Thursday, August 5, 2010

ముంబై సాక్షుల్ని పాక్ కి పంపిస్తే విచారిస్తారట!

[ముంబై పేలుళ్లపై సాక్షులను పంపండి: పాక్
వాషింగ్టన్, ఆగస్టు 2: ముంబై పేలుళ్ల ఘటనపై దోషులను శిక్షించేందుకు వీలుగా సాక్షులను తమ వద్దకు పంపాలని భారత్‌ను పాకిస్థాన్ కోరింది. ఈ విషయాన్ని అమెరికాలో ఉన్న పాక్ రాయబారి హుసేన్ హక్కాని వెల్లడించారు. పేలుళ్లకు కారణమైన లష్కరేతాయిబా సంస్థపై పాక్ చర్యలు తీసుకోవడం లేదంటూ వస్తున్న విమర్శలపై స్పందించాలని అమెరికా మీడియా హుసేన్‌ను ప్రశ్నించింది.

దీనికి ఆయన బదులిస్తూ.. ఉగ్రవాద సంస్థలకు తాము మద్దతునివ్వడమంతా గతమేనని, ప్రస్తుతం తమ వైఖరిని మార్చుకున్నామన్నారు. ముంబై పేలుళ్లకు బాధ్యులైన వారంతా జైల్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంపై పూర్తి సాక్ష్యాలు కలిగిన కొందరు అధికారులను పాకిస్థాన్‌కు పంపితే తాము వారిని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. - ఆంధ్రజ్యోతి వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! 2008 నవంబరులో జరిగిన ముంబై ముట్టడి సంఘటనలో, సాక్షులను పాకిస్తాన్ కి పంపిస్తే విచారణ చేస్తామంటూ, అమెరికాలో ఉన్న పాక్ రాయబారి హుసేన్ హుక్కా చెబుతున్నాడు, చూశావా? ముంబై ముట్టడి దోషుల్ని భారత్ అప్పగించమంటే ఠాఠ్ అంటున్నారు. తాము నేరస్తుల్ని పంపించరట, మనం సాక్షుల్ని పంపాలట! ఇంతకీ సాక్షుల్ని పంపితే ఏం సాధిస్తారట?

సుబ్బారావు:
ఏముంది మరదలా! మొన్న మహారాష్ట్రలో తెదేపా వాళ్ళని తుక్కురేగ్గొట్టినట్లు, ముంబై సాక్షుల్ని పాకిస్తాన్ కి పిలిపించి "ఎంత ధైర్యం మీకు? సాక్ష్యం చెబుతామంటారా? ఇహ కాస్కోండి" అని సాధించటానికేమో!

1 comment:

  1. విచారించి వదిలేస్తారా??
    లేక విచారించి, విచారించి సాగదీసి మర్చిపొతారా??
    ఏది చెస్తారో చెప్పలేదు పాపం..

    ReplyDelete