటే ప్రధానమంత్రికి ఏ పాపం తెలియదట, తెలుసా? మరీ అంత అమాయకత్వమా?

సుబ్బారావు:
తన క్రింద వాళ్లు లక్షల కోట్ల రూపాయలు మింగుతూ ఉంటే… నిష్ర్కియగా కూర్చున్నాడంటే, వాటాలు పుచ్చుకున్న అవినీతి పరుడన్నా అయి ఉండాలి. లేదా ఏమీ చెయ్యలేని అసమర్ధుడన్నా అయి ఉండాలి మరదలా! ఇవి రెండూ గాకుండా అతడు అమాయకుడను కుంటే… అలాంటి అమాయకుల్ని ఎవరూ కాపాడలేరు!

4 comments:

  1. ఆయనొక బొమ్మ అంతే.

    ReplyDelete
  2. కాపలా కోసం ముఖద్వారం దగ్గర నుంచో పెడితే దానికి తాళం వేసి కూర్చుని చూస్తూ, వెనుక గోడల నిండా బొక్కలు పెట్టి దోచుకుంటుంటే, " నా డ్యూటీ నేను చేస్తున్నా, నాకు ఏ పాపం అంటదు, కావాలంటే తాళం చూడండి వేసింది వేసినట్లే ఉంది " అనుకుంటూ, అంటూ చిరునవ్వులు వెలగపోస్తే, ఉద్యోగం నుంచి పీకరా ?

    ReplyDelete