Tuesday, August 31, 2010

అవసరాలు మారిపోయినప్పుడు అభిమానాలు, అభినందనలూ మారిపోతాయి మరి!

[జస్వంత్ సింగ్, మురళీ మనోహర్ జోషిలపై అద్వానీ ప్రశంసల జల్లు వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! పార్లమెంటు ఈ వర్షాకాల సమావేశాల్లో, తమ పార్టీ సభ్యులైన జస్వంత్ సింగు, మురళీ మనోహర్ జోషీల పనితీరు `భేషంటూ' అద్వానీ అభినందించాడట. వాళ్ళపై ప్రశంసల జల్లు కురిపిస్తూ తన బ్లాగులో వ్రాసాడట. తన మీద జస్వంత్ లాంటి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడినా... ఎంతో హుందా గా అద్వానీ వాళ్ళని అభినందించాడు. తెలుసా?

సుబ్బారావు:
మరేమనుకున్నావు మరదలా! భాజపా మాజీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషీ, చాలా ఏళ్ళ క్రితమే ‘తాను భాజపా అధ్యక్షుడు కాకుండా సీఐఏ అడ్డుపడుతుందని’ ప్రకటించి, కొన్నాళ్ళు మరుగై పోయాడు. ఎన్డీయేలో రక్షణ మంత్రిగా పనిచేసిన జస్వంత్ సింగ్ ‘కాందహార్ విమాన హైజాక్ డ్రామా’ గురించి కొన్ని వాస్తవాలు వెల్లడించాడు. ఏదైతే నేం? ఇద్దరికీ లోతట్టు గుట్లు తెలుసు. మరి పొగడక, హుందాతనం తెచ్చుకోక, ఏం చేస్తాడు అద్వానీ అయినా?

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! అవసరాలు మారినప్పుడు... అభిమానాలు, అభినందనలూ కూడా మారి పోతాయి!

2 comments: