Wednesday, July 22, 2009

ధరలు కాదు అదుపులో ఉంది , ……….

[కందిపప్పు ధర తప్ప మిగిలిన ధరలన్నీ అదుపులోనే ఉన్నాయన్న ముఖ్యమంత్రి – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఇదేమిటి బావా, ఈ ముఖ్యమంత్రి ఇలాగంటున్నాడు? బియ్యం కిలో 35/-రూ. కీ, అన్నిపప్పులు, పంచదార, కూరగాయలతో సహా రేట్లు అన్ని పెరిగి ఉంటే, ఒక్క కందిపప్పు ధర తప్ప మిగిలిన వస్తువుల ధరలన్నీ అదుపులోనే ఉన్నాయంటున్నాడు?

సుబ్బారావు:
ఓసి పిచ్చిమరదలా! ముఖ్యమంత్రి మాటలకి అర్ధం అది కాదు. ’ధరలు కాదు అదుపులో ఉంది, ప్రజలన్నమాట’. తెలిసిందా! ఎందుకంటే ప్రజలు ఎటూ బియ్యం కూరగాయలూ, ఇతర వస్తువుల ధరలకి అలవాటు పడిపోయారు కదా?

సుబ్బలష్షిమి:
బాబోయ్! అంటే కందిపప్పు ధరకూడా 80/-Rs. నుండి 90/-Rs. దాకా ఉండటానికి అలవాటు పడిపోయాక, కందిపప్పు ధర కూడా అదుపులోనే ఉందంటాడన్న మాట.

సుబ్బారావు:
మరంతే!
*************

3 comments:

  1. తేలు కుట్టిన దొంగలం. ఎన్నుకున్నాం ,ఆయనేరకంగా మాట్లాడినా నోరు విప్పలేము కదా !

    ReplyDelete
  2. చిలమకూరు విజయ మోహన్ గారు,

    మనమెక్కడ ఎన్నుకున్నామండీ బాబూ! కాగల కార్యమంతా EVM లు తీరిస్తే!

    ReplyDelete