Wednesday, October 6, 2010

అలాగంటే... కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోవటం ఖాయం!

[బాకావీరులూ... భాజపాలో చేరండి. కాంగ్రెస్‌లో వ్యక్తిపూజకు స్థానం లేదు - రాహుల్ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కాంగ్రెస్‌లో బంధుప్రీతికీ, వ్యక్తి పూజకూ తావులేదట, ఆ పార్టీ ప్రధానకార్యదర్శి రాహుల్ అంటున్నాడు.

సుబ్బారావు:
కాంగ్రెస్‌లో బంధుప్రీతి లేకుండానే... అధ్యక్షురాలి అబ్బాయి గారు, యెకాయెకి పార్టీ ప్రధాన కార్యదర్శి అయిపోయాడా మరదలా? మరీ... నేతిబీరకాయలో నెయ్యుందనడం గాకపోతే!

సుబ్బలష్షిమి:
అంతేనా!? వ్యక్తిపూజకు కూడా తావులేదట. బాకా వీరులందరూ భాజపాలో చేరమంటున్నాడు.

సుబ్బారావు:
అతడి అమ్మగారు పాదాభివందనాలు చేయించుకుంటుంది. తన అడుగులకు మడుగులొత్తిన వాళ్ళకే పదవులు కట్టబెడుతుంది. అందుకే కదా, ఏ రాష్ట్రంలోనైనా... రోశయ్యలాంటి వాళ్ళు "అధిష్టానం ముద్రే నా ముద్ర. అధిష్టానం ఏం చెబితే అది శిరసావహిస్తాను" అంటారు. బొత్సలు, మధుయాష్కీలు, కేకేలు "అధిష్టానాన్ని ధిక్కరిస్తే కఠిన చర్యలే! అధిష్టానానికి విధేయత చూపాలి" అని ఢంకా భజాయించి చెబుతారు. "మేం ఆ ఇంటి కుక్కలం" అన్నవాళ్ళు ఉన్నారు. దీన్ని ఏమంటారో, వ్యక్తిపూజ అని గాక?

అంచేత "కాంగ్రెస్‌లోని భజన పరులూ...! భాజపాలో చేరండి" అంటే... కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోవటం ఖాయం!

5 comments:

  1. నిజంగా అటువంటి వాళ్ళంతా వెళ్ళిపోయి ఖాళీ అయినా ఒక రకంగా అది కాంగ్రేస్ కే మంచిది. అయినా మీ పిచ్చిగానీ అట్టా చెప్పగానే వెళ్ళిపోయే రకాలా వీళ్ళు!!

    ReplyDelete
  2. బెజవాడ రౌడీ గారు, వీకెండ్ పొలిటీషియన్ గారు: నెనర్లండి!

    ReplyDelete
  3. ఉన్నఫళంగా ఆమాటనేస్తే అఫ్రోజాబాద్‌కి విచ్చేసే రంజన్‌బాబులేమైపోవాలి? వాళ్లను నమ్ముకున్న ఖద్దరుటోపీలేమవ్వాలి?

    ReplyDelete
  4. సుబ్రమణ్య చైతన్య గారు: నిజమే కదా! ‘లోపలి మనిషి’ని మళ్ళీ గుర్తుచేసారు. నెనర్లు!

    ReplyDelete