Monday, September 6, 2010

ఎక్కడైనా బావా గానీ వంగ తోట కాడ మాత్రం కాదు!

[ప్రాణాలైనా తీసుకొండి. తెలంగాణా ఇవ్వండి - కేకే వ్యాఖ్య నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ తెలంగాణా కాంగ్రెస్ నాయకుడు కె.కె..... "ప్రాణాలైనా తీసుకొండి, తెలంగాణా ఇవ్వండి" అంటున్నాడు తెలుసా?

సుబ్బారావు:
అంత త్యాగమెందుకులే మరదలా! ఎటూ అమాయక విద్యార్ధులు ప్రాణాలిస్తూనే ఉన్నారు కదా? "తెలంగాణా సాధన కోసం ఏ త్యాగమైనా చేస్తాం" అనే కేకేలు, కేసీఆర్ లు వంటి నాయకులంతా.... ప్రాణాలొద్దు గానీ, ఇప్పటి వరకూ నానా రకాలుగా కూడబెట్టిన తమ ఆస్థులన్నిటినీ త్యాగం చేసి, తెలంగాణా లోని పేద ప్రజలకి పంచిపెట్టమను. దెబ్బకి, తెలంగాణా ఎలా రాదో చూద్దాం!

సుబ్బలష్షిమి:
అబ్బా ఆశ దోస అప్పడం! ఏదో ప్రాస కోసం "ప్రాణాలైనా ఇస్తాం" అంటారు గానీ, ఆస్థుల్ని ఇచ్చేస్తారేమిటి? ‘ఎక్కడైనా బావా గానీ వంగ తోట కాడ మాత్రం కాదన్న’ సామెత, కేకేలకీ, కేసీఆర్ లకీ, టీజీ వెంకటేష్ లకీ, బొత్సలకి బాగా తెలుసు!

5 comments:

  1. Take worthless lifes, but not our ill-gotten wealth

    ReplyDelete
  2. maa bhaagaa cheppavu subbalaxmi.

    ReplyDelete
  3. అసలు ఒకరి ఆస్తి ఇంకొకరికి ఎందుకివ్వాలండి ? పేదరికం ఆస్తి కి అర్హత కాదు ..మంచి పనులకి ఉపయోగించమనండి..ఎలా ముందుకు రారో చూద్దాం.. అయితే ఒక పని చెసినప్పుడు ప్రతి ఫలం అనెది వస్తుంది..అలా చేస్తె కార్పొరేట్ పోకడలు అంటారు .

    ReplyDelete
  4. వ్యాఖ్యానిచ్చిన అందరికి నెనర్లు!

    ReplyDelete