Monday, August 23, 2010

సోమనాధ్ ఛటర్జీ, మన్మోహన్ సింగ్ లు - దొందూ దొందే!

[సోమనాధ్ పార్టీనీ, సిద్దాంతాన్ని మించి ఎదిగారు - మన్మోహన్ సింగ్ వ్యాఖ్య నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! లోక్ సభ మాజీ స్పీకర్ సోమనాధ్ ఛటర్జీ వ్రాసిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ... మన్మోహన్ సింగ్ "తాను నమ్మిందే సరైనదని భావించిన ఛటర్జీ తన పార్టీని, సిద్దాంతాన్ని మించి ఎదిగారని" వ్యాఖ్యానించాడట తెలుసా?

సుబ్బారావు:
మరి? ఛటర్జీ నమ్మింది యూపీఏ కి అనుకూలంగా పనిచెయ్యటమే మేలని! కాబట్టే కదా... 2008, జూలై 22 న పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం సంధర్భంలో ఓటుకు నోటు రచ్చ జరిగినా, చాలా మామూలుగా నీరుగార్చాడు, స్పీకర్ పదవికి రాజీనామా చేసి ఓటింగ్ లో పాల్గొనమని సీపీఎం పార్టీ ఆదేశిస్తే... కాదు పొమ్మన్నాడు!

సుబ్బలష్షిమి:
తమకు అనుకూలంగా... ఎదుటి పార్టీవాళ్ళు, పార్టీ అధినేతల నిర్ణయాన్ని కాదని ప్రవర్తిస్తే... అది పార్టీని మించి ఎదగటమన్న మాట! అదే తమ పార్టీలో వాళ్ళు ప్రవర్తిస్తే, అది ‘క్రమశిక్షణా రాహిత్య’మన్న మాట! మొత్తానికీ ఈ రాజకీయ నాయకులకి రెండునాల్కలు బావా!

సుబ్బారావు:
ఛటర్జీ మాత్రం సామాన్యుడనుకున్నావా మరదలా? ఎటూ స్పీకర్ గా చేశాక, ఇక ఆ వయస్సులో, తన పార్టీలో ఉండి, అందుకోగలిగే ఉన్నత పదవులు ఉండవు. ఇక సీపీఎంలో కొనసాగినా, ఒరిగేదేం లేదు. లెక్క వేసుకుంటే... యూపీఏ కి అనుకూలంగా పనిచేసి, ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు సహకరిస్తేనే భారీగా లాభిస్తుంది.

అందుకే పార్టీని ధిక్కరించాడు. ఎన్ని వాదనలు చెప్పాడో తెలుసా? చివరికి "భాజపా ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని ఎలా బలపరిచేది?" అన్నాడు. అదే భాజపా మద్దతుతో స్పీకర్ గా ఎన్నికయ్యాడన్న విషయం వ్యూహాత్మకంగా మరిచిపోయాడు. పైగా ఎంత పాజిటివ్ గా చెప్పుకుంటున్నాడో చూడు, ‘సీపీఎం తనని పార్టీ నుండి బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తానెప్పుడూ ప్రశ్నించలేదనీ, సమీక్ష కోసం విజ్ఞప్తి చెయ్యలేదనీ’ పేర్కొన్నాడట, తెలుసా?

సుబ్బలష్షిమి:
‘తాను చేస్తే శృంగారం, ఇతరులు చేస్తే వ్యభిచారం’ అనటంలో సోమనాధ్ ఛటర్జీ, మన్మోహన్ సింగ్ ఒకరికొకరు తీసిపోరన్న మాట.

1 comment:

  1. anthaa raajakeeyam(raajakeeyanaayakudu yemi chesinaa-yemi maatlaadina-anthaa raajakeeyam)

    ReplyDelete