[ఇద్దరు భార్యల ఈవోపై చర్య తీసుకోండి. హైకోర్టులో శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం బోర్డు సభ్యుడి పిటిషన్. ప్రభుత్వానికి, ఈవోకు నోటిసులు జారీ చేసిన హైకోర్టు - వార్త నేపధ్యంలో ]
సుబ్బలష్షిమి:
బావా! శ్రీకాళహస్తి ఈవో శ్రీరామచంద్రమూర్తి[!] అట. అతడు ఇద్దరు భార్యలతో పూజలు నిర్వహిస్తున్న ఫోటోతో సహా వార్త వచ్చింది. రెండో పెళ్ళి కోసం, ఇస్లాం స్వీకరించినట్లు ఆరోపణ కూడా ఉంది. చట్టవిరుద్ధంగా, బహుభార్యత్వం కలిగి ఉన్న వ్యక్తిని, దేవాలయ కార్య నిర్వహణాధికారిగా నియమించడాన్ని సవాలు చేస్తూ, బోర్డు సభ్యుడొకరు కోర్టు నాశ్రయించాడు.
అయినా దేవాదాయ శాఖకి అందరూ ఇలాంటి వాళ్ళే దొరుకు తారేం బావా?
సుబ్బారావు:
అవినీతిలో అందరికంటే ఆరాకులు ఎక్కువే చదివారు మరదలా, దేవాదాయ శాఖలో ఉన్నతాధికార్ల దగ్గర నుండి అటెండరు స్థాయి దాకా అధికశాతం మంది! శ్రీశైలంలో మందు చిందూ వేస్తూ, ఆలయ ఉద్యోగులు దొరికి పోయారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో శృంగారం వెలగ బెడుతూ కెమెరాకి దొరికి పోయారు ఓ ఉద్యోగినీ, మరో ఉద్యోగి!
ఎక్కడన్నా పాపం చేస్తే, పోగొట్టుకోవడానికి పుణ్యక్షేత్రాలని దర్శిస్తారట. అలాంటిది... సాక్షాత్తూ పుణ్యక్షేత్రాల్లోనే, టన్నుల కొద్దీ పాపాన్ని, నిర్భీతిగా మూటగట్టుకుంటూ ఉంటారు, ఈ శాఖ ఉద్యోగులు.
హిందూమతం అంటే అందరికీ చులకనే కదా! అదీగాక, హిందుత్వాన్ని భ్రష్టుపట్టించడానికే కదా దేవాదాయ శాఖ ఉంది!?
Subscribe to:
Post Comments (Atom)
Nice post.
ReplyDeleteదేవాదాయ శాఖలొ పనిచెసె వారిలొ (పూజారులతొ సహా) ఎంతమంది మతము (కిరస్తానీ మరియు ముసల్మాని) పుచ్చుకున్న వారువున్నారొ? 5-15% వుండవచ్చు ఎమూ?
వారిలొ ఎంతమంది హిందూ మతానికి వెతిరెకి అయిన కాంగ్రెస్ పార్టికి వొట్లు వెస్తున్నారొ? ఇది 60% దాకా వుండవచ్చు. ఎక్కువమంది పూజారులు కాంగ్రెస్ పార్టికి వొట్లు వెస్తువుండవచ్చు. దానికి కారణము local పరిస్తితులు (కుల సమీకరణములు) అయివుండవచ్చు, లెక వారి అవగాహనా లొపము కావచ్చు. ఆధ్రాలొ 70-80 % పూజారుల వొట్లు కాంగ్రెస్ పార్టికి పడుతున్నాయి.
మన మతము డబ్బు అనుభవిస్తు, వాళ్ళు హిందూ మతానికి వెతిరెకి అయిన కాంగ్రెస్ పార్టికి వొట్లు వెస్తున్నారు. ఈ పరిస్తితి మారాలి. ఎలా?
అజ్ఞాత గారు: మీ అభిప్రాయాన్ని వెల్లడించినందుకు నెనర్లండి!
ReplyDelete