Thursday, September 23, 2010

విమర్శిస్తే వ్యతిరేక ఆలోచనా విధానమే!

[కామెన్వెల్త్ క్రీడ నిర్మాణాలలో రోజు కొకటి కూలటం, రోజుకో అవినీతి వెలికి రావటం కొనసాగుతున్న తరుణంలో,
‘మీడియాది వ్యతిరేక ఆలోచనా ధోరణి’ - జైపాల్ రెడ్డి, షీలాదీక్షిత్‌లు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కామెన్వెల్త్ క్రీడల ఏర్పాట్లలో ఎన్ని అవకతవకలు, ఎంత అవినీతో! మొన్న సోమవారం మండపమొకటి కూలింది, మంగళ వారం పాదచారుల వంతెన కూలింది. బుధవారం ఫాల్స్ స్లాబు కూలింది. ఈ నేపధ్యంలో... కేంద్రమంత్రి ఎస్.జైపాల్ రెడ్డి, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌లు ‘మీడియా అతిగా స్పందిస్తోందనీ, మీడియాది వ్యతిరేక దృక్పధమనీ’ తేల్చి చెప్పారు, తెలుసా!

సుబ్బారావు:
అంతే మరి! తమనెవరైనా విమర్శిస్తే... ఎవరైనా అనే మాటే ఇది! చివరికి మీడియాని విమర్శిస్తే, మీడియా కూడా ఆ విమర్శించిన వాళ్ళని ఇదే అంటుంది.

సుబ్బలష్షిమి:
వెరసి... ‘ఎవరెంత అవినీతి అక్రమాలూ చేసినా కిమ్మనకుండా ఉండటం సానుకూల ఆలోచనా ధోరణి, తప్పులెత్తి చూపటం వ్యతిరేక ఆలోచనా విధానంగా’ నిర్వచింపబడ్డాయన్న మాట! ఎంత బేవార్సు భాష్యాలు బావా!

5 comments:

  1. ఆజ్ఞాతా !

    మీ విషయ పరిజ్ఞానానికి, మీ సునిశిత పరిశీలనకి ఇవే నా నమస్సులు.

    -శ్రీరామ్

    ReplyDelete
  2. విమర్శిస్తే వాళ్లకు వ్యతిరేక ఆలోచనా విదానమే కదా !భాగా చెప్పారు .

    ReplyDelete
  3. నిజానికి మనదేశ media చాల మంచిది common wealth games గురించి చాల తక్కువ మాట్లడుతున్నై. ఎవరికి పట్టింది ఆ గేమ్స్ ఎలా వుంటే. మరి దేశి మీడియా ను అంతే.
    see what world media saying
    http://news.bbc.co.uk/sport1/hi/commonwealth_games/delhi_2010/9025666.stm
    http://www.guardian.co.uk/sport/gallery/2010/sep/23/commonwealth-games-delhi-athletes-village
    http://www.thisislondon.co.uk/standard/article-23881454-a-damaging-drip-feed-of-indian-incompetence.do

    ReplyDelete
  4. శ్రీరామ్ గారు:కృతజ్ఞతలండి!

    gajula గారు: నెనర్లండి!

    రెండవ అజ్ఞాత గారు: మంచి లింకులిచ్చారు.నెనర్లండి!

    ReplyDelete