[కాంగ్రెస్‌లో బంధుప్రీతికీ తావు లేదన్న కాంగ్రెస్ యువనేత రాహుల్ - వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా, కాంగ్రెస్‌లో బంధుప్రీతికి తావులేదట, తెలుసా? అందుకే కాబోలు - కాంగ్రెస్ అధ్యక్షురాలి ఇంట్లో ఇద్దరు ఎంపీలున్నారు. అందులో ఒకరు పార్టీ అధ్యక్షురాలైతే, మరొకరు పార్టీ ప్రధాన కార్యదర్శి.
సుబ్బారావు:
అంతే కాదు మరదలా! కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరి ఇంట్లో ముగ్గురు నలుగురు ఎంపీలో, ఎమ్‌ఎల్‌ఎ లో, ఛైర్మన్ లో ఉన్నారు. బొత్స ఇంట్లో నలుగురు, కాకా ఇంట్లో ఇద్దరు కొడుకులు, అల్లుడు. ఇక వై.యస్. బంధువర్గంలో అయితే నలుగురో ఐదుగురో పదవులలో ఉన్నారు. పవార్ ఇంట్లో ఇద్దరు ఎంపీలు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ లో దాదాపుగా ప్రతీ సభ్యుని ఇంట్లో రకరకాల పదవులు సంపాదించుకున్న వారు ఉన్నారు కదా!
సుబ్బలష్షిమి:
అంతే బావా! అందుకే "ఎదుటి వాళ్ళకి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి" అన్నాడు ఓ సినీ కవి! కాబట్టి డోంట్ కేర్ అనుకొని ఉంటాడు ఈ యువనేత రాహుల్!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment