[కందిపప్పు ధర తప్ప మిగిలిన ధరలన్నీ అదుపులోనే ఉన్నాయన్న ముఖ్యమంత్రి – వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
ఇదేమిటి బావా, ఈ ముఖ్యమంత్రి ఇలాగంటున్నాడు? బియ్యం కిలో 35/-రూ. కీ, అన్నిపప్పులు, పంచదార, కూరగాయలతో సహా రేట్లు అన్ని పెరిగి ఉంటే, ఒక్క కందిపప్పు ధర తప్ప మిగిలిన వస్తువుల ధరలన్నీ అదుపులోనే ఉన్నాయంటున్నాడు?
సుబ్బారావు:
ఓసి పిచ్చిమరదలా! ముఖ్యమంత్రి మాటలకి అర్ధం అది కాదు. ’ధరలు కాదు అదుపులో ఉంది, ప్రజలన్నమాట’. తెలిసిందా! ఎందుకంటే ప్రజలు ఎటూ బియ్యం కూరగాయలూ, ఇతర వస్తువుల ధరలకి అలవాటు పడిపోయారు కదా?
సుబ్బలష్షిమి:
బాబోయ్! అంటే కందిపప్పు ధరకూడా 80/-Rs. నుండి 90/-Rs. దాకా ఉండటానికి అలవాటు పడిపోయాక, కందిపప్పు ధర కూడా అదుపులోనే ఉందంటాడన్న మాట.
సుబ్బారావు:
మరంతే!
*************
Wednesday, July 22, 2009
Subscribe to:
Post Comments (Atom)
baagunnadandi
ReplyDeleteతేలు కుట్టిన దొంగలం. ఎన్నుకున్నాం ,ఆయనేరకంగా మాట్లాడినా నోరు విప్పలేము కదా !
ReplyDeleteచిలమకూరు విజయ మోహన్ గారు,
ReplyDeleteమనమెక్కడ ఎన్నుకున్నామండీ బాబూ! కాగల కార్యమంతా EVM లు తీరిస్తే!