[అక్రమాలకు పాల్పడిన ఉద్యోగిపై బదిలీ వేటు - వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! శ్రీశైలం దేవాలయపు అతిశీఘ్రదర్శన కౌంటర్‌లోనూ, లడ్డూ విక్రయాల్లోనూ(1100 లడ్డూలు) గోల్‌మాల్‌లు చేసిన ఉద్యోగులపై బదిలీ వేటు పడిందట. అసలు ఉద్యోగులకి బదిలీలన్నవి వాళ్ళ ఉద్యోగంలో భాగం కదా బావా? అలాంటిది బదిలీ చేస్తే శిక్షపడినట్లు అంటారేమిటి, అధికారులూ, మీడియా కూడా? ఇది ఈ ఒక్క ఉద్యోగి విషయంలోనే కాదు, ఐఏఎస్‌ల దగ్గర నుండి చిన్నస్థాయి ఉద్యోగి దాకా ‘బదిలీ వేటు’ అన్నది ‘శిక్ష’గానే ప్రచారం జరుగుతుంది.
సుబ్బారావు:
అంటే మరదలా, కేసులు రాలే సీట్లో నుండి మరో సీటుకి బదిలీ అయితే, మళ్ళీ అన్నీ సర్ధుబాట్లు చేసుకుని... లంచాలతోనో, అక్రమాలతోనూ పైసలు రాబట్టుకోవాలంటే కొంచెం సమయం పడుతుంది కదా! అందుచేత శిక్షపడినట్లేనన్న మాట. అది అధికారులూ, పత్రికలూ కలిసి పుట్టించిన కొత్త భాష, భాష్యమూ కూడా! అవినీతిపరులని రక్షించటానికే కదా ఈ చట్టాలు ఉన్నాయి? అంత ఉదార ప్రజాస్వామ్యం మరి!
సుబ్బలష్షిమి:
ఇంతా చేసి, ఆ బదిలీలు కూడా అంతర్గత బదిలీలు బావా! ఆఫీసులో, ఒక గది నుండి మరో గదికి అన్నంత మామూలుగా! లడ్డూల కౌంటర్లో ఆఫ్‌రికార్డులో లడ్డూలమ్ముకున్నట్లే, గంగాసదన్‌లో ఆఫ్‌రికార్డులో గదులద్దెకిచ్చుకోవచ్చు, తెలుసా?
సుబ్బారావు:
తూతూమంత్రపు శిక్షలైనప్పుడు అక్రమాలు అలాగే కొనసాగుతాయి మరి!
Tuesday, September 28, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment