[‘మన తెలుగు తల్లి’ రచయితపై తెలంగాణా వాదుల దాడి - సాక్షి, వార్త నేపధ్యంలో
>>>నల్లగొండ జిల్లా హాలియాకు చెందిన ప్రవాస భారతీయుడు నలమోతు చక్రవర్తి రచించిన మన తెలుగు తల్ల్లి (మై తెలుగు రూట్స్) పుస్తకావిష్కరణ సోమవారం సోమాజి గూడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఆవిష్కరణ అనంతరం ముఖ్య అతిధి, సీనియర్ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్ ప్రసంగిస్తుండగా తెలంగాణా యూత్ ఫోర్స్, తెలంగాణా వీరుల ఐక్యవేదిక కన్వీనర్లు ఎం.రఘుమారెడ్డి, నర్సింహారెడ్డి, లక్ష్మణ్, జయలక్ష్మి, మరో 15 మంది ఒక్కసారిగా వేదికపైకి దూసుకొచ్చారు. రచయితపై తిట్ల పురాణం లంకించుకున్నారు. ‘ఏంట్రా నువ్వు రాసింది? తెలంగాణాకు ద్రోహం చేస్తావురా? నువ్వు నిజంగా తెలంగాణా వాడివేనా? ఇలాంటి రాతలు రాయడానికి సిగ్గు లేదురా? ఎంత దమ్ముంటే ఇక్కడికొచ్చి పుస్తకాన్ని ఆవిష్కరిస్తావ్? చెత్త నా కొడకా! నీ అంతు చూస్తాం, మర్యాదగా బయటకు రారా’ అని తిడుతూ చక్రవర్తిపై మూకుమ్మడిగా దాడి చేశారు. నిశ్చేష్టుడైన ఆయన్ను నెట్టేస్తూ పిడిగుద్దులు కురిపించారు.]
సుబ్బలష్షిమి:
బావా! తెలంగాణా వేర్పాటు వాదులు, నల్గొండ జిల్లాకు చెందిన ప్రవాస భారతీయుడి పైన ‘మన తెలుగు తల్లి’ అనే పుస్తకాన్ని వ్రాసినందుకు దాడి చేసి, బండబూతులు తిట్టారట. పిడిగుద్దులు గుద్దారట. ఇదే పని కాశ్మీరులో చేస్తే, దాన్ని తీవ్రవాదం అంటున్నాం. మరి తెలంగాణా వేర్పాటు వాదులు చేస్తే దాన్ని ‘ఉద్యమం’ అంటున్నారేమిటి బావా?
సుబ్బారావు:
కాశ్మీరు వేర్పాటు వాదానికి, ప్రక్కనున్న పాకిస్తాన్ సహకారం ఉన్నందున, తాలిబాన్లు తుపాకులు పుచ్చుకున్నారు. అది టెర్రరిజం అయ్యింది. కానీ, తెలంగాణా వాదులు పిడి గుద్దులు గుద్దినా, బండబూతులు తిట్టినా, హింసామార్గం పట్టినా, దాన్ని ఉద్యమం అనే అంటారు మీడియా వాళ్ళు!
సుబ్బలష్షిమి:
మరో విషయం బావా! జలయజ్ఞం అంటూనో, సెజ్ లంటూనో, మరో కారణంతోనో ఈ మంత్రులు, రాజకీయ నాయకులు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు కదా? వాళ్ళని ఎందుకు నిలదీయరు బావా వీళ్ళు? తమ భావాన్ని బయటకు చెప్పే సామాన్య వ్యక్తుల మీదే వీళ్ళ ప్రతాపాలు చూపిస్తుంటారు?
సుబ్బారావు:
అంతే మరదలా! అక్కడే తెలియటం లేదా, రాజకీయ నాయకులే ఇలాంటి వాళ్ళ వెనుక ఉన్నారన్న విషయం!?
సుబ్బలష్షిమి:
మొత్తానికి కాశ్మీరులో చేస్తే అది తీవ్రవాదం, తెలంగాణాలో అయితే అదే ఉద్యమం అయ్యిందన్న మాట!
~~~~~
Subscribe to:
Post Comments (Atom)
I am surprised.....don't you know the difference between those two issues......
ReplyDeletewas horrified after reading in eenadu...gud 2 see a post on this
ReplyDeletechetta lachimi
ReplyDeleteఇలాంటి వాళ్ళు తమ తమ వాదనలు సరైనవో కావో .. వాటిని వ్యతిరేకిస్తున్న వారితో చర్చించి.. అప్పుడు ఒక పుస్తకం వెస్తే అది పద్దతి .. అంతే కాని... పులులు గుహలో చేరి మంచి చెబుతా అంటే ఇలాంటివే జరుగుతాయి... కొందరు రాస్తూ ఉంటారు... అందరికీ ఎవో నిజాలు చెప్తున్నం అనుకుంటారు... వాటి ఫలితాలు... అసలు అవి సరైనవా లెవా అని పట్టించుకోరు... సాక్ష్యం ఆధారలతో పద్దతి ప్రకారం చేయకుండా వెళ్తే ఇలాగే జరుగుతుంది...
ReplyDeleteఇలానే సాగనిచ్చి మితిమీరాక కాశ్మీర్లో లాగానే కుళ్ళబొడిస్తే గాని వీళ్ళ వేర్పాటు దురద తీరదు. వీళ్ళు బలిసిన మద్యమకారులు, ఉద్యమకారులు కాదు.
ReplyDeleteతెలంగాణా ఉద్యమాన్ని "భస్మాసుర హస్తమంటూ" అవాకులూ చవాకులూ రాసి .... తెలంగాణా ప్రజలను అవహేళన చేసిన ఆ పుస్తకం ఎంత కుట్ర పూరితమో.... ఆ పుస్తకం రాసిన వాడు నల్గొండ జిల్లా వాడు..... స్వయంగా తెలంగాణా వాడు అనడం కూడా అంత కుట్ర పూరితమే.!
ReplyDeleteఆ పుస్తకం రాసింది తెలంగాణా వాడు కాదు
పక్కా ఆంధ్రా వాడు.
అతను గుంటూరు జిల్లాకు చెందినవాడు.
నల్గొండ జిల్లాలో కొన్నాళ్ళుండి అమెరికాలో సెటిల్ అయిన వాడు. !!
అట్లాగే ఆ పుస్తావిష్కరణ సభలో పాల్గొన్న వారూ, దానిని ప్రమోట్ చేస్తున్న వాళ్ళు అంటా ఆంధ్రా వాళ్ళే. ఆ పనేదో ఆంధ్రా లో చేస్తే గొడవ వుండేది కాదు. తెలంగాణా లో తెలంగాణా ప్రజల గుండెల్ని గాయపరిచే సాహసం వల్లనే ఈ గొడవంతా వచ్చింది.
ఈ కుట్ర ను ముందు గ్రహించు సుబ్బలక్ష్మీ.
ఒక రాష్ట్ర ఏర్పాటూ, ఒక దేశ ఏర్పాటూ ఒకటి కాదని తెలుసుకో.
అందులోనూ ఆంద్ర రాష్ట్రం మొదట్లో వేరేగా వుందని,
పెద్దమనుషుల కుట్రతో తెలంగాణా ప్రాంతాన్ని అది గుటకాయ స్వాహా చేసిందనీ,
తెలంగాణాకు తీరని అన్యాయం చేసిందని గ్రహించడం వల్లనే
తెలంగాణా ప్రజలు ఆంద్ర విష కౌగిలి నుంచి విడిపోవాలని .... తమ రాష్ట్రం తమకు కావాలని కోరుకుంటున్నారు ...ఈ చరిత్రని మరచి పోకు.
తెలంగాణా ప్రజలది న్యాయమైన ప్రజాస్వామిక ఆకాంక్ష.
దీని మీద ఎందుకు ఇంకా ఇంకా బురదజల్లి మీ సంకుచిత మనస్తత్వాన్ని చాటుకుంటారు?
telivi unte kashmir ki telanganaki compare cheyyavu..
ReplyDelete>>ఆ పుస్తకం రాసింది తెలంగాణా వాడు కాదు
ReplyDeleteపక్కా ఆంధ్రా వాడు.
అతను గుంటూరు జిల్లాకు చెందినవాడు.
నల్గొండ జిల్లాలో కొన్నాళ్ళుండి అమెరికాలో సెటిల్ అయిన వాడు.
OhO! veLLi O.U. lO vunna pinaakOlaki cheppu, vinTaaru.
Amma,
ReplyDeleteplease note that crores of people genuinely aspiring for TELANGANA and the KANIKA group you write are not to be equated.
Your writings are far above "regional" issues which is why you have won the hearts of many telangana people!!
At this point of time, all I can say is - being a non-telanganite it might be difficult for you to see from "their" point-of-view, therefore may I request you to kindly refer some of the un-biased writings on grass-root level issues of telangana which are result of 1956 merger!!
This is a small write-up by a person named Srinivas and forwarded by mail:
ReplyDelete------------------------------
అయ్యా... నలమోతు నరకాసురా...
నా తెలుగు మూలాలని నవల రాసుకోని
నలుగుట్ల నీ పండ్లిగిలిస్తివి...
అసలా మూలల జాడేదో తెలిసేనా...
నల్గొండ జిల్లా అంటావ్... నాది తెలంగాణే అంటావ్...
మరి నల్లతుమ్మ గోందు వాసన జూస్తివా...
ఉమ్మెంత పువ్వంటే గుర్తుపడ్తవా...
చెలక భూముల్ల నడువగల్గుతవా...
మోటబొక్కెన ఎపుడన్నా కండ్లతో నన్న జూస్తివా...
బతుకమ్మ లోపల ఏముంటది ఎరుకేనా...
గునుగు పువ్వు అసలెట్లుంటదెరుకేనా...
చేతబావిల ఊటలకు చిల్లు బొక్కెన జూస్తివా...
తోలు డప్పు దరువు నీ చెవులతోటి వింటివా...
సీసకమ్మరి పొదలంటే నీకు తెలుసా...
ఊదు వాసన నీ ముక్కుకంటిన్దా...
అసైదుల్ల ఆటల్ల ఎపుడన్నా చేయ్యేస్తివా...
ఊరడమ్మ గుడిల ఎపుడన్నా కాలుపెడ్తివా...
ఏది చక్రవర్తీ... నీ రాజ్యమేది...
నీ భూమేది... నీ బతుకేది...
అన్నమో రామచంద్ర అంటె... గంజి గతికే అవ్వ గూడ
అయ్యో కొడకా... అంటది నా తెలంగాణల...
అటువంటి నా భూమిని నగువట్లు జేస్తే...
బోర్లబొక్కల పడి చిల్లర పైసలేరుకున్టావ్...
అప్పుడు రాడు ఇప్పుడు నీకు పచ్చనోట్లిచ్చినోడు
భాస్మసూర కోరిక కాదు ఇది...
భగ్గున మండుతున్న గుండెల కేక... ఇప్పుడే పుట్టిన తెలంగాణ బిడ్డ కేరింత...
ఎన్నారై అని చెప్పుకోకు... నాకు సిగ్గయితది మల్ల నా ఊళ్ళ కాలువెట్టనీకే...
నోటికి మాటొస్తే... జై తెలంగాణ చెప్పుకో... రాకపోతే ఇంత మన్నువోసుకో...
-- శ్రీనివాస్ రెడ్డి కొంపల్లి
తెలంగాణా గురించి ఎవడు ఏమి రాసినా, అది చదవాలో వద్దో చెప్పవచ్చు గానీ, తెలంగాణా ఉద్యమానికి మద్దతు ఇవ్వకపోతే తంతారా? అదేనా ఉద్యమ స్ఫూర్తి? ఈ దేశంలో దౌర్జన్యంగా చెప్పినవాడే గొప్పవాడు. చివరికి ఎవరి అభిప్రాయాలూ స్వేచ్చగా చెప్పకూడదని నిషేధిస్తారు కాబోలు? తెలంగాణా వారి మనసులు గాయపడ్డారని - అందరినీ గాయపరుస్తారా? ఇదేనా పద్ధతి ? అస్సలు ఇలాటి చేష్టల వల్ల నిజంగా కాస్తో కూస్తో ఉద్యమం పట్ల సానుభూతి ఉంటే - అదీ పోతుందని గ్రహించలేరా? ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం అంటే మనుషుల్ని కొట్టడమా? తెలుగు జాతి కీ తెలంగాణా జాతికీ సంబంధం లేదా? కాకతీయుల కాలంలో అస్సలు "తెలంగాణా" అనే పదాన్ని వాడిన దాఖలాలేమైనా ఉన్నాయా? రవిగారూ, మీరు ఒక్కసారి ఈ క్రింది వ్యాసాన్ని తప్పక చదివి తీరాల్సిందే -
ReplyDeletehttp://www.tadepally.com/2010/08/1.html
చందమామ గారు: నేను ఉద్యమం పేరుతో వ్యక్తి స్వేచ్ఛను హరించటాన్ని అంగీకరించనండి. ఆ పుస్తక రచయిత నల్గొండ వాడు కానివ్వండి, గుంటూరు వాడు కానివ్వండి, తెలంగాణా వాది కానివ్వండి, సమైక్యవాది కానివ్వండి అతడి అభిప్రాయం అతడు చెప్పాడు. అందులోని అవాస్తవాలున్నా, నచ్చని అంశాలున్నా ఆ అభిప్రాయాలని ఖండిస్తూ తమ వాదనని చెప్పవచ్చు. అంతేగానీ అభిప్రాయం వెలిబుచ్చిన వ్యక్తినే ఖండిస్తామనటం ఖచ్చితంగా హింసావాదమే! అప్పుడు దాన్ని ఉద్యమం అని గాక, టెర్రరిజం అనే అనాలి!
ReplyDeleteఇప్పుడు బ్లాగు లోకంలో తెలంగాణా మీదా ఏమైనా వ్రాయనివ్వండి, కొందరు అజ్ఞాతలు రయ్యిన వచ్చి, వ్యక్తిగత దూషణలు చేస్తారు చూడండి, అది బ్లాగులోకంలో విధ్వంసం అనాలేమో కదా!
విరజాజి గారు: కృతజ్ఞతలు. నా భావాన్ని సరిగ్గా క్యాచ్ చేసారు.
meeru annadi correcte kani..kondaru chesina paniki mottam andarini ade gaatana kattadam paddatenaa cheppandi..
ReplyDeleteLakshmi, you are right the incident is not pleasant. But the intentions & language used by the "author" are terrible. Just check his provocations against anybody who supports Telangana.
ReplyDeleteOne of Chakravathy's supporters wrote his blog that "We need people to be aware of this book. It doesnt matter positive or negative". I will not be suprrised if Chankravarthy & his gang engineered the incident to get publicity.
విరజాజి, Tadepalli's "blog" is hateful, uses vulgar language and best avoided by all balanced people. His "gem" about drunkenness by region is a typical example of "ahankaaram"
ReplyDeleteవిరజాజి గారూ,
ReplyDeleteసమయం, సందర్భం, స్థలం తో నిమిత్తం లేకుండా ఆ పుస్తకావిష్కరణ కు పూనుకోవడం సబబే నంటారా ?
ఇదివరకే ఇంగ్లీష్ లో వెలువడి తెలంగాణా ఉద్యమాన్ని బాహాటంగా భస్మాసుర హస్తం అంటూ అపహాస్యం చేసిన పుస్తకాన్ని తెలుగులోకి తెచ్చి తెలంగాణా గడ్డ మీదే ఆవిష్కరించడం ఉద్యమకారుల్ని రెచ్చగొట్టడం కిందకు రాదంటారా ?
దానిని అడ్డుకోవడానికి ప్రయత్నించడమే మీకు అప్రజాస్వామికం అనిపిస్తోందా?
మీ ఆవేశంలో కూడా పక్షపాతం కనిపించడం లేదూ?
రచయితను ఎవరూ తన్నలేదండీ ... పోలీసులే ఉద్యమ కారులను బూటు కాళ్ళతో తన్నారు. లాటీల తో కొట్టారు.
కాకతీయుల కాలం , అశోకుడి కాలం... అప్పటి సరిహద్దులూ ఎవరిని వంచించడానికి?
మద్రాస్ నుంచి ఆంద్ర రాష్ట్రం విడిపోవదానికీ... తెలంగాణా ఉద్యమాన్ని అనిచేయ్యడానికీ తప్ప ... తెలుగు భాష అమలుకు కానీ... తెలుగు జనానికి గానీ ఏమాత్రం ఉపయోగపడని "తెలుగు తల్లి" "తెలుగు జాతి" గొడవ ఇంకా ఎందుకు లెండి.
తెలంగాణా భావోద్వేగాలు అనేక అమాయక ప్రాణాలను బలిగొంటున్న ఈ దశలోనైనా ఇలాంటి పుస్తాకాలను ఎ ఆంధ్ర లోనో అవిష్క రించుకుంటే అందరికీ పుణ్యముంటుంది.
ఇంతకంటే చెప్పేదేముంది సుహృద్భావం కొరవడినప్పుడు !
మీరు మరీను. మీరెదో బ్లాగుల్లో రాసుకుని కాలక్షేపం చేస్తున్నారు కాబట్టి సరిపొయింది లేకపోతే మీమీదా దాడి చేసేవాళ్ళే ఈ తెలబాన్లు
ReplyDeleteకుట్ర లు జరిగాయి... అనేది తెలంగాణా వాదుల మొదటి ఆరోపణ... అందువల్ల ఎటువంటి చాపకింది ప్రచారాన్ని వాళ్ళు సహించరు.. అంత ధీటైన వాదన ఉంటే ముఖా ముఖి చర్చలకు పొవచ్చు...
ReplyDeleteసారు ఆంధ్రా లో మొదలు పెట్టి పుస్తకాలను తెలంగాణ లొ ఫ్రీ గా పంచి పెట్టాల్సింది... అదో పద్దతి...
రవి గారూ, హైదరాబాదు ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచీ విడిపోలేదండీ! అది మన రాష్ట్ర రాజధాని. తెలంగాణా గడ్డ అని మీరు రాస్తున్నారు... తెలుగు గడ్డ అని కొందరంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటులోనే తెలుగు వారికి చాలా అన్యాయం జరిగింది. తెలుగు వారి ప్రాబల్యం అధికంగా ఉన్న 10 జిల్లాలు పొరుగు రాష్ట్రాలకి తరలిపోయినప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు ... సరే పూర్తి తెలుగు జాతి గురించి వదిలేద్దాం, తెలంగాణా గురించే చెప్పినా, మహారాష్ట్ర కి వెళ్ళిన జిల్లాలని వెన్నక్కి అడగగలరా ఇదే తరహాలో? అదేమంటే తోటి తెలుగు వాడిని దూషించడం తెలుసు. మరి పక్క రాష్ట్రాలలో ఉన్న తెలుగు వారిని గురించి మీకు పట్టదా? వారికీ మీకూ సంబంధం లేదా? తెలుగు మూలాలు ఈ తెలంగాణా, ఆంధ్రా పదజాలం రాక ముందు నుంచీ ఉన్నాయి.... ఇష్టం లేని వారు చదవద్దు - కానీ ఇలా దూషించడం చాలా తప్పు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. తెలంగాణా ప్రాంతంలో నివసిస్తే "జై తెలంగాణా" అనాల్సిందేనా? సుహృధ్బావం కొరవడింది ఎవరికో తెలుస్తూనే ఉంది... అలా అయితే, వేరే దేశాలలో ఉన్న భారతీయులు మా మూలాలు భారత దేశంలో ఉన్నాయని చెప్పకూడదన్నమాట. మనలో మనకి తగవులు పెట్టిన వాడు మనల్ని చూసి నవ్వినా పర్లేదు - మీరు వేరే అందరినీ గౌరవిస్తారు - సాటి తెలుగు వాడిని తప్ప! ఉద్యమం చేస్తున్న వారికి చేయిస్తున్న వారికి ఉన్న కోరికలేమిటో తెలుసుకునే తెలివితేటలు లేనప్పుడు ఇలాగే రెచ్చగొడుతూనే ఉంటారు. మీరు దీన్ని కూడా తప్పుగా అర్ధం చేసుకుంటే - ఇక చెప్పేదేమీలేదు. ఉద్యమం చేస్తున్న విధానం పట్ల అందరికీ బాధగా ఉంది - అంతే కానీ మరోటి కాదు. నిన్నటిదాకా ఒకరకంగా ఉండి, ఈరోజు ఉన్నట్టుండి సీమాంధ్రులంతా మా శత్రువులని వాదిస్తుంటే వినడానికి చాలా బాధగా ఉంటుంది. తిట్టేవాడికి ఎప్పుడూ పడేవాడు లోకువ ..... అది ప్రత్యక్షంగా తెలుస్తూ ఉంది వేర్పాటు వాదుల చేష్టల్లో.
ReplyDeleteనిజమే చెప్పారు - సుహృధ్భావం కొరవడినప్పుడు ఇంతకన్న చెప్పేదేముంది?
mitrulu chaalamandi chaala rakaalugaa spandistunnaru.saati teluguvaadini dochukuntunte ekkadakupoindi aa bhavana.telangana prajalaku jarigina anyayamupai charchiste bhaguntundi.100 kaaranaalaku paiga jarigina anyayamupai okkokkadani meeda charchacheste chala vastavaalu telustai.
ReplyDelete