Saturday, September 25, 2010

ఇంతకంటే గొప్ప పరిపాలనని ఇంకెవరూ అందించలేరేమో!

[కల్మాడీకి కత్తెర! మన్మోహన్‌తో సమావేశానికి దూరం. క్రీడాగ్రామం బాధ్యతల్లో కోత! ఇకపై నిర్వహణ ఢిల్లీ ప్రభుత్వానిదే! ప్రధాని చొరవతో మారిన పరిస్థితి - ఈనాడు (24/09/10) తొలిపేజీ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కామన్వెల్త్ క్రీడల నిర్మాణాలు, నిర్వహణల్లో... వేలకోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శుభ్రతతో సహా ఏర్పాట్లు పరమనాసిగా ఉన్నాయని, బీబీసీతో సహా అంతర్జాతీయ మీడియా... ఫోటోలు, వీడియోలు విడుదల చేసీ మరీ గోలపెడుతోంది. కొందరు ఆటగాళ్ళు పాల్గొనేందుకు తిరస్కరిస్తున్నారని వార్తలొస్తున్నాయి. అవసరం లేకున్నా... అల్లంతదూరంలో యమున నదికీవలి ఒడ్డున, ఆవలి ఒడ్డునున్న ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కుమారుడు(ఎంపీ) సందీప్ దీక్షిత్ నియోజక వర్గానికి సమీపదూరంలో ఉండేటట్లుగా, క్రీడాగ్రామం నిర్మించబడిందనీ వార్తలొచ్చాయి.

ఓ దశలో విలేఖరుల ప్రశ్నలెదుర్కోలేక కర్మాడీ పక్కాగా పరుగందుకున్న ఫోటోలు కూడా వార్తల్లో వచ్చాయి. అలాంటి కల్మాడీని... సమావేశానికి దూరంగా ఉంచటంతో, ప్రధానమంత్రి చొరవ తీసుకున్నట్లేనట! దాంతో ‘పరిస్థితి మారినట్లేనని’ ఈనాడు వ్రాసింది. అంటే ఏమిటి బావా!?

సుబ్బారావు:
ఏముంది మరదలా! కల్మాడిని ఒక్క సమావేశానికి దూరంగా ఉంచితే సరి! జరిగిపోయిన అవకతవకలనీ పరిష్కరించినట్లే! జరుగుతున్న, జరగబోయే అవినీతిని కూడా అరికట్టినట్లే! పోయిన దేశం పరువు వచ్చినట్లే! ఎంత గొప్పగా భాష్యం చెప్పబడిందో చూశావా! వినేవాడుంటే ఏదైనా చెప్పచ్చునని దాని అర్ధం!

సుబ్బలష్షిమి:
నిజమే బావా! ఇంతకంటే గొప్ప పరిపాలనని ఇంకెవరూ అందించలేరు. ఈ లెక్కన... పార్ధసారధి, ఆచార్యలని ఒక్క సమావేశానికి పిలవకపోతే ఎమ్మార్ దోపిడి కూడా పరిష్కరింపబడినట్లే కదా!?

2 comments:

  1. ఆచార్య అసలు సమావేశమే జరగనివ్వడం లేదుగా!

    మీ బ్లాగ్ మీద నా టపాకి ఓ లింక్ ఇచ్చాను. మీరింకా చూడలేదనుకుంటా. ఇప్పుడు చూడండి.


    http://amtaryalu.blogspot.com/2010/08/5.html

    ReplyDelete
  2. కృష్ణశ్రీ గారు: అక్కడ కామెంటానండి! నిజానికి ఎప్పుడో చూసానండి! కాకపోతే ఆ విషయం మీద కామెంట్ చేయలేదు! అంతే!:) ఒక సారి నాకు మెయిల్ ఇవ్వగలరా?

    ReplyDelete