[పరిశ్రమ... తపాలపాకుల తోటా ఒకటే -
భూముల వర్గీకరణ కుదింపు ఫలితం. పెనుభారమైన స్టాంపురుసుం - వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! క్రయ విక్రయాలలో భూములు చేతులు మారినప్పుడు, రిజిస్ట్రేషన్ చేయిస్తారు కదా! గతంలో భూముల వర్గీకరణలు 27 రకాలుండేవట. ఇప్పుడు 9 రకాలుగా సవరించే సరికి, ఏతావాతా భూముల విలువా, స్టాంపు రుసుములూ కూడా భారీగా పెరిగాయట.
>>>కడప జిల్లాలో ఒక గ్రామంలో ఎకరా రూ.2.6 లక్షలు ఉంటూ వచ్చిన భూమి ఇప్పుడు రూ. 7.6 లక్షలకు ఎగబాకింది. దీంతో స్టాంపు రుసుం భారం రూ.24,700 నుండి 64,600 లకు పెరిగింది.
అంటే స్టాంపురుసుం ఎక్కువగా వసూలవ్వాలనే, ప్రభుత్వం, రిజిస్ట్రేషన్ వర్గీకరణలని సవరించినట్లుంది కదా బావా?
సుబ్బారావు:
అందులో సందేహం ఏముంది మరదలా! ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు వదిలేసి, వ్యాపారం చేస్తే, పరిస్థితులు ఇలాగే ఉంటాయి మరి! ఎంత వ్యాపారం అంటే - ఈ ఏడాది ఏప్రియల్ లో ఇంటర్ పరీక్షా ఫలితాలొచ్చాయి కదా! అప్పుడు తమ మార్కులని సందేహించిన విద్యార్దులు... రివేల్యుయేషన్ కి, రీ కౌంటింగ్ కీ దరఖాస్తు చేసుకుంటూ కట్టిన ఫీజులే కోటి రూపాయల పైన వచ్చాయని, మొన్ననే ప్రభుత్వం ప్రకటించుకుంది.
ఇంటర్ పిల్లల జవాబు పత్రాలని అవకతవకగా దిద్దిన పంతుళ్ళ మీద, ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోలేదు గానీ, ఫీజులు మాత్రం వసూలు చేసుకుంది. అడ్డదిడ్డంగా దిద్దారన్న వార్తలు రావటంతో, తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన పడటం సహజం కదా! దాన్నే క్యాష్ చేసుకుంది ప్రభుత్వం!అదీ ప్రభుత్వం తీరు!
సుబ్బలష్షిమి:
దారుణం బావా! ప్రభుత్వం చేస్తున్నది పరిపాలన కాదు, సరికదా... వ్యాపారం కూడా కాదు. ఏకంగా దోపిడే!
Subscribe to:
Post Comments (Atom)
prjalu metthagaa vunte prabhutvaaniki mottha buddi avutundi
ReplyDeletegajula Garu : :)
ReplyDeletemadam,meeru mottharaa naa thala boppikattindi
ReplyDeleteనేనెప్పుడు మొట్టానబ్బా!
ReplyDelete