Wednesday, August 4, 2010

10, జనపథ్ లో పారదర్శకత లోపించిందా?

[అమెరికా నుండి తిరిగొచ్చిన రాహుల్ - ఈనాడు వార్త నేపధ్యంలో
>>>అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మమ్మను చూసేందుకు తల్లి సోనియా గాంధీతో కలిసి అమెరికా వెళ్ళిన రాహుల్ గాంధీ భారత్ తిరిగొచ్చాడు. సోమవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. సోనియా మాత్రం మరికొన్ని రోజుల పాటు అమెరికాలోనే ఉంటారు. ఆమె తల్లి పావ్ లో మైనో గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోనియా ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లే ఇటీవల భారత్ పర్యటనలో పర్యటించిన బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరన్ తో జరగాల్సిన చర్చలు రద్దయినట్లు వదంతలు వచ్చాయి. అయితే ఆమె అమెరికా వెళ్ళినట్లు తర్వాత తెలిసింది.]

సుబ్బలష్షిమి:
బావా! కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూసేందుకు అమెరికా వెళ్తే, ఆమెకే అనారోగ్యంగా ఉండటంతో బ్రిటన్ ప్రధానితో సమావేశం రద్దయ్యిందని వదంతులు వ్యాపించాయట.

పార్టీ అధ్యక్షురాలి కార్యక్రమాల గురించి.... పార్టీ ఆఫీసులో గానీ, ఆమె నివాసంలో గానీ, మీడియాకి కూడా వాస్తవాలు తెలియటం లేదు కాబోలు! మరీ అంతగా సీక్రసీ మెయింటేన్ చేయాల్సిన అవసరమేమిటో బావా? అంతగా పారదర్శకత ఎందుకు లోపించినట్లు?

సుబ్బారావు:
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, యూపీఏ ప్రభుత్వ కుర్చీ వ్యక్తీ అయిన సోనియా, పార్లమెంట్ కు కూడా రాని నేపధ్యంలో సైతం, ఆమె అమెరికాలో ఉందో, ఇంట్లోనో ఉందో, తెలుసుకోలేని స్థితిలో ఉన్న మీడియా... ఇక ప్రభుత్వం లోపల ఏ అవకతవకలు జరుగుతున్నాయో ఏం పసిగట్టగలదు మరదలా!?

5 comments:

  1. అవును రాహుల్ వెళ్ళింది లండన్ కదా...

    ReplyDelete
  2. అసలు అక్కడ పారదర్శకత ఉ౦టే కదా లోపి౦చడానికి?
    ఇ౦తకూ మైనోగారికి జబ్బు నిజమేనా? అమ్మగారు అమెరికాలోనే వున్నారా?
    ఉన్నా, ఏ పనిమీద వెళ్ళారో తెలుసా? తెలుసుకునే దమ్మెవడికైనా ఉ౦దా?

    ReplyDelete
  3. తార గారు: రాహుల్ లండన్ నుండి వచ్చి చాలా రోజులయ్యిందండి. ఆ తర్వాత అమెరికా వెళ్లాడు. ఇప్పడు అక్కడి నుండి కూడా వచ్చాయండి. మీరింకా లండన్ దగ్గరే ఆగిపోయారు. :)

    అజ్ఞాత గారు: నెనర్లండి!

    ReplyDelete
  4. హిహిహి..

    బ్రిటన్ ప్రధాని లాగ్ లో రాహుల్ లండన్ వెళ్ళిన కారణంగా అని ప్రెస్ రిలీజ్ ఇచ్చాడు, మనమ్ పేపర్లలో ఈ వార్త రావటానికి బహుశా ౨-౩ రోజూ ముందు..

    ReplyDelete
  5. The newspaper reports that even Congress general secretary Rahul Gandhi who usually makes himself available for visiting leaders, left New Delhi this week -- ironically, for London

    ఇది ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో వచ్చింది..

    ReplyDelete