[రీసెర్చ్ సూపర్ వైజర్ (గైడ్) అందుబాటులో లేకపోయినా, డబ్బుకోసం పీహెడ్ డీలకు అనుమతులిస్తున్న ప్రభుత్వం - వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! విశ్వవిద్యాలయాల్లో తగినంత మంది గైడ్స్ లేకపోయినా, ప్రభుత్వం పీహెచ్ డీ లకు అనుమతు లిచ్చేస్తోందట. అదే వర్సిటీలో గైడ్‌లు లేకున్నప్పటికీ, దేశంలో ఎవరైనా సరే... పీ హెచ్‌డీ చేసి, ఐదేళ్ల అనుభవం ఉన్న వాళ్లనెవరినైనా గైడ్‌గా పెట్టుకోవచ్చని నిబంధనలు పెట్టిందట. అంటే తమకు అనుకూలమైన ఎవరితోనైనా కుమ్మక్కై వాళ్ళని తమ గైడ్ గా పెట్టుకుంటే చాలు, డాక్టరేట్ రెడీ! ఇది ఎక్కడికి దారితీస్తుంది బావా?
సుబ్బారావు:
ఎక్కడి కేముంది మరదలా! ఇప్పుడు "రండి బాబూ, రండి! వేడి వేడి పకోడీలు!" అని తోపుడు బళ్ళ వాళ్ళు అరుస్తుంటారు కదా! అలా... "రండి బాబూ, రండి! వేడి వేడి డాక్టరేట్లు!" అనే కేకలు వినబడే దాక! ఇప్పటికే ఇంజనీరింగ్ కాలేజీలలో ఆ పరిస్థితి ఉంది, ఇప్పుడు డాక్టరేట్ల వంతన్న మాట!
సుబ్బలష్షిమి:
చిన్నపిల్లలకు అక్షరాలు నేర్పేందుకు, ఎవరైనా... ఓ చిన్నబడి పెట్టుకుంటే, అర్హతలేని వాళ్ళ చేతుల్లో పడి, బడిపిల్లల భవిష్యత్తు నాశనమై పోతుందంటూ... వంద రూల్సు చెప్పే ప్రభుత్వం, పైసలిస్తే డాక్టరేట్లని పిప్పరమెంట్లలాగా ఇచ్చేస్తోందన్న మాట! మొత్తానికీ డాక్టరేట్లు పకోడీల కంటే వేడిగా ఉన్నాయే!
Subscribe to:
Post Comments (Atom)
prjalanu intha bhaaga educate chestunna subbalaxmi gaariki,subbarao gaariki,veellanu guide chestunna adilaxmi gaariki,maa satyaharichandra university tarapuna docteratlanu prakatistunnamu. dr.gajula vice chanseller
ReplyDeleteహా!హా! మా పేరు ముందు డాలు తగిలించారన్న మాట! ఇక ముందు డా. సుబ్బలక్ష్మి, డా.సుబ్బారావు అని వ్రాయలంటారా!:)
ReplyDeletenice post, the same was happened recently in one of the university from rayalseema .
ReplyDelete