Monday, August 23, 2010

అతడు టాటా, ఇతడు వేటా, తేడాలేదూ!?

[‘వేటా’ హరికృష్ణ ప్రసాద్ అరెస్ట్ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈవీఎం లను టాంపర్ చేయటం సాధ్యమేనని నిరూపించిన హైదరాబాద్ వేటా సంస్థలో ఐటీ నిపుణుడు వేమూరి హరికృష్ణ ప్రసాద్ ను, మహారాష్ట్ర పోలీసులు, ఈవీఎం ని దొంగతనం చేశాడన్న నేరం మోపి, అచ్చం దొంగని అరెస్టుచేసినట్లుగా... శనివారం తెల్లవారు ఝామున అరెస్టు చేసి తీసికెళ్ళారట.

సుబ్బారావు:
అంతే కాదు మరదలా! ఏప్రిల్ 28 న అతడు ఓ తెలుగు ఛానెల్ లో డెమో చూపించాడట. అప్పటి వరకూ కూడా, తమ ఈవీఎం చోరికి గురయ్యిందని తెలుసుకోలేక పోయిన ప్రభుత్వం, టీవీలో ఈవీఎం నెం. ని గుర్తుపట్టి, చోరీ అయిన వస్తువు ‘వేటా’ హరికృష్ణ ప్రసాద్ దగ్గర దొరికింది కాబట్టి, అతణ్ణే దొంగని పట్టుకెళ్ళింది. అదీ సంగతి!

సుబ్బలష్షిమి:
ఎంత చక్కని రెడ్ టేపిజం బావా!? అతడు నిరూపించిన ఈవీఎం టాంపరింగ్ తమ పరిధిలోనిది కాదు. పోయిన యంత్రం అతడి చేతికొచ్చింది కాబట్టి అతడే దొంగనడం తమ పరిధిలోది కాబట్టి అరెస్ట్ చేశారు. అతడే దాన్ని దొంగిలిస్తే, పబ్లిక్ గా టీవీలో ప్రోగ్రాం ఇస్తాడా?

సుబ్బారావు:
మరో తమాషా చూడు మరదలా! వాళ్ళ పరిభాషలో... ఈవీఎం లతో సహా ‘వేటా’ రెడ్ హాండెడ్ దొరికినట్లే, కంట్రోలు రూం+ఆయుధాల నిల్వతో సహా ‘టాటా’ (తాజ్ హోటల్) కూడా రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు కదా? మరి దాదాపు రెండేళ్ళవుతున్నా... టాటాకు సంబంధించిన తాజ్ ఇంటర్నేషనల్ లో పాక్ తీవ్రవాదులు కంట్రోలు రూం ఎలా ఏర్పరుచు కున్నారో కూడా పట్టించుకోలేదేం మహారాష్ట్ర పోలీసులు?

సుబ్బలష్షిమి:
మరి అతడు టాటా, ఇతడు సామాన్య ‘వేటా’... తేడా లేదూ! టాటా చేసింది పాక్ కీ సహకారం, తద్వారా యూపీఏ కి ఉపకారం! ఇప్పుడు వేటా చేసింది యూపీఏ కి అపకారం! తనకి ఇబ్బంది కలిగిస్తే సోనియా ఊరుకుంటుందా? సతాయించదూ మరి!

19 comments:

  1. టాటా కంట్రోలు రూం+ఆయుధాల నిల్వతో సహా దొరకడం ఏమిటి? కొంచెం వివరంగా చెబుతారా, లేక ఇది కూడా మీ కాన్స్పిరసీ థీరీలలో ఒకటా?

    ReplyDelete
  2. Electronic Voting Researcher Arrested Over Anonymous Source

    http://www.youtube.com/watch?v=rKTSW-CA_x0&feature=player_embedded

    ReplyDelete
  3. chivaraku Tata gari meeda kuda ninda vesesaru kada.

    ReplyDelete
  4. మళ్ళీ ఈవీఎంల గురించి ఎవరూ మాట్లాడకుండా ఇదొక హెచ్చరికలాంటిదన్నమాట ఈ అరెస్ట్.

    ReplyDelete
  5. సత్యాన్వేషి గారు, రెండవ అజ్ఞాత గారు: అమ్మఒడిలో ముంబై ముట్టడి గురించి పాత టపా చదువుకుంటే మీకే అర్ధమవుతుంది.

    మొదటి అజ్ఞాత గారు: నెనర్లండి.

