[మేమంతా సోనియా సైన్యం. 9 మంది తెలంగాణా ఎంపీల విస్పష్ట ప్రకటన - వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! పార్టీ అధినేత్రిని ధిక్కరించే వారిని పార్టీ వ్యక్తులుగా గుర్తించమనీ, తామంతా సోనియా సైన్యమనీ, మధు యాష్కీ గౌడ్, వివేక్, మందా జగన్నాధ్, గట్రా 9 మంది ఎంపీలు ఉమ్మడి గొంతు వినిపించారట, తెలుసా?
సుబ్బారావు:
వివేక్ కాకా కుమారుడు మరదలా! ఆ వృద్ధ రాజకీయ నాయకుడి తాలూకూ కబ్జా వివాదాలు ఇటీవల రచ్చకెక్కాయి కూడా! అదీ అతడి వారసత్వం! ఇక మందా జగన్నాధం. ఓటుకు నోటు నాడు తెదేపా నుండి కాంగ్రెస్ కి క్రాస్ ఓటింగ్ చేసి, ప్రతిఫలంగా కేంద్ర క్యాబినేట్ స్థాయి పదవి పొందాడు. మధు యాష్కీగౌడ్ మీద, దొంగ పాస్ పోర్టు వీసా పత్రాలు సమర్సించిన కేసులున్నాయి. కాబట్టి... అలాంటి వాళ్ళంతా సోనియా సైన్యమే అవుతారు.
సుబ్బలష్షిమి:
అదేమిటి బావా?
సుబ్బారావు:
అదంతే మరదలా! అధినేత్రి, తనకు సంతృప్తి కలిగేటట్లు జై కొట్టిన వాళ్ళకి పదవులు కట్టబెడుతుంది, అక్రమార్జనలు చేసుకోనిస్తుంది. తనని కాదంటే... గత చరిత్రలోని కంతలు బయటికి తీస్తుంది.
సుబ్బలష్షిమి:
ఓహో! అయితే కంతలున్న వాడు, వాటిని పూడ్చుకునేందుకు సోనియా సైన్యంలో చేరతాడన్న మాట!
~~~~~~~
Subscribe to:
Post Comments (Atom)
nuvvukuudaa naalaagane amayakuraaluvu subbalaxmi,raajakeeyanayakulalo kanthalu leni devariki?evari avusaram koddi vaaru ato-ito vuntaaru anthe.
ReplyDeleteExactly. Well said.
ReplyDeletegajula గారు: నిజమే సుమా!
ReplyDeleteఅజ్ఞాత గారు: నెనర్లు!
ఆ సుబ్బలక్షిమికి, సుబ్బారావు గారు (206+158) సార్లు రాజకీయాల గురించి విడమరచి చెప్పినా, మళ్ళీ అమాయకంగా లోకజ్ఞానం తెలియని దానిలా అడుగుతుంది :-)
ReplyDeleteWell said.
ReplyDeleteపానీపూరి గారు : ఇన్ని తెలిసినా మనం మోసపోవటం లేదటండి! సుబ్బలష్షిమి, సుబ్బారావులయినా అందుకు అతీతం కాదు కదా? :)
ReplyDeleteచెప్పుదెబ్బలు - పూలదండలు గారు: నెనర్లండి.