Monday, September 27, 2010

కోడిపుంజు గుడ్లుపెట్టినట్లు, దున్నపోతు ఈనుతుందేమో!


[కోడి పుంజు గుడ్లు పెట్టింది - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! రంగారెడ్డి జిల్లా రాఘవాపూర్‌లో కోడిపుంజు గుడ్లు పెట్టిందట. మొన్నెప్పుడో అంబటి రాంబాబు "రామోజీ...దున్నపోతు ఈనిందా!" అన్నాడని సాక్షి పత్రిక వ్రాసింది. ఇప్పుడు కోడిపుంజు గుడ్లు పెట్టింది. అసలే ఆధునిక సాంకేతికత అందుబాటులో కొచ్చిన చోట, రేపెప్పుడో దున్నపోతు ఈనినా ఈనుతుందేమో కదా, బావా!

సుబ్బారావు:
ఏమో మరదలా! ఈనాడు కోడిపుంజు గుడ్లుపెట్టినట్లు, మరోనాడు దున్నపోతు ఈనుతుందేమో! దున్నపోతు ఈనితే మాత్రం... ఏ దూడ పుడుతుందో చూడాల్సిందే!

1 comment:

  1. ఆల్రెడీ ఈనుతూనే ఉన్నాయి మనవాళ్ళు కట్టివేస్తూనే ఉన్నారు కదా! :)

    ReplyDelete