    చిలమకూరు విజయమోహన్ గారు: :)

    ReplyDelete
  6. లింకివ్వండి. మీ వందల టపాలలో అది మేము వెతకడం అసాధ్యం. అందరి మీదా దేశ ద్రోహం, గూఢాచర్యం లాంటి అభియోగాలు మోపుతారు, వాటి గురించి ఎవరు ప్రశ్నించినా నా టపా లన్నీ మొదటినుంచి చదివితే తెలుస్తుందని సెలవిస్తారు, ఎలాగూ మీ టపాలన్నింటినీ చదవడం ఎవరికీ సాధ్యం కాదనేది మీ ధైర్యమా?

    గోబెల్స్ ప్రచారంలో మీరు ఈనాడు, సాక్షిలను మించిపోయారు, ఇది నాల్గవ కణికవ్యవస్థలో భాగమా? టాటాలు మనదేశంలో అత్యంత గౌరవనీయమైన పారిశ్రామికవేత్తలు, అలాంటి వారిపై మీ చత్త కాన్సిరసీ థీరీలతో అభియోగాలు మోపడం అసహ్యంగా లేదూ? నిజంగా మీధగ్గర సాక్ష్యాలు ఉంటే బయట పెట్టండి.

    మీ సుబ్బ లచ్చిమికీ, సుబ్బారావుకీ అనుమానం జబ్బు ఉన్నట్లుంది. సైకియాట్రిస్టు దగ్గరికి తీసుకెల్లండి.

    ReplyDelete
  7. సత్యాన్వేషి గారు: అమ్మఒడిలో మా టపాలను వెదకటం చాలా సులువు. అన్ని టపాలు ఒకే చోట అనే లేబుల్ ను క్లిక్ చేయండి. మీ సత్యాన్వేషణ ఫలించాలని ఆశిస్తూ క్రింద మీరడిగిన లింక్ ఇచ్చాను. ఆపై మీ ఓపిక!
    http://ammaodi.blogspot.com/2008/12/blog-post_04.html

    ReplyDelete
  8. మీ టపాని చూశాను. అందులో మీరు సంధిచిన కొన్ని ప్రశ్నలూ, మీడియాను తిట్టిపోయడం, మీడియా ఇలా ఎందుకు ఆలోచించగూడదు, అలా ఎందుకు చెయ్యగూడదు అని చెప్పడం తప్ప మీరు నిరూపించిందంటూ ఏమీ లేదు.

    టాటాల గురించి మీరు నిరూపించిందేమిటి? అంత పెద్ద తపాలో మామూలు సోది అంతా తీసివేస్టే మీరు చెప్పిన సారాంశము ఇది:

    1. అంత పెద్ద హోటల్లో టెర్రరిస్టులు అంతా తెలిసినట్లు తిరిగారు.
    2. రెక్కీ చెయ్యకుండా అది అసాధ్యం.
    3. హోటల్లోకి మందు గుండు సామాగ్రి ముందే వచ్చింది.. ( ఇది ఒక థీరీ మాత్రమే).
    4. టెర్రరిస్టులు ఒకవేళ రెక్కీ చేసి ఉంటే వారిని సరిగా తనిఖీ చెయ్యలేదు.

    ఈ పై premices ద్వారా మీరు ఇందులో టాటాల కుట్ర ఉందని ఎలా నిర్ధారించారో సెలవిస్తారా? ఆ తరువాత ఈ కుట్రంతా టాటాలే చేపించారని తపాకాయలమీద టపాకాయలు పేల్చారు. మీ గోబెల్స్ ప్రచారంలో మీరు టిపికల్ మీడియా లాగ వ్యవహరిస్తున్నారు..ముందు కొన్ని అర్ధం లేని ప్రశ్నలడిగి అందరినీ కన్‌ఫ్యూజ్ చెయ్యడం ఆ తరువాత ఎవరినో దోషిగా మీరే జడ్జ్ చేసి దుమ్మెత్తిపొయ్యడం.

    లింకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే సోనియా గంధీనీ, రమోజీ రావుని, మన్‌మోహన్ సింగుని గూఢాచారులంటూ ఎక్కడ నిరూపించారో కూడా లింకులిస్తారా?

    ReplyDelete
  9. నేనేమీ ఈవీఎంల విషయంలో హరిప్రసాద్ అరెస్టును సమర్ధించడం లేదు. అయితే ఇలా తలా తోకా లేని కన్స్పిరసీ థీరీలతో దేశంలో అందరినీ టెర్రరిస్టులు గానూ, గూఢాచారులుగానూ ముద్ర వేయడం మానండి.

    చివరగా నాదో చిన్న ప్రశ్న..రామోజీ రావూ, సోనియా గాంధీ గూఢాచారులన్న విషయం ఎవరికీ తెలియకపోయినా మీకు మాత్రమే ఎలా తెల్సింది? దీన్ని బట్టి మీరు కూడా గూఢాచారే అని నిర్ధారించవచ్చా?

    ReplyDelete
  10. రామోజీ రావు, సోనియా గాంధీ, అద్వానీ గురించి రాసిన టపా దొరికింది లెండి. మీ ఊహా శక్తికి డాన్ బ్రౌన్ కూడా సిగ్గుపడుతాడేమో. డావించి కోడ్ కూడా దీని ముందు దిగదుడుపే.

    ఇందులో నిజం ఎంత అనే సంగతి వదిలేస్టే మీ క్రియేటివిటీకి మెచ్చుకోవాలి.

    ReplyDelete
  11. సత్యాన్వేషి, నీకు నిజం గా సత్యం తెలుసు కోవాలంటె ఈ రోజులలో నెట్ చాలు. ఊరకనే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం తగదు. తమరికి తెలుసో లేదో మొదట ఈ బ్లాగులోనే ఇ.వి.యం.ల సంగతి రాసింది. అది ఈ రోజు నిజమైంది కదా. మీకు అది కాన్సిపిరసి థియరిగా అనిపిస్తె ఎవ్వరు ఎమీ చేయలేము. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కి అసలి రంగు అర్థమై డిల్లిలో అందరి మద్దతు కూడ గట్టటానికి వేళ్లాడు. అదే ఆరోజు మొదట ఇక్కడ చెప్పినప్పుడు నేను కూడా మీలాగే ఈవిడకి ఇదె పని అనింటిని అనుమానించటమే అని అనుకున్నాను.
    ------------------------------------------------
    మీరు ఒకసారి ఆలోచించండి మీడియా అనేది ఒక లక్ష్యం తో ప్రజలను చైతన్య పరచాలి. కాని అది ఆ విధంగా ఈ నాడు ఉందా అనేది ఒక పెద్ద ప్రశ్న. ప్రింట్, టి.వి. మీడియా వారు మనలో ఏమాత్రం దేశభక్తిని పెంపొందిచగలిగారు. ఎంత సేపటికి వాడు ఇన్ని కోట్లు తిన్నాడు, ఇంత అవినీతి అది ఇది రాయటం. ఈ రోజు మీడియా వారు అచ్చం పత్రికలు నడిపితే వారింత సంపాదించేవారా? వీరు ఎవరి మేలు కొరకు పని (ప్రజలా/ప్రభుత్వమా/వారి స్వలాభామా ఐతే వీరికి ఎంత లాభం కావాలి?) చేస్తున్నారో మాకు ఒక టపామీ బ్లాగులో రాయండి.

    ReplyDelete
  12. అన్వేషి అమే క్రియేటివిటీని చాలా తక్కువ అంచనా వేసినందుకు నిన్ను జూస్త ఉంటె నవోచ్చాంది. ఎదో ఆమే బ్లాగు పెట్టి రాస్తున్నాది గందా నీస్థాయని అనుకోమాక. ఒకటి జెప్పు ఇంట్లో బాంబు పేలితె ఇల్లు గలవాడిని పోలిసోళ్ళు ప్రశ్నిస్తారా లేదా? మరి బాంబే లో ఎనత మంది హోటల్ యజమానులని పోలిసోళ్ళు ప్రశ్నించారు? వివరాలు తెలిస్తె జెప్పెదీ.

    ReplyDelete
  13. మూడవ అజ్ఞాత గారు: మనసారా కృతజ్ఞతలండి!

    ReplyDelete
  14. పై అనామకుడికి

    నేను ఆవిడ క్రియేటివిటీని తక్కువ అంచనా వెయ్యలేదు, పైపెచ్చు మెచ్చుకున్నాను. అయితే తన దగ్గర ఉన్న స్మాచారాన్నీ, క్రియేటివిటీని ఉపయోగించి చక్కని రచనలు చేస్తే బాగుంటుంది కానీ ఇలా టాటాలతో సహా అందరిపైనా నిందలు వెయ్యడం, అందరినీ అనుమాంచడం సరికాదేమో ఆలోచించండి.

    నేను మీరడిగినట్లే నా బ్లాగులో టపా రాశాను, కానీ మీరు మాత్రం అనామక ముసుగు తొడుక్కునే ఉన్నారు, ఆ ముసుగు తీస్తే ఎక్కడ మిమ్మల్ని చూసి జనం నవ్వుతారోననే భయమా?

    ReplyDelete
  15. సత్యాన్వేషి,
    బాంబే లో ఎంత మంది హోటల్ యజమానులని పోలిసులు విచారించారు అని అడిగితే దానికి జావాబులేదు. వెటకారం గా రాసుకోవాలంకుంటె నీ ఇష్టం వచ్చినట్టు రాసుకో ఎవ్వరికి అభ్యంతరం లేదు. ఈ దేశం లో రాష్ట్రపతి,ప్రధాన మంత్రి,మంత్రుల నుంచి కింద స్థాయి వారి వరకు ప్రతి ఒక్కరు కోర్టు కేసులు ఉన్నాయి. మరి వారి తో పోల్చుకున్నపుడు ఈ బిజినెస్/ఇండస్త్రలిస్ట్ ల కేమైనా కొమ్ములు ఉన్నాయా ? వీరిని పోలిసు విచారణ జరపకుడదు అనడానికి? అది వదిలేసి కర్కరేని చంపిన వారు కసాబ్ తో వచ్చిన వారు కాదు, వేరే వరో చంపి ఉంటారు అని హాస్యాస్పదం గా మాట్లాడిన అంతులే, అతనికి మద్దతిచ్చిన దిగ్విజయ్ సింగ్ లాంటి వారిని ఎమీ అనాలి. దీనిమీద తమ అమూల్య సమాధానమివ్వాలి. ఇక్కడ రాసేవి మీకు తమాషాగా అనిపిస్తే పైన చెప్పిన అంతులే గారి వ్యాఖ్యలు ఆయనను సర్ధించిన దిగ్విజయ్ గారి మాటలు తమాషాగా లేవా? వీరిద్దరు ఒకప్పుడు ముఖ్యమంత్రి గా కూడా పని చేశారు. వారు మాట్లాడిన దానిలో నీకు ఎమైనా సిరియస్ నెస్ కనిపిస్తే /నిజమని నమ్మితే తమరు ఒకటపా రాయండి. చదివి సంతోషిస్తాం. అసలికి ఇప్పటి వరకు బాంబె సంగటన లో జరిగిన ప్రగతీ ఎమీటో తమరికి తెలిస్తె చెప్పేది. నాకు తెలిసి ఆ దోషులను పట్టు కోవటం, పాకిస్తాన్ మీద ఒత్తిడి తేవటం ఎమీ చేయక పోగా. ఈ రోజు చిదంబరం గారు హిందూ ఉగ్ర వాదం దాని ప్రమాదం గురించి మాట్లాడుతున్నారు. ఇక కర్కరే చావు మీద ఇటువంటి కథలు రాస్తున్నారో ఈ క్రింది పుస్తకం చదివేది.ఇలా ప్రతి సంఘటనను అసలు జరిగిన దొకటైతే విచారణ ఇంకొక విధంగా చేపట్టం నీకు తమాషాగా అనిపించటం లేదా? నీకు ఈ బ్లాగులో రాసేది తామాషా ఐతె అంత మంది భాద్యత గల వారు చేసే పనిలో తమాషా లేదని నిరూపించు చేతనైంతే .
    http://sahacharudu.blogspot.com/2010/08/blog-post_23.html

    ReplyDelete
  16. తమరి ఈ టపాకి మొదటి వ్యాఖ్య రాసిన వారు ఒక సర్కారు ఉద్యోగి. వారికి ఆఫీసులో ఎంత పని పాటాలేదొ అర్థమౌతున్నాది. వారి రాసిన చీకటి ఈగల దినానికి ఒక్క కామేటోచ్చేసరికి బోర్ కొట్తి ఇంకొక కొత్త బ్లాగు మొదలు పేట్టింది. అది వారి మాటల లలోనె చదవండి.
    మరొక 'న్యూబ్లాగు'
    అందరికీ తన్దనాలు.
    అనుకోకుండా తెరచి,
    చాలా ఇష్టపడే నడిపినా,
    చూసేవాళ్ళు లేక,
    కామెంట్లు పెట్టేవాళ్ళూ అస్సలు లేక,
    నా 'దురద పూలు'
    ఇప్పుడు బోరు కొట్టేసింది
    వ్యాఖ్యలతో గోక్కోవటానికి ఎవరు ముందుకు రావటం లేదు
    అందుకనే నా ముఖకవళిక మొదలు పెడుతున్నాను

    ReplyDelete
  17. చివరి అజ్ఞాత గారు: మీరు మరో బ్లాగులో ఇవ్వాల్సిన వ్యాఖ్యని ఈ బ్లాగులో ఇచ్చినట్లున్నారు. :)

    ReplyDelete
  18. సత్యాన్వేషి గారు మరీ అంతలా జుట్టుపీక్కోనవసరం లేదు. వెళ్ళీ ఓ సెటైర్ వేసుకోండి, ఆ ఇద్దరు అమ్మలక్కలు మిమ్మల్ని కామెంట్లు పెడతారు. లేకపోతే, మీరు బాంబులు ముందే చేరవేశారనడాన్ని ఓ థియరీ అని ఎలా కొట్టివేస్తారు? కమ్యూనికేషన్ వ్యవస్థే నెలల క్రితం ఏర్పాటుచేసుకున్న వాళ్ళకి ఆమాత్రం చేతకాదనా మీ థియరీ? మీకంత బాగా ఎలాగ తెలుసుసు? ఆ కణిక వ్యవస్థలో మీరు భాగస్వాములా?

    ReplyDelete
  19. సత్యాన్వేషి, ఇక్కడ మన మెవ్వరం జాతీయ నాయకులు అవుదామని, ప్రపంచం మార్చుదామని బ్లాగులు రాయటం లేదు. కాక పోతె మనం పరిశిలించిన వాటిని చర్చించు కుంట్టున్నాము అంతె. దీని అర్థం మన అవగాహన శక్తిని మెరుగు పరచుకుంట్టున్నాం అంతే. దీనివలన లాభం ఎమైనా ఉందా అంటె ఉంది. అది ఎవిధంగా నంటె రోజు టి.వి. లో యాడ్స్ చూస్తున్నంత సేపు వాడు చెప్పెది సరిగా ఉన్నట్టు అని పిస్తుంది. కారణం చాలా క్రిటివ్ గా,పెద్ద పెద్ద నటులతో,అందగత్తెలతో వాడు అవి తీయటమే. ఉదా|| చిన్నపుడు నువ్వు సినేమాతారల సౌందర్య సబ్బు లక్స్ అని చూపిస్తే కొన్ని సంవత్సరాలు నమ్ముతాము. తరువాత ఆ యాడ్ చెప్పే నిజం మనకి పెరిగి పెద్దైన తరువాత అర్థమౌతుంది. ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్, బేబో (కరీనా కపూర్) లాంటి వారు లక్స్ సబ్బు ఎందుకు వాడుతారు? వారికి ఎమైనా పిచ్చా? అంత డబ్బులు సంపాదిస్తూ మార్కేట్ లో తక్కువ రకం లక్స్ సబ్బు వాడరని నీకే అర్థ మౌతుంది. ఆ యాడ్ డబ్బుల కొరకు చేసారని ఎవరు చెప్పక పోయిన నీకె తెలుస్తుంది. ఈ విషయమే మీ తల్లిదండృలు నువ్వు 5 వ తరగతి చదివేటప్పుడు చెపితె నువ్వు నమ్మవు. నువ్వు డిగ్రి మొదటి సం|| చదువుతుంటె ఆ వయసుకి ఎవరు చెప్పక పోయినా అర్థమౌతుంది. ఒక సారి ఇలా అర్థ మైన తరూఅత ఆ యాడ్ ని చూసి సబ్బు కొనడం మానుకుంటావు. ఆ యాడ్ నిన్ను ఇక ఏమాత్రం ప్రభావితం చేయదు. నీకు ఎది కావాలో, మంచి సబ్బో దానిని నీ బుద్దిని ఉపయోగించి కొనుకుంటావు. నేను ఇక్కడ నా పేరు రాయక పోవటానికి కారణం కూడా అదే. నీకు నేను చెప్పెదానిలో నిజమని అనిపిస్తె నమ్ము లేక పోతె వదిలేసెది. నేను భయపడి అనామికుడు గా రాస్తున్నాని అనుకోవద్దు. నా ఆలోచన నచ్చితే స్వికరించు/ఆలోచించు లేక పోతె చెత్త బుట్టలో పడెసి మరచి పోయెది. మన దేశం లో పూర్వికులు పెద్ద పెద్ద గ్రంథాలు రాసి కూడా వారి పేరు ఎక్కడా పేట్టుకోలెదు. కారణం వారి ఉద్దేసం వారి చెప్పిన దాంట్లో నిజాయితి,సత్యం ఉంటె అది కాల ప్రవాహం లో నిలుస్తుంది అవి లేక పోతే/ప్రజలకు ఉపయోగ పడక పోతే అవి రచయిత గత చరిత్ర వలన/పేరు ప్రఖ్యాతుల వలన ప్రజలు చదవ వలసిన అవసరం లేదని వారి అభిప్రాయం. నువ్వు సత్యాన్వేషివి గనుక నేను చెప్పినదానిలో/అడిగిన ప్రశ్నలలో సత్యం ఉంటె గ్రహించేది. I love you.

    ReplyDelete