Tuesday, August 17, 2010

చెవిటి వాడి ముందు శంఖమూదినట్లు!

[మీ కష్టాలు ప్రధానికి వివరించండి - రాహుల్ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! లెహ్ వరద బాధితులతో కాంగ్రెస్ యువనేత రాహుల్ ‘మీ బాధలు ప్రధానికి వివరించండి!’ అని చెప్పాడట!

సుబ్బారావు:
పార్లమెంట్ సాక్షిగా... ధరల గురించీ, రైతుల ఆత్మహత్యల గురించీ, నేతన్నల ఈతి బాధలు గురించీ, సెజ్ బాధితుల గురించీ... చెప్పినా దిక్కులేదు. క్రితం సంవత్సరం కర్నూలు వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ ఇప్పటికీ చేసిందేమీ లేదు. ఇంకేం వివరించాలట?

సుబ్బలష్షిమి:
అంతేకాదు బావా, ఈ రాహులుడే... ‘పనిచెయ్యని వాళ్ళని ఎందుకు ఎన్నుకుంటారు?’ అని అడిగాడు తెలుసా!

సుబ్బారావు:
అవున్నిజమే మరదలా! ఈ ప్రధానిని కూడా ప్రజలు ఎన్నుకోలేదు. అధినేత్రి దయతో దొడ్ది దారిన పార్లమెంట్ లోకి ప్రవేశించాడు. అలాంటి అసమర్ద ప్రధానికి ఎన్ని విజ్ఞాపనలు పెట్టుకున్నా ఫలితమేముంటుంది?

సుబ్బలష్షిమి:
అంతే బావా! ‘చెవిటి వాడి ముందు శంఖమూదినట్లు’ అని ఇలాంటి వాళ్ళని చూసే అని ఉంటారు పెద్దవాళ్ళు!

2 comments:

  1. distibomma pradaaniki cheppinaa okate,cheppakunna okate.memu maatram maa samasyalanu soniammaku ,rahulgandhike chebutaamu.ikkada chevitivaadu rahulgandhi ,pariskarinche satta vundi pradhaniki cheppamanadam,rajakeeyaalu vantabattinatlunnayi,rahul pradhani kaavadaanni e incidentlu suchistunnayi

    ReplyDelete
  2. gajula గారు: మీ వ్యాఖ్యలు తెలుగులో వ్రాస్తే ఇంకా బాగుంటుందే కదా? వ్యాఖ్య వ్రాసినందుకు కృతజ్ఞతలు.

    ReplyDelete