Saturday, August 28, 2010

లోకువెవర్రా అంటే లొట్టాయ్ పెళ్ళాం అన్నాడట!

[వెన్నుపోటు బాబు - పీఆర్పీ ప్లీనరీలో తెదేపా అధినేత పై చిరంజీవి ధ్వజం - సాక్షి పత్రికలో వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! సాధారణంగా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీని, ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తుంటాయి కదా!? మరేమిటి, అటు తెరాస అధినేత కేసీఆర్, ఇటు ప్రరాపా అధినేత చిరంజీవీ... కాంగ్రెస్సునీ, కాంగ్రెస్సోళ్ళనీ కంటే.... చంద్రబాబు మీదే విమర్శల పిడుగులు కురిపిస్తుంటారు? ఇక కాంగ్రెస్ అధిష్టానం అయితే మహారాష్ట్ర నుండి ఏకంగా చంద్రబాబును, అతని బృందాన్ని ‘కుళ్ళపొడిచి వెళ్ళగొట్టించింది’.

సుబ్బారావు:
బహుశః అధికార కాంగ్రెస్ తో టీఆర్ ఎస్, ప్రరాపాలకి అంతర్గత లాలూచీ ఉండి ఉంటుంది మరదలా! ఇంతకూ, మన పల్లెటూళ్ళల్లో ఓ సామెత చెబుతారు చూడు, లోకువెవర్రా అంటే లొట్టాయ్ పెళ్ళాం అని? అలాగన్న మాట!

సుబ్బలష్షిమి:
అంటే చంద్రబాబు....?

7 comments:

  1. నేనలాంటి సామెత ఎప్పుడూ వినలేదు, కణికె సామెత. మీరే పుట్టించారా?

    ReplyDelete
  2. లొట్టాయ్ పెళ్ళాం?

    ReplyDelete
  3. ప్రతి పక్షం దొంగ పొరాటాలు చేస్తుంటె ఎందుకు ఊర్కుంటారు... అధికారం లొ ఉన్నవారు ఎందుకు ముందు కొస్తారు.. టీడీపీ వాళ్ళు కూడా రాజీనామాలు చేసి ఉంటె వత్తిడి పెరిగి కాంగ్రెస్స్ వాళ్ళు రాజీనామాలు .. చేయాల్సి వచ్చెది... తెలంగాణ వచ్చేది ... అందుకు కేసీఆర్ టీడీపీ ని తిట్టటం లొ తప్పేముంది ? ఇంక ఎలాగూ కాంగ్రెస్స్ వాళ్ళే తెలంగాణ ఇచ్చేది.. సొ వాళ్ళని డైరెక్ట్ గా తిట్టలేరు కదా !!! టీడీపీ తో కలిసి ఉంటే తిట్టగలరు ...

    ReplyDelete
  4. mari pratipaksha TDP koodaa PRP meeda enduku daadi chesindamma elections time lo and elections ayaaka?

    ReplyDelete
  5. అజ్ఞాతగారూ మీరు విననంత మాత్రాన సామెత లేనట్లేనా ?

    ReplyDelete
  6. madam,lottayi-ante thaagubothaa?maa praanthamlo kuuda voka saametha vundi-'chethagaanivaadi pellaamu vurandariki maradalu'-.chandrababu lottayi ayithe nijaalu cheppevaadu ,ila 2 kallasiddanthamu-iddarupillalasiddanthamu-rendunaalkalu -vundedivi kaavu.chandrababuku lottaayikante vere peru pettandi ,bhaaguntundi.

    ReplyDelete
  7. మీ అభిప్రాయాలు వెలిబుచ్చి, వ్యాఖ్యలు వ్రాసినందరికీ కృతజ్ఞతలు!
    చిలమకూరు విజయమోహన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు!:)

    ReplyDelete