Saturday, October 2, 2010

`చూస్తే పోలా' అనుకుంటే ప్రాణాలే పోయాయి, పాపం!

[టీవీలో నాగ రాజు]


సుబ్బలష్షిమి:
బావా! ఇదేదో దోమ గ్రామమట. ఆ వూళ్ళో ఒకరింట్లో టీవీలోకి పాము దూరింది చూశావా?

సుబ్బారావు:
అవును మరదలా! "జనాలంతా టీవీలకి అతుక్కుపోయి చూస్తుంటారు కదా! అసలేముందో ఆ పెట్టెలో, ఓసారి చూస్తే పోలా?" అనుకుందేమో మరదలా!

సుబ్బలష్షిమి:
పాపం! `చూస్తే పోలా' అనుకుంటే ప్రాణాలే పోయాయి బావా!

5 comments:

  1. పోస్ట్ బాగుంది.

    నా వ్యాఖ్యల్ని ఇకనైనా చూడండి.....క్రింది లింకుతో!

    http://amtaryalu.blogspot.com/2010/08/5.html

    ReplyDelete
  2. కృష్ణశ్రీ గారు,

    మీ టపాని చాలా రోజులు క్రితమే చదివానండి. కాకపోతే వ్యాఖ్యానించలేదు. నా బ్లాగులో నన్ను సమర్ధిస్తూనో, నేను వ్రాసిన విషయంతో ఏకీభవిస్తునో వ్యాఖ్య వ్రాసిన వాళ్ళని (అంటే మీలాంటి విజ్ఞులని) కించపరుస్తూ, అమర్యాదగా... కొందరు అజ్ఞాతలు, కొందరు దొంగ నామధేయులు వ్యాఖ్యలు వ్రాస్తుంటారు. నేను గౌరవించే మీలాంటి విజ్ఞులని, అలా అమర్యాదంగా మాట్లాడటం, నాకు బాధగా, అసహనంగా అన్పిస్తుంది. అందుచేత అలాంటి వ్యాఖ్యాలన్నిటినీ తిరస్కరిస్తుంటాను.

    నా అంచనా ప్రకారం... నాకు మాటసాయం చేసే మీలాంటి విజ్ఞుల మీద కూడా, ఇలాంటి అనుచిత వ్యాఖ్యల దాడి జరుగుతుండ వచ్చని! అందుచేత, పోయి పోయి మీకు ఇబ్బంది కలిగించడం ఎందుకని, టపాలు నాకు నచ్చినా... సాధారణంగా వ్యాఖ్య వ్రాయను.

    మన ఇంట్లోకి దుష్టుల్ని రానీయం. అలాగే ‘మన బ్లాగులోకీ అశుద్ధాన్ని అనుమతించక పోవటం ఇది’ అనుకుంటాను. అందుచేతే మీ టపాకు వ్యాఖ్య వ్రాయలేదు. ఇదే విషయం మీకు ప్రత్యేకంగా చెప్పాలనుకున్నాను. ఇప్పుడు బ్లాగు ముఖంగా చెబుతున్నాను. అంతేనండి!

    నా గురించి వ్రాస్తూ "స్వంత పేరుతో నిజాలు నిర్భయంగా వ్రాసే ఉపాధ్యాయురాలు - ఈ అమ్మాయి" అనటంలోనే... మీకు నాపట్ల ఉన్న వాత్సల్యం నాకు మరింతగా అనుభూతిలోకి వస్తోంది. ఏం చెప్పను? కృతజ్ఞతలు తప్ప!

    గౌరవంతో కూడిన నెనర్లండి!

    ReplyDelete
  3. మీ ఆవేదన నాకు అర్థం అయ్యింది. ముఖ్యం గా మీలాంటి వాళ్లకి 'కామెంట్ మోడరేషన్ ' తప్పని సరే. ఇక ఈ అఙ్ఞాతల, దొంగ నామధేయుల వ్యాఖ్యల్ని పట్టించుకోకుండా బ్లాగు లోకం లోంచి వెలివెయ్యడమే వాళ్లకి సరైన శిక్ష.

    అలా అని, మన ముందు తరాల వాళ్లు పందుల ముందు ముత్యాలు జల్లడం మానలేదు కదా? మనం కూడా అంతే!

    నా బ్లాగుల్లో మీరు గమనించే వుంటారు--కామెంట్ మోడరేషన్ యెప్పుడూ పెట్టలేదు--యెవరు యే కామెంటిచ్చినా, తగ్గట్టు సమాధానం ఇస్తాను--అంతే!

    తెలుగు బ్లాగుల్లోని ఈ కేన్సర్ ఇదివరకటికన్నా తగ్గింది అనుకుంటా--పూర్తిగా పోయే రోజూ వస్తుంది.

    ధైర్యం గా వ్రాయండి.

    ReplyDelete
  4. మీ టపాకాయలు భలే పేలుతున్నాయ్

    ReplyDelete