Friday, September 24, 2010

ఆ 20% నిజాయితీపరులు వీళ్ళే అయ్యుంటారు!?

[భారతీయులలో 20 శాతం మంది మాత్రమే నిజాయితీ పరులూ అని ప్రకటించిన మాజీ సీవీసీ కమీషనర్ ప్రత్యూష్ సిన్హా - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కేంద్ర విజిలెన్స్ కమీషనర్ గా పదవీ విరమణ చేసిన ప్రత్యూష్ సిన్హా అనే సీనియర్ అధికారి, భారతీయులలో అవినీతి పెరిగిపోతోందని, కేవలం 20% మంది మాత్రమే ఏ ప్రలోభాలకు లొంగని వాళ్ళున్నారని అంటున్నాడు, తెలుసా?

సుబ్బారావు:
అవును మరదలా! కాకపోతే ఆ 20% మంది ఎక్కడున్నారో మనలాంటి సామాన్యులకి తెలియదు గానీ, అభిమానుల అంధనేత్రాలకు మాత్రం, తమ ప్రియతమ నేతలు మూర్తీభవించిన నిజాయితీ పరులుగా కనబడుతుంటారు.

సుబ్బలష్షిమి:
అదేమిటి బావా!

సుబ్బారావు:
అదంతే మరదలా! ఉదాహరణకి చంద్రబాబు, వై.ఎస్.,కేసీఆర్ గట్రాల అవినీతి గురించి ఎవరైనా ఏమైనా అన్నారనుకో! వాళ్ళ అభిమానులు రఁయ్యిన వచ్చి, ఆ అన్నవాళ్ళ మీద మాటల తూటాలు పేల్చి, ‘తమ అభిమాన నాయకులు నిజాయితీకి నిజరూపాలు’ అంటారు.

ఈ లెక్కన... సదరు అభిమానుల అభిప్రాయంలో దేశం లో ఉన్న 20% నిజాయితీపరుల్లో కేవలం... సోనియా, మన్మోహన్ సింగ్, చంద్రబాబు, జగనూ, రామోజీరావు, లల్లూ ప్రసాద్ యాదవ్, మాయావతి, కరుణానిధి, జయలలిత, టాటాలు, బిర్లాలూ, అంబానీలు.... వగైరాలు మాత్రమే ఉండి ఉండాలి.

సుబ్బలష్షిమి:
ఏం చెప్పగలం బావా! అభిమానులకి హరతివ్వాల్సిందే!

5 comments:

  1. Nijanga nijamandi. Abhimanulaki ekkuva ipothundhi feeling asalu vallakanna. nenu inka baga eppudu realize iyyanante "Nenithe" movie chusaka...prapancham lo ee konam ila untundha ani anipinchindhi. Worth writing it.

    Priya.

    ReplyDelete
  2. ఇంతకు సిన్హా గారు నీతి పరుడేనా ? ,అవకాసం లేని వాడు ,చేతకాని వాడు మాత్రమె నీతి మంతుడు .సో -నాకు తెలిసి ఆ 20 %నీతిపరులు ఇక్కడ ఎవరు లేరు,వాళ్ళంతా అడవుల్లో వుంటూ నీతిని కాపాడుతున్నారు .

    ReplyDelete
  3. మిగతా వాళ్ళ సంగతేమో కానీ కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు అవకాశం ఇవ్వలేదు.. చంద్రబాబైనా వ్యాపారాల్లో పెరు కనిపించింది కానీ.. కేసీఆర్ చస్తా కాని తప్పు చేయను అన్నట్ట్లు మాట్లాడతాడు... ఇలా మాట్లాడితే అభిమానం పెంచుకోమా చెప్పండి ..

    ReplyDelete
  4. ప్రియ గారు, అజ్ఞాత గారు, రామ్‌మోహన్ గారు :నెనర్లండి!

    కిరణ్ గారు: మీ అభిమానం అండి!:)

    ReplyDelete