Saturday, October 30, 2010

అంగారక గ్రహంపైకి ఎవరిని పంపాలి?

[అంగారక గ్రహంపై స్థిర నివాసం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! అంగారక గ్రహంపై వ్యోమగాములు స్థిర నివాసం ఏర్పరుచుకుంటారట. వాళ్ళని భూమి పైకి తీసుకురావటం ఖర్చుతో కూడుకున్నదని, కొన్నేళ్ళ పాటు భూమి నుండి ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులూ పంపాలని, క్రమంగా వాళ్ళు స్వయంపోషకంగా తయారుకావాలన్న ప్రణాళిక చేపట్టారట, తెలుసా?

సుబ్బారావు:
సుబ్బరం! అసలు పంపాల్సింది వ్యోమగాముల్ని కాదు మరదలా! భూమ్మీద తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి పరులందరినీ అంగారక గ్రహం పంపేసి, స్వయంపోషకంగా బ్రతకమంటే సరి! అప్పుడు భూమి, సగానికి సగం ఖాళీ అయిపోతుంది.

సుబ్బలష్షిమి:
అబ్బ, ఎంతాశ బావా నీకు? అయినా బావా, నాకో అనుమానం! అప్పుడు అంగారక గ్రహం కూడా అవినీతిమయమూ, కాలుష్యమయమూ అయిపోతుందేమో!

సుబ్బారావు:
అందుకు సందేహమేముంది! సలక్షణంగా అంతే!

3 comments:

  1. అప్పుడు మీకిక్కడ పనిలేకుందా అయిపోద్దిగా
    మీరుకూడా వాల్లతో వెల్లి వాల్ల కుత్రలగురిమ్చి రాసుకోవచ్చు, అక్కద బ్లాగులుంటాయా :)

    ReplyDelete
  2. బాగుంది ఆలోచన. అప్పుడు దేశానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది.

    ReplyDelete
  3. అజ్ఞాత గారు: మా టపాకాయ మీకు గట్టిగా తగిలినట్లుంది!

    రాజేష్ గారు: నెనర్లండి!

    ReplyDelete