Wednesday, September 1, 2010

ఇది బాహాబాహీ, ముష్టా ముష్టీ లాగా... శిఖా శిఖీ పోరాటమన్న మాట!

[ప్రధాని శుభ్రం చేసినా.... వేదికలు సిద్దం కావు. కామన్వెల్త్ క్రీడల నిర్వహణపై నరేంద్రమోడీ విమర్శ - నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కామన్వెల్త్ క్రీడలు జరిగే ప్రాంగణాలని అత్యంత నాసిగా నిర్మించారనీ, ప్రధాని శుభ్రం చేసినా క్రీడల ప్రారంభం నాటికి వేదికలు సిద్దం కావనీ నరేంద్రమోడీ విమర్శించాడు. మరో ప్రక్క వందల కోట్లలో అవకతవకలు జరిగాయని వార్తలు! ఇంతకీ ప్రధాని వచ్చి ఊడ్చాలంటాడా ఏం? అయినా గానీ.... మరీ ప్రధానిని పట్టుకుని, అంత మాట అనేసాడేం బావా, నరేంద్ర మోడీ?

సుబ్బారావు:
మరేం చేస్తాడు మరదలా? చర్యకు ప్రతిచర్య ఇలాగే ఉంటుంది. అతడి కడుపుమంట అతడిది. తన కుడి ఎడమ భుజాల వంటి అనుచరుల్ని సీబీఐ ద్వారా వేధించారని అతడి దుగ్ధ! అసలుకే సీబీఐని అడ్డం పెట్టుకుని, ప్రభుత్వం తమపైన కక్ష సాధింపులూ, కెరీర్ నాశనాలూ చేస్తొందని భాజపా వాళ్ళు పార్లమెంటులోనే గోల పెట్టారు కూడా!

సుబ్బలష్షిమి:
ఓహో! అయితే ఇది బాహాబాహీ, ముష్టా ముష్టీ లాగా... శిఖా శిఖీ పోరాటమన్న మాట!

సుబ్బారావు:
అదేమిటి?

సుబ్బలష్షిమి:
అంటే ఏముంది బావా? జానపద గీతం ఉంటుంది చూడు!
"జుట్లు జుట్లు పట్టుకుని కొట్టుకున్నా మప్పో
తిట్టుకున్నా మప్పో!" అని. అలాగన్న మాట!

4 comments:

  1. chaala correctgaa cheppavu dr.subbalaxmi(nenu docterate ichaanu kadaa,marchipoyaavaa?)

    ReplyDelete
  2. gajula గారు: గుర్తుంది కాని....

    ReplyDelete
  3. తప్పేముంది?

    రేప్పొద్దున్న యే అకాల్తఖ్త్ వాడో మన్మోహన్ తప్పుచేశాడు, ప్రజల బూట్లు శుభ్రం చెయ్యాలి--అంటే, చెయ్యడా మరి? (బూటా సింగ్ కే తప్పలేదు, బర్నాలకీ తప్పలేదు)

    ReplyDelete
  4. కృష్ణశ్రీ గారు: నిజమే సుమా!

    ReplyDelete