[నెహ్రు కన్నా మన్మోహనే గొప్ప - Aug. 18, 2010.
తండ్రిని మించిన తనయుడు రాహుల్ - Aug. 19, 2010 - తన తాజా పుస్తకంలో ప్రముఖ పాత్రికేయుడు కుష్వంత్ సింగ్ ప్రశంసల నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! ప్రముఖ పాత్రికేయుడు కుష్వంత్ సింగ్, తన తాజా పుస్తకంలో, మన్మోహన్ సింగ్ నీ, రాహుల్ నీ తెగ పొగిడి పారేసాడట, తెలుసా?
సుబ్బారావు:
తెలుసు మరదలా! నువ్వు తెలుసుకోవలసిన విషయాలు మరికొన్ని ఉన్నాయి. ఈ కుష్వంత్ సింగ్ పాకిస్తాన్ పంజాబ్ వాసి. దేశ విభజన నాడు అటు నుండి ఇటు వలస వచ్చాడు. అలా వచ్చిన వారిలో చాలామంది లాగే, అనతి కాలంలోనే సక్సెస్ ఫుల్ అయిపోయాడు. లాహోర్ కాలేజీలో డిగ్రీ చదువులూ, లండన్ లో ఉన్నత చదువులూ చదివాడు మరి!
1974 లో తన కివ్వబడిన పద్మభూషణ్ ని 1984 లో ఆపరేషన్ బ్లూస్టార్ మీద అలిగి, తిరిగి ఇచ్చేసాడు. 2007లో యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్ ని స్వీకరించాడు. మరి యూపీఏ కుర్చీవ్యక్తి సోనియా, కాంగ్రెస్ పగ్గాలు చేపట్టగానే, సిక్కులకు క్షమాపణ చెప్పేసింది కదా! దాంతో సంతృప్తుడై పోయాడన్న మాట. సిక్కుల్ని ఊచకోత కోసిన కేసులో నిందితుడు జగదీష్ టైట్లర్ ని, యూపీఏ ఆదరిస్తోందన్న సంగతి వ్యూహాత్మకంగా మరిచిపోయాడు. అదీ ఈ సీనియర్ జర్నలిస్ట్ కథా కమామిషు, తెల్సిందా?
సుబ్బలష్షిమి:
ఓహో! అయితే ఇతడు పాకిస్తాన్ నుండి ఇటువచ్చిన వాడన్న మాట! మొత్తానికి మన్మోహన్ సింగ్, రాహుల్ వంటి సోనియా బృందాన్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నాడు, ఎందుకు?
సుబ్బలష్షిమి:
ఎందుకేమిటి మరదలా? ప్రశంసలకి తగిన ప్రతి ఫలాలివ్వటంలో సోనియా గ్రేట్ కదా మరి!
Subscribe to:
Post Comments (Atom)
ituvantivaallanu pramukulugaa gurthiste manaku burralenatlu,goppavaallu kukkabiscutsku longaru.
ReplyDeletegajula గారు బాగా చెప్పారు.
ReplyDelete