Monday, September 20, 2010
ఆత్మాభిమానమే తెలిసి ఉంటే ఇలా ఉంటారా?
[కేసీఆర్‌కి చెప్పులు తొడుగుతున్న తెరాస కార్యకర్తల వార్త నేపధ్యంలో ]
సుబ్బలష్షిమి:
బావా! మొన్నోసారి డి.శ్రీనివాస్‌కి చెప్పులు తొడిగారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇప్పుడు కేసీఆర్‌కి చెప్పులు తొడుగుతున్నారు తెరాస కార్యకర్తలు. ఆ నాయకులకేమో వొళ్ళొంగదు. ఆత్మాభిమానం కోసం ప్రత్యేక రాష్ట్రం అనే వీళ్ళకి అసలు ఆత్మాభిమానం అంటే ఏమిటో తెలుసా బావా?
సుబ్బారావు:
ఆత్మాభిమానమా? ఏదో నాయకుల అరుస్తున్నారు కాబట్టి, తామూ అరవటమే గానీ, ఆత్మాభిమానమే తెలిసి ఉంటే అలా ఉంటారా మరదలా? డి.శ్రీనివాస్, కేసీఆర్‌ల వంటి ఒళ్ళొంగని నాయకులూ, వాళ్ళ పాదాలు పట్టుకునే కార్యకర్తలూ ఉన్నంత కాలం... ఏ దేశమైనా, రాష్ట్రమైనా పొందేది అధోగతే! రావలసిన మార్పు రాజకీయంగా కాదు మరదలా, ముందు ప్రజల బుర్రల్లో రావాలి!
Subscribe to:
Post Comments (Atom)
వాళ్ళు మా "నా య కు లు"
ReplyDeleteవాళ్ళ చెప్పులు మోస్తం
వాళ్ళు చదువుకోవద్దంటే చదువుకోం
వాళ్ళు చావమంటే ఛస్తం
వాళ్ళు ఉస్కో అంటే ఎవ్వరి మీదకైనా దూకుతం
వాళ్ళ ......
నీకేంది మధ్యలో?
UskO.. dooku.. phO..
ReplyDeleteసిద్ధాంత పరంగా విమర్శించండి .. హూందాగా ఉంటుంది ..
ReplyDeletesubbaraogaaru,aatmaabhimaanamunna vokka chemchagaanni chupinchandi,meeku nobel prize ippinche puchi naadi.
ReplyDeleteఅజ్ఞాతలకు నెనర్లండి!
ReplyDeleteచివరి అజ్ఞాత గారు : ఆత్మాభిమానం ఉన్న చెంచాగాళ్ళు లేరు కాబట్టే మన రాజకీయ వ్యవస్థ, దేశం ఇలా ఉందండి. ఏం చేస్తాం, మేం నోబెల్ ఫ్రైజ్ మిస్ అయ్యాం!:)