Wednesday, September 1, 2010

నిను వీడని నీడను నేనే!

[బంగారు లక్ష్మణ్‌పై కేసు కొట్టివేతకు ఢిల్లీ హైకోర్టు నో!
న్యూఢిల్లీ: పదేళ్ల క్రితం.. ఓ స్టింగ్ ఆపరేషన్‌లో డబ్బులు తీసుకుంటూ పట్టుబడిన కేసులో బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌పై ఉన్న విచారణను కొట్టివేసేందుకు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఆయనపై ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను తొలగించేందుకు జస్టిస్ ధింగ్రా ఒప్పుకోలేదు. 2001లో తెహల్కా పత్రిక నిర్వహించిన ఓ శూలశోధనలో లక్ష్మణ్ రూ.లక్ష తీసుకుంటూ పట్టుబడ్డారు. ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వ హయాంలో 2004లో సీబీఐ దీనిపై కేసు దాఖలు చేసింది.]

సుబ్బలష్షిమి:
బావా! పాపం, ఈ భాజపా మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ ని, లక్షరూపాయల లంచం తీసుకున్న తెహల్కా కేసు ‘నిను వీడని నీడను నేనే’ అన్నట్లు పట్టుకుంది చూడూ!

సుబ్బారావు:
నిజమే మరదలా! పదేళ్ళ క్రితం లక్షరూపాయల లంచం! ఈ రోజు ప్రభుత్వ శాఖల్లో అవినీతి అటెండర్ల అక్రమార్జన చూసినా... అధమ పక్షం పదుల లక్షల్లో ఉంటోంది. అలాంటి చోట, బంగారు లక్ష్మణ్ దురదృష్టం దుక్కలాగున్నట్లుంది. తెహల్కా కేసు విడిచిపెట్టటం లేదు.

సుబ్బలష్షిమి:
సిగ్గు చిమడటం అంటే ఇదేనేమో బావా!

3 comments:

  1. paapam,bhangaarunu alo laxmanaa ..anipistunnaru

    ReplyDelete
  2. Better luck next "term" అనుకోవడమే అసలే ప్రస్తుతం B.J.P.. కి రోజులుకూడా కావు అయినా అంత పెద్ద మనిషి ఒఖ్ఖ లక్ష కేసులో చిక్కుకోవదామేంటండీ చులాగ్గా?

    ReplyDelete
  3. gajula గారు: నెనర్లండి!

    Indian Minerva గారు: నిజమే, లక్షే పాపం!:)

    ReplyDelete