[ఓ మంత్రి నన్ను 15కోట్లు లంచం అడిగాడు – బాంబు పేల్చిన రతన్ టాటా – వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! రతన్ టాటాని ఓ మంత్రి 15 కోట్ల రూపాయలు లంచం ఆడిగాడట. అలాంటి పనులు అతడి కిష్టం లేక, పౌరవిమాన యాన రంగంలోకి టాటా గ్రూపు ప్రవేశించ లేదట. ఇంతగా అవినీతి ఒక భాగం అయి పోయిన ఈ సమాజంలో, ఇతడెంతో నికార్సుగా వ్యాపారం చేస్తున్నాడు కాబోలు బావా! అలాగైతే ప్రపంచ ప్రభావశీల వ్యక్తుల్లో సోనియా, మన్మోహన్ ల కంటే ఇతడే ప్రముఖ స్థానంలో ఉండాలి మరి!
సుబ్బారావు:
రతన్ టాటా మరీ పత్తి విత్తనంలా మాట్లాడుతున్నాడు మరదలా! దాదాపు 2 శతాబ్దాల క్రితమే, బ్రిటీషు వాళ్ళ హయాంలోనే, ఇతడి వంశీయులు ఫ్యాక్టరీలు పెట్టి వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. అసలుకే… అవినీతికీ, లంచగొండి తనానికీ పుట్టిల్లు వంటిది బ్రిటన్! ఆ విషయం బాపూజీ ఆత్మకథలో, బారిష్టరు చదువుల ప్రకరణాన్ని చదివినా, తేటతెల్లమవుతుంది.
అలాంటి చోట… అసలు లంచాలే ఇవ్వకుండా ఈ రతన్ టాటా విస్తార వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతున్నానంటే, జనాల చెవిలో రఫ్లేషియా పెట్టడమే! మరోవైపు రతన్ టాటా, నీరా రాడియా ల సంభాషణలతో సహా, టాటా ఎవరికి ‘ఎంతెంత’ బహుమతులు ఆఫర్ చేసారో మీడియాలో వార్తలు చిలువలు పలువులుగా వస్తున్నాయి. బహుశః ఇతడు ‘లంచాలివ్వడు, బహుమతులిస్తాడు’ కాబోలు.
సుబ్బలష్షిమి:
ఇంతకీ పత్తి విత్తనంలా మాట్లాడటం అంటే ఏమిటి, బావా?
సుబ్బారావు:
పత్తి విత్తనం నల్లగా ఉన్నప్పటికీ, తన చుట్టూ విచ్చుకొని ఉన్న పత్తిని చూపిస్తూ “చూడు నేనెంత తెల్లగా ఉన్నానో” అంటుందిట. అదీ సంగతి!
Sunday, November 21, 2010
Subscribe to:
Post Comments (Atom)
కొన్ని రోజుల క్రితం సత్యాన్వేషి అనే బ్లగరు ఇక్కడ కొచ్చీ వచ్చి టాటా ను విమర్శిస్తావా అని తెగ గింజు కొన్నాడు. ఈ వార్తని అతని కి చూపించండి ఇప్పుడు ఎమంటాడొ చూద్దాం. ఈ రోజు సాక్షి పేపర్లో మొత్తం కథ రాశాడు, చదవమని చెప్పేది
ReplyDelete:)
ReplyDelete@పత్తి విత్తనం నల్లగా ఉన్నప్పటికీ, తన చుట్టూ విచ్చుకొని ఉన్న పత్తిని చూపిస్తూ “చూడు నేనెంత తెల్లగా ఉన్నానో” అంటుందిట. అదీ సంగతి!
ReplyDelete:)) మీరు కొట్టాల్సిన చోట కొట్టారు. నేసర్లు.
ఇంతకీ ఆ 2G యవ్వారంలో (రతన్)టాటా పాత్ర ఎంత శాతం అంటారు?
అజ్ఞాత గారు: ఎవరికో చూపించి మనం నమ్మించవలసిన అవసరం లేదండి. నమ్మేవాళ్ళ కోసమే నేను వ్రాస్తున్నాను. మీ వ్యాఖ్యకు నెనర్లండి.
ReplyDeleteసత్యేంద్ర గారు: నెనర్లండి!
రాజేష్ గారు: 2G యవ్వారం మొత్తం పూర్తి కానివ్వండి. అప్పుడు తీరిగ్గా విశ్లేషించుకుందా! :)
@అమ్మ ఒడి గారు,
ReplyDelete2G యవ్వారం మాత్రమే కాదు, ఆ తర్వాత జరిగిన అవుట్లుక్ శోధన లో టాటా పాత్ర... లేచింది మొదలు "TATA Code of Conduct" అని మా బుర్రలు తినే వాళ్లు హిప్పుడు ఏమి జెప్టారో.. చూద్దాం.