Tuesday, August 24, 2010

ఇవా ప్రజల చేతిలో పాశుపతాస్త్రాలూ, అక్షరాయుధాలు, ప్రజా గళాలు?

[జగన్ కు అధిష్టానం తొలిసారి తీవ్ర హెచ్చరిక చేసిందని - పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది - ఈనాడు వార్తాంశం (22 ఆగస్ట్ , 2010)
డ్రగ్స్ వ్యాపారంలో సినీనటులు - ఈనాడు, 23,24 ఆగస్టు, 2010- వార్తల నేపధ్యంలో ]

సుబ్బలష్షిమి:
బావా! ఈ మధ్య వార్తా పత్రికల్లో... ఎక్కువ వార్తలు ‘తెలిసింది. సమాచారం...’ అంటూ... ఒక నిర్దిష్టత, ఖచ్చితత్వం లేకుండా వ్రాస్తున్నారు. ఈ రోజు ఒక వార్త వ్రాస్తే, రేపు అది అసత్యమని ఖండన వస్తోంది.

పైగా ఈ రోజు డ్రగ్స్ వ్యాపారంలో సినీ నటులున్నారని వ్రాస్తూ, ఒక ప్రముఖ నటుడు, మరో సెలబ్రిటీ నటుడు గట్రా విశేషణాలు తప్పితే, అసలెవరి పేరూ ఊసు లేకుండానే పేద్ద వార్త వ్రాసి పారేసారు. అదే చిన్నా చితకా వాళ్ళ పేర్లయితే వేసేస్తారు. ఏమిటీ మతలబు?

సుబ్బారావు:
వాటిని బ్లాక్ మెయిలింగ్ వార్తలన వచ్చు మరదలా! ‘వచ్చి బేరం మాట్లాడుకోండి. లేకపోతే తదుపరి వార్తల్లో పేర్లు వ్రాయాల్సి వస్తుంది’ అన్న హెచ్చరికలు, అలా ఇస్తాయన్న మాట పత్రికల యజమాన్యాలు.

ఇక ‘తెలిసింది. సమాచారం’ - పేరిట రాజకీయ నాటకాలంటావా, అందులో తిలాపాపం తలా పిడికెడన్నట్లు, రాజకీయ నాయకులూ, పత్రికల యాజమాన్యాలూ కూడా, నాలుక మడతలేస్తుంటాయి.

సుబ్బలష్షిమి:
ఇదేం జర్నలిజం బావా? ఈ పాటి దానికి, పత్రికల గురించి ‘ప్రజల చేతిలో పాశుపతాస్త్రం’, ‘అక్షరాయుధం’, ‘ప్రజా గళం’ గట్రా బిరుదు లెందుకు?

2 comments: