[లోక్ సభలో ‘బాబ్లీ’ హోరు....
>>>ఇదే సమయంలో సభానాయకుడు, ఆర్దిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ లేచి, టీడీపీ సభ్యులను వారి స్థానాలకు వెళ్ళాలని గట్టిగా చెప్పారు. దీంతో మీరెవరు మాకు చెప్పడానికంటూ టీడీపీ సభ్యుడు శివప్రసాద్ ఆయనపై ఎదురు దాడికి దిగారు. దీంతో ప్రణబ్ ఆగ్రహం పట్టలేక... ఇది నిబంధన, మీరు వెళ్ళండటూ గట్టిగా అరిచారు. - సాక్షి వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! నిన్న లోక్ సభలో, బాబ్లీ ప్రాజెక్టు గురించి రచ్చ జరిగిందట. అందుచేత సభ రెండుసార్లు వాయిదా పడింది. తెదేపా సభ్యులు స్పీకర్ ముందుకెళ్ళి ఆందోళన చేసినప్పుడు జరిగిన వాగ్వాదంలో, ప్రణబ్ ముఖర్జీ సభా నిబంధనల గురించి మాట్లాడాడు తెలుసా?
సుబ్బారావు:
మరి ఏ నిబంధనల ప్రకారం, మహారాష్ట్ర పోలీసుల చేత, తెదేపా నేతల మక్కెలిరగ్గొటించారట? తమకి కావాలసిన చోట, అవసర మెచ్చిన నిబంధనల గురించి మాట్లాడటం, ఈ రాజకీయ నాయకుల సహజ లక్షణం మరదలా!
సుబ్బలష్షిమి:
అంతేలే బావా! తన దాక వస్తే తాడే పామంటారు. ఇతరుల ప్రాణాల మీదికొస్తే పామునైనా తాడే అంటారు. అసలైన ‘రాజకీయం’ అదేనేమో!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment