Tuesday, August 17, 2010

సీడబ్యూసీ సమావేశాలు - నాడు పరుపులు, నేడు ఇరుకులు!

[సీడబ్యూసీ సమావేశం. అధ్యక్షురాలిగా సోనియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! బాపూజీ హయాం నాటి నుండి, పీవీజీ హయాం దాకా... ఎన్నో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు చూశాం కదా! విశాలమైన తెల్లటి పరుపుల మీద దిండ్లు వేసుకుని, ఎంచక్కా క్రింద కూర్చొని సమావేశం నిర్వహించేవాళ్ళు. ఇప్పుడేమిటి? అదేదో లాయర్ ఆఫీసు రూం లో ఉన్నట్లు, పుస్తకాల బీరువాల మధ్య, పొడవాటి టేబుల్ చుట్టూ కుర్చీలేసుకుని, ఇరుకిరుగ్గా కూర్చొని, గుసగుసలాడుకున్నట్లుగా, సీడబ్యూసీ సమావేశాలు నిర్వహిస్తున్నారు?

సుబ్బారావు:
బాపూజీ నుండి పీవీజీ దాకా... నాటి నాయకుల మనస్సులు విశాలమైనవీ, స్వచ్ఛమైనవీ మరదలా! అందుచేత అప్పటి సమావేశాలు అలా ఉండేవి. ఇప్పటి అధ్యక్షురాలు, ఆమె అనుంగు అనుచరుల మనస్సులు ఎలాంటివో, అలాగే ఉన్నాయి వాళ్ళ సమావేశ మందిరాలు కూడా!

సుబ్బలష్షిమి:
నిజమే సుమా!

6 comments:

  1. ఈ సుబ్బులష్టిమికి , సుబ్బారావుకు ఇలాంటి మూర్ఖ అవుడియాలు ఎలా వస్తాయో కదా. కాంగ్రెస్లో స్వచ్చత వెతికే వెర్రిబాగులోళ్ళు. పరుపులేసుకుంటే బాగా తిని తొంగోడానికి.

    ReplyDelete
  2. ఒకసారి మీ వ్యాఖ్యని మీరే పరిశీలించుకోగలరు. మొత్తానికి... మీ ఉద్దేశంలో బాపూజీ, పీవీజీ లాంటి వాళ్ళు కూడా తిని తొంగున్నారన్న మాట.

    ReplyDelete
  3. అంటే వాళ్ళిద్దరికోసమే అన్ని పరుపులేసుకున్నారనుకుంటున్నారా సుబ్బులష్టిమి? మీరెలా అనుకుంటే అదే సత్యం, అదే వేదం.

    ReplyDelete
  4. ఇక్కడ పరుపులు ముఖ్యం కాదు. ఈ మాత్రం అర్దం చెసుకొపొతె ఎలా "Anonymous". Get the actual meaning of the comments. No వితండవాదం. With twisted mind you can not reach far in life.

    ReplyDelete
  5. appudu samasyalu takkuva kaabatti dura-duranga parupula meeda haayiga kurchuni maatladukunevaaru,mari ippudu samasyalu-kutralu-satrutvulu ekkuva anduke vaati pariskaraalakai ,rahasyaalanu maatladukovadaaniki daggaradaggaraga(irukirukuga)kurchunnaru ,artham chesukoru...

    ReplyDelete
  6. >>>ఇక్కడ పరుపులు ముఖ్యం కాదు. ఈ మాత్రం అర్దం చెసుకొపొతె ఎలా "Anonymous". Get the actual meaning of the comments. No వితండవాదం. With twisted mind you can not reach far in life.

    పై వ్యాఖ్య వ్రాసిన అజ్ఞాత గారికి కృతజ్ఞతలండి! :)

    gajula గారు: బాగా చెప్పారు!:)

    ReplyDelete