[బెంగుళూరులో ఎకరాల కొద్దీ విశాలమైన ప్యాలెస్ కట్టుకున్న జగన్ - తెదేపా నేతల విమర్శ.
ఫిల్మ్ సిటీ పేరుతో బుల్లెట్ ఫ్రూప్ ఇల్లు నిర్మించుకున్న రామోజీరావు - జగన్ వర్గీయుల ప్రతివిమర్శల నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! బెంగుళూరులో జగన్, అతడి తండ్రి వై.యస్. బ్రతికి ఉన్న రోజుల్లోనే, ఎకరాల కొద్దీ సువిశాలమైన ఇల్లు కట్టుకున్నారట. భద్రత కోసం పలు గేట్లు పెట్టుకున్నాడట. షిప్టుకి 200 మంది చొప్పున, రోజుకి 600 మంది సెక్యూరిటీ సిబ్బందిని పెట్టుకున్నాడట - ఇది ఆ రెండు పత్రికలూ, తెదేపా నేతలూ చేస్తున్న విమర్శ!
ఇందుకు జగన్ వర్గీయులు... ఫిల్మ్ సిటీ పేరిట వందల ఎకరాలు కాజేసి, అందులో 20 ఎకరాలలో రామోజీరావు బుల్లెట్ ఫ్రూప్ ఇల్లు కట్టుకున్నాడన్నాడని ప్రతివిమర్శ చేస్తున్నారు.
నాకు తెలియక అడుగుతాను, అంత పటిష్టమైన, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, వాళ్ళ ఇళ్ళకెందుకు బావా? పోనీ ప్రాణ రక్షణ కోసం అనుకుందామంటే, ఓ వైపు రామోజీరావు సినీ తారల ఇంట పెళ్ళిళ్ళూ, రోడ్డు ప్రమాదాల పరామర్శలూ వంటి వ్యక్తిగత సందర్శనలకు పోతూనే ఉంటాడయ్యె. మరో వైపు జగన్, మీ ఇంట్లో ‘పెరుగున్నం తింటా, పెద్ద కొడుకుగా ఉంటా’ అంటూ ఓదార్పు యాత్రలూ మామూలుగానే చేస్తున్నాడయ్యె!
తమ ప్రాణాల కంటే విలువైనవీ, ముఖ్యమైనవీ వాళ్ళ ఇళ్ళల్లో ఏమున్నాయి బావా, అంతగా రక్షణ ఏర్పాట్లు చేసుకున్నారు?
సుబ్బారావు:
అంత గండికోట రహస్యాలు ఏమున్నాయో? బయటికి వచ్చినప్పుడు కదా మనబోటి వాళ్ళకి తెలిసేది మరదలా!
Thursday, September 9, 2010
Subscribe to:
Post Comments (Atom)
తెలుగులో ఓక ముతక సామెత ఉంది. నువ్వు లం..... అంటే, నువ్వు లం....,నీ అమ్మ లం....,నీ అమ్మమ్మ లం..... అట్లా ఉంది వీళ్ళ పని. దేశంలో 35% జనం అర్ధాకలి తొ పడుకుం టున్నారు,20% మంది
ReplyDeleteకి నిలువ నీడ లేదు. రాజకీయ నాయకులు వేల,లక్షల కోట్లలొ మాట్లా డుకుంటున్నారు. రాజకీయ నాయకుల ఆస్తులన్నీ జాతీయం చేయాలని ఒక ఉద్యమం ప్రారంభిస్తే బాగుంటుంది కదూ!
praanam leni aa rahasyaalanu,bhayatiki raakundaa praanapradangaa kaapadukovadaanike antha security dr.subbarao gaaru!
ReplyDeletetarakam గారు : మీరన్నది అక్షరాల నిజమండీ!
ReplyDeletegajula గారు: బాగా చెప్పారు!:)