[స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ఎర్రకోట నుండి ఉర్దూలో ప్రసంగించిన ప్రధానమంత్రి వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! మొన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, ఎర్రకోట నుండి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దాదాపు 35 నిముషాలు ఉపన్యసించాడట. లెహ్ కొండ చరియలు విరిగిపడి చనిపోయిన వారికి సంతాపం చెబితే, పిల్లలు దానికీ చప్పట్లు కొట్టేసారట. పాపం, టీచర్లు ఇబ్బంది పడ్డారట, తెలుసా?
సుబ్బారావు:
మరి ప్రధానమంత్రి ఉర్దూలో మాట్లాడాడు మరదలా! పిల్లలకి అర్దం కాలేదెమో, సంతాపానికి కూడా హర్ష ధ్వానాలు చేసేసారు!
సుబ్బలష్షిమి:
అయినా... స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా, ఓటు బ్యాంకు రాజకీయాలేనా బావా? హిందీ జాతీయస్థాయిలో ఎక్కువమందికి అర్దమయ్యే భాష! ఇంగ్లీషు అంతర్జాతీయ భాష! ఏది మాట్లాడినా, అక్కడికి చేరిన వారిలో ఎక్కువ మందికి అర్ధమయ్యేది. మరెందుకు ఉర్దూలో మాట్లాడినట్లు బావా?
సుబ్బారావు:
బహుశః తన పాకిస్తాన్ మూలాలు మరిచిపోయి ఉండడు మరదలా!
Wednesday, August 18, 2010
Subscribe to:
Post Comments (Atom)
ekkuvamandiki artham ayithe vaallu prashninchadam modalupedataaru,prajalaku artham kaakunda paalinchadame neti raajakeeyam
ReplyDeleteWell said. Sonia ruling India by (this) proxy.
ReplyDeletegajula గారు: అది నిజం! అర్దం కాకుండా ప్రజలని ఉంచాలన్నదే వాళ్ళ ప్రయత్నం! నెనర్లు!
ReplyDeleteఅజ్ఞాత గారు: నెనర్లండి!
హిందీ జాతీయ భాష కాదు, 22 అధికారిక భాషలలో ముఖ్యమయినది. మనదేశ రాజ్యాంగంలో జాతీయభాష అనేది ఏదీ లేదు.
ReplyDeleteనచికేత్ గారు: పొరపాటు దిద్దినందుకు నెనర్లు!
ReplyDelete