[>>>టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను పాలస్తీనా విమోచనా సంస్థ ప్రతినిధులు ప్రొఫెసర్ లిసా తారకీ, మిస్టర్ థామస్ ఆదివారం కలిశారు. టీఆర్‌ఎస్ కార్యాలయానికి వచ్చిన వారు కేసీఆర్‌తో సుమారు పావుగంటపాటు సమావేశమయ్యారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ పాలస్తీనాపై దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయిల్ పట్ల భారత్ కఠినంగా వ్యవహరించాలని కోరేందుకు వచ్చామన్నారు.
కేసీఆర్‌తో పాలస్తీనా ప్రతినిధుల భేటీ - సాక్షిపత్రిక 27 సెప్టెంబరు, 2010, 12వ పేజీ వార్త నేపధ్యంలో...
>>>పాలస్తీనా దేశస్తులకు అండగా నిలవాలని, భారతదేశం వారికి సహాయపడేలా చూడాలని పాలస్తీనాకు చెందిన హక్కుల కార్యకర్త లిసాతరకీ, ఫ్రాన్స్‌కు చెందిన మరో కార్యకర్త థామస్ సోమ్మర్‌లు ఆదివారం కేసీఆర్‌ను పార్టీ కార్యాలయంలో కలిసారు. తాము దేశంలోని అన్ని పార్టీల నాయకులను కలుస్తున్నామని, భారతదేశం కొత్తగా రూపొందించిన విదేశీ విధానాలు ఇజ్రాయెల్ దేశానికి అనుకూలంగా ఉన్నాయని, వీటిని సవరించేలా ఒత్తిడి తేవాలని కోరుతున్నామని వివరించారు. కేసీఆర్ సానుకూలంగా స్పందించారని, పాలస్తీనా ప్రజలకు సంఘీభావం ప్రకటించారని లీసా తరకీ మీడియాతో చెప్పారు.
కేసీఆర్‌తో పాలస్తీనా సామాజిక కార్యకర్తల భేటీ: ఈనాడు 27 సెప్టెంబరు, 2010, 09వ పేజీ వార్త నేపధ్యంలో...]
సుబ్బలష్షిమి:
బావా! పాలస్తీనా పై దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయెల్ పట్ల భారత్ కఠినంగా వ్యవహరించాలని కోరేందుకు, పాలస్తీనా విమోచన సంస్థ ప్రతినిధులు(?) వచ్చారట. వచ్చి కేసీఆర్‌ని కలిసారట. ఇదేం చోద్యం బావా? కేసీఆరేమన్నా భారత ప్రభుత్వంలో ఉన్నాడా? జాతీయ నాయకుడా? ఓ ఉప ప్రాంతీయ నాయకుడే కదా?
ఇది మరీ మోకాలికీ బోడిగుండుకీ సంబంధం పెట్టినట్లు గానో, తాటి చెట్టు ఎందుకెక్కావంటే దూడగడ్డి కోసమన్నట్లు గానో లేదూ?
సుబ్బారావు:
ఏం చేస్తాం మరదలా!? అన్నీ వింతలే అయిపోయాయి. లోపల వాళ్ళేం మాట్లాడుకున్నా... ఏ సమాచారం ఇచ్చిపుచ్చుకున్నా... పైకి మాత్రం, వాళ్ళేం చెబితే అదే నమ్మాలి కదా! మోకాలు బోడిగుండులా ఉందన్నా, దూడగడ్డి కోసం తాటి చెట్టు ఎక్కానన్నా, ‘కామోస’ను కోవాల్సిందే! తప్పదు! సామాన్యులంత కంటే ఏం చెయ్యగలరు చెప్పు!
Wednesday, September 29, 2010
Subscribe to:
Post Comments (Atom)
నిజాం తెలంగాణాని పాకిస్థాన్లో కలపాలని ట్రై చేస్తే, ఈయన పాలస్తీనాలో కలపాలనుకుంటున్నాడేమో, మంచిదేగా! ఏలెక్కన అమ్మేయాలనుకుంటున్నాడో, గజం ఎంతో ఆరా తీయండి. పాలస్తీనాతో కలపడానికి ఎం.ఐ.ఎం కూడా మద్దతిస్తుందనుకుంటా. :))
ReplyDeletebhaadalalo vunnodikE aa bhaada telustundi.thana bhaada thaggadaaniki vaadu andarini sahaayam cheyyamantaadu,manaku chethanaithE sahaayam cheyyaali ,lEdante mounamugaa vundaali .
ReplyDeleteతప్పో ఒప్పో పలు రకాల నాయకులను కలవటం తప్పేం కాదు... లోపల లోపల ఏం జరిగిందో అనుకోవటం కూడా అతి ఆలోచనే కావచ్చు ... ఇవ్వాల్టి ముసుగు రేపైనా తొలగాల్సిందే.. ఇన్నాళ్ళూ ఆంధ్రా వ్యతిరేకి అని పెరు బడ్డ కేసీఆర్ ఇక్కడ పుట్టిన వాడు ఇక్కడి బిడ్డే అని చెప్పటం .. అందువలన కొంత నష్టం జరిగినా వెనక్కి తగ్గక పోవటం మీకు కనిపించటం లేదా.. మాకైతే తను చెప్ప్తున్నది చెప్పినట్టు చేస్తున్నాడు అని..
ReplyDeleteWhy are you worried? Anyone can issue any statement on any subject? Ask Lagadapati to meet Israeli ambassador & issue a statement opposing Palestine if you are so concerned.
ReplyDelete