Monday, September 14, 2009

పంచెకట్టుకున్నంత మాత్రానా ప్రజానాయకులైపోతారా?

[ముఖ్యమంత్రి రోశయ్య బూట్లు వేసుకువచ్చారన్న,ఈనాడు ’ఇదీ సంగతి’ వంటి కార్టూన్ల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ముఖ్యమంత్రి రోశయ్య, మరణించిన ముఖ్యమంత్రి వై.యస్.ఆర్. లాగానే షూ వేసుకుంటున్నాడట. అతడిలాగానే ఇతడూ పంచెకట్టుకునే ప్రజానాయకుడు కూడా కదా!

సుబ్బారావు:
బాగుంది మరదలా! చీర కట్టుకున్నంత మాత్రాన ఇటలీ గాంధీ ఇందిరాగాంధీ అయిపోతుందా?, పంచెకట్టుకుని బూట్లు వేసుకున్నంత మాత్రాన వై.యస్సార్లూ, రోశయ్యలూ పీవీజీలు అయిపోతారా?

సుబ్బలష్షిమి:
నిజమే బావా! పులితోలు కప్పుకున్నంత మాత్రానా గాడిద పులై పోదని, గాలివీచి పులితోలు ఎగిరిపోగానే చావు దెబ్బలు తిన్నదనీ, చిన్నప్పుడు పంచతంత్రంలో చదివినట్లు గుర్తు!

1 comment:

  1. పాపం ! రోశయ్యగారు ఈ మధ్యనే కదా కుర్చీలో కూర్చున్నాడు ! కొంతకాలం దయదల్చి వదిలేద్దాం లెండి. ఎలా చేస్తాడో ఏంటో చూడాలి గదా !

    --తాడేపల్లి

    ReplyDelete