Saturday, October 9, 2010

ఆశకు అంతులేదు, గోచీకి దరిద్రం లేదు అంటే ఇదే కాబోలు!

[ నేను మళ్ళీ సీఎం నవుతాను - చంద్రబాబు, మూడు రోజుల తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా! - సాక్షి, ఆంధ్రజ్యోతి వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! నేనే మళ్ళీ సీఎం నౌతానంటున్నాడు చంద్రబాబు. ఓ ప్రక్క, తెలంగాణా నుండి తెదేపాని, తెరాస కాంగ్రెస్‌లు కలిసి వెళ్ళగొట్టి పారేస్తున్నాయి. మరో ప్రక్క, కోస్తా రాయల సీమల్లో వై.యస్. తనయుడు, తండ్రి ఇచ్చిపోయిన కోట్లు కుమ్మరించైనా పట్టుపెంచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మరి ఏమనుకొని చంద్రబాబు సీఎం నౌతానంటున్నాడు బావా! చూడబోతే... ఎన్నికలు రాకుండానే ఆశల పల్లకీలు, ఊహల ఉయ్యాలలూ ఎక్కేసినట్లున్నాడు!

సుబ్బారావు:
ఊహలా పాడా! ఆమాత్రం ఆశలు పెట్టకపోతే, తమ్ముళ్ళంతా తలోదారి అయిపోతారని, ఆపాటి కట్టడి మాటలు మాట్లాడుతున్నాడు మరదలా!

సుబ్బలష్షిమి:
ఆశకు అంతులేదు, గోచీకి దరిద్రం లేదు అంటే ఇదే కాబోలు!

4 comments:

  1. అప్పారావు శాస్త్రి గారు: నెనర్లండి!

    jaggampeta గారు: నెనర్లు!

    astrojoyd గారు: టైటిల్ గొప్పదనం నాది కాదండి! సామెతలన్నీ ఒకే చోట సమీకూర్చిన [http://dsubrahmanyam.blogspot.com/]బాగ్లర్ సుబ్రమణ్యంగారి దండి! నెనర్లు ఆయనకి చెప్పుకోవాలండి!

    ReplyDelete