[ఇక గాలి తీస్తాం - సోమవారం కర్ణాటక లోని చారిత్రక బళ్ళారి కోట వద్ద జరిగిన బహిరంగ సభలో కేంద్రమంత్రుల ప్రకటన - వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! నిన్న బళ్ళారిలో, గాలి సోదరులు గనుల అక్రమాలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ జరిగింది. అందులో
>>>అక్రమ గనులపై రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా చర్య తీసుకోకపోతే కేంద్రం జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని సభకు హాజరైన ముగ్గురు కేంద్ర మంత్రులు హెచ్చరించారు. ఈ అక్రమాలను ఎంతో కాలం సహించేదిలేదన్నారు. కేంద్రం ఇక ఎంతో కాలం ఉపేక్షించజాలదని, కఠిన చర్యల్ని తీసుకోక తప్పదని కేంద్ర మంత్రులు గులాంనబీ అజాద్, ఎస్.ఎం.కృష్ణ, వీరప్ప మొయిలీలు తమ ప్రసంగాల్లో.... రాష్ట్ర మంత్రి గాలి జనార్దన రెడ్డి, ముఖ్యమంత్రి యడ్యూరప్పలకు హెచ్చరికలు జారీ చేశారు.
మరైతే బావా! రాష్ట్రాల మధ్య జల వివాదం ఏర్పడినప్పుడూ... కేంద్రం అది రాష్ట్రాలే పరిష్కరించుకోవాలంటుంది. రాష్ట్రాల్లో నక్జల్స్ సమస్య అంటే... అదీ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతే అంటుంది. చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రీ, రాష్ట్రంలోని ఇతర ‘పెద్ద మనుష్యుల’ మీద ఫిర్యాదులు చేసినా, వాటిని తిరిగి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికే పంపేస్తుంది. చివరికి ధరల తగ్గుదల అన్నది కూడా... తమ చేతుల్లో ఏమీ లేదని, రాష్ట్రాలదే బాధ్యత అని చేతులు దులిపేసింది.
కేవలం పన్నులు వసూలు చేసుకోవటం తప్ప, రాష్ట్రాల పట్ల తనకే బాధ్యతా లేనట్లు చేతుల దులిపేస్తూ, చాలా సార్లే తేల్చి చెప్పింది.
మరిప్పుడేమిటి ?
కేంద్రం చూస్తూ ఊరుకోదనీ...
జోక్యం చేసుకుంటుందనీ...
కేంద్రం దగ్గర చాలా బ్రహ్మాస్త్రాలున్నాయనీ...
ఒక్కొక్కటే ప్రయోగిస్తుందనీ...
వారంలోగా గనుల అక్రమాలపై పలుచర్యలు తీసుకుంటుందనీ...
హైరానా పడిపోతున్నారు ఈ ముగ్గురు కేంద్రమంత్రులు?
సుబ్బారావు:
తమకి అవసరమైనప్పుడు... అన్నీ రాష్ట్రప్రభుత్వాల బాధ్యతే అంటారు మరదలా! అదే తమ అవసరం మారితే.... అన్నిటి మీదా కేంద్రానిదే ఆధిపత్యం అంటారు. కాంగ్రెస్ అధిష్టానం దగ్గరున్న అవకాశ వాదాన్నే ఈ మంత్రులు కూడా వల్లించేది!
సుబ్బలష్షిమి:
అంతేలే బావా! తమకి బాగానే ఉందనుకున్నన్ని రోజులూ వై.యస్., అతడి మిత్రుడైన గాలి సోదరుల గనులలో అన్నీ సక్రమాలే నడుస్తున్నాయన్నట్లు గమ్మునున్నారు. ఇప్పుడు వై.యస్. జగన్ తో చెడే సరికి, వాళ్ళ గనులలో అన్నీ అక్రమాలే అంటూ ఖయ్యి మంటున్నారు.
సుబ్బారావు:
అంతే కాదు మరదలా! కర్ణాటక సీఎల్పీ నేత సిద్దరామయ్య "గాలి జనార్దన అసలు కన్నడిగుడు కాదు. ఎక్కడి నుండో బళ్ళారికి వచ్చాడు" అంటున్నాడు. మరి వాళ్ళ అధిష్టాన దేవత సోనియా... ఎక్కడో ఇటలీ నుండి వచ్చి, ఈ దేశ ప్రజల నెత్తి నెక్కి తొక్కటం లేదూ?
సుబ్బలష్షిమి:
అదే మరి కాంగ్రెస్ మార్కు రాజకీయాలంటే!
Subscribe to:
Post Comments (Atom)
raajakeeyaalalo shaswathamitrulu,shaswathashatruvulu vundarani ,antha swardamani marosaari rujuvaindi
ReplyDelete