Monday, August 30, 2010

దేశం నిండా ఎన్ని ఉష్ట పక్షులో!

[పరీక్షలో చూచి రాతకు పాల్పడుతూ పట్టుబడిన అయిదుగురు న్యాయమూర్తుల సస్పెన్షన్ - ఈనాడు, 26 ఆగస్టు, 2010.
ఆంధ్రజ్యోతి కెమెరాకు, పరీక్షలు చూచి రాస్తూ పట్టుబడిన న్యాయమూర్తులు - ఆంధ్రజ్యోతి,
సామాన్యుడి దుస్థితిని చూస్తూ న్యాయస్థానాలు కళ్ళు మూసుకోవు - సుప్రీం కోర్టు - 26, ఆగస్టు, 2010 ఈనాడు వార్త నేపధ్యంలో. ]

సుబ్బలష్షిమి:
బావా! కాకతీయ విశ్వవిద్యాలయంలో ‘మాస్టర్ ఆఫ్ లా’ దూరవిద్య పరీక్షల్లో, న్యాయమూర్తులు కాపీలు కొడుతూ, ఆంధ్రజ్యోతి కెమెరా కి చిక్కారట. వాళ్ళని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిసార్ ఆహ్మద్ కక్రూ సస్పెండ్ చేశాడు. మరో వైపు సుప్రీం కోర్టు, సామాన్యుడి దుస్థితి చూసి న్యాయస్థానాలు కళ్ళు మూసుకోవు - అంటోంది. మరి దినకరన్ విషయంలో ఎందుకు కళ్ళు తెరవలేదట?

అసలు న్యాయమూర్తులే... ఎవరి స్థాయిలో వాళ్ళు ఇంతగా పక్కదార్లు పట్టేవాళ్ళయినప్పుడు, కళ్ళు మూసుకోవటం గాక ఇంకేం ఉంటుంది బావా? చిన్నకోర్టుల్లోని ఇలాంటి న్యాయమూర్తులే కదా, డిపార్ట్ మెంట్ పరీక్షలు వ్రాసీ, పదోన్నతలు పొందీ, పై కోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులౌతుంటారు?

సుబ్బారావు:
ఉష్ణ పక్షి ఎడారిలో పరిగెడుతూ, ఇసుకలో తలదూర్చి... తనకెవ్వరూ కనబడక పోతుండగా, తానెవ్వరికీ కనబడటం లేదనుకుంటుందట. ఆ జాబితాలో ఇప్పటికి... కొందరు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, మీడియా ప్రతినిధులూ ఉన్నారు. ఇప్పుడు న్యాయమూర్తులూ అందులోనే ఉన్నారని నిరూపించుకున్నారు. అంతే మరదలా!

సుబ్బలష్షిమి:
అయితే దేశంలో చాలానే ఉష్ణ పక్షులున్నట్లున్నాయి బావా!
~~~~~~~~~~~

1 comment